నిగ‌నిగ‌లాడే ఒత్తైన కురుల కోసం ఇలా చేయండి!

By: KrishnaDivYa P
Subscribe to Boldsky

అమ్మాయిలు అందంగా క‌నిపించ‌డంలో కేశాలంక‌ర‌ణ‌దే కీల‌క పాత్ర. అలాంటి మీ జుట్టు రాలిపోతుంటే ఏం జ‌రుగుతుంది నిండుద‌నం త‌గ్గి ప‌ల్చ‌గా క‌నిపిస్తుంది. అందుకే మీ కురులు ఒత్తుగా బ‌లంగా పెర‌గాలంటే ఏం చేయాలో ఈ క‌థ‌నంలో చెబుతున్నాం. ఇంకెందుకు ఆల‌స్యం వెంట‌నే చ‌దివేయండి.

మీరు ఎలా క‌నిపిస్తున్నారు అనే విష‌యంలో మీ ఆహార‌పు అల‌వాట్లు, నిద్ర అల‌వాట్లు చాలా పెద్ద పాత్రే పోషిస్తాయి. మీ కురులు రాలిపోతుంటే పౌష్టికాహారం, చ‌క్క‌ని నిద్ర ఉండేలా చూసుకోండి. ఇంకో కార‌ణం ఏంటంటో కుంగుబాటు వ‌ల్ల కూడా జుట్టు రాలిపోతుంది. దీన్ని త‌గ్గించుకునేందుకు శాస్వ‌కు సంబంధించిన క‌స‌ర‌త్తులు చేయండి. మేం చెప్ప‌బోయే టిప్స్ మీ కేశాలు బాగా పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

1. వేడి నూనెతో మ‌ర్ద‌న‌

1. వేడి నూనెతో మ‌ర్ద‌న‌

మీకు ఇష్ట‌మైన ఏదైనా నూనెను కాస్త వేడిచేయండి. దాన్ని మాడ‌కు బాగా ప‌ట్టించండి. మ‌ర్ద‌న చేయండి. దీంతో మాడ‌లో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెరిగి జుట్టు పెరుగుతుంది.

2. షాంపూ అల‌వాట్లు

2. షాంపూ అల‌వాట్లు

వారంలో రెండు లేదా మూడుసార్లు మాత్ర‌మే షాంపూ పెట్టుకోండి. రోజూ పెట్టుకుంటే జుట్టులోని స‌హ‌జ‌మైన నూనెలు త‌గ్గిపోయి రాలిపోవ‌డం మొద‌లవుతుంది. షాంపూ ఎంపిక‌లోనూ జాగ్ర‌త్త వ‌హించండి. ఏది ప‌డితే అది ప్ర‌య‌త్నించ‌కండి. స‌ల్ఫేట్ లేని దాన్ని ఎంచుకోండి.

3. బేబీ పౌండ‌ర్‌

3. బేబీ పౌండ‌ర్‌

మీ జుట్టు క‌రుకుగా గ‌ట్టిగా ఉంటే మీరేం చేస్తారు? కొంచెం బేబీ పౌడ‌ర్‌ను వాడండి. లేదంటే డ్రై షాంపూను మాడ‌కు ప‌ట్టించండి. ఇది మీ జుట్టులోని క‌రుకుద‌నాన్ని త‌గ్గిస్తుంది. త‌రుచూ కురుల‌ను కడ‌గ‌డం మ‌రిచిపోకండి. ఇది మీ కేశాల‌ను మ‌రింత ఒత్తుగా క‌నిపించేలా చేస్తుంది.

4. ర‌సాయ‌నాల‌ను వ‌దిలించుకోండి

4. ర‌సాయ‌నాల‌ను వ‌దిలించుకోండి

మీ కురుల‌ను రింగులుగా ఉంచుకోకుండా స్ట్రెయిట్ చేయ‌డం లాంటివి మానుకోండి. సాధ్య‌మైనంత వ‌ర‌కు స‌హ‌జంగా ఎలా ఉందో అలాగే ఉంచుకోండి. ఇది మీ జుట్టు చిట్లిపోకుండా ఉంచుతుంది. మందం పెంచుతుంది.

5. ఉల్లాసంగా ఉండండి

5. ఉల్లాసంగా ఉండండి

మీ ముఖార‌విందాన్ని చూపించ‌డంలో కుంగుబాటు తీవ్రమైన ప్ర‌భావం చూపిస్తుంది. ఎప్పుడూ కుంగుబాటుకు గురికాకుండా చూసుకోండి. మీకు ఇష్ట‌మైన ప‌నులు చేయండి. పుస్త‌కాలు చ‌ద‌వ‌డ‌మో, న‌డ‌వ‌డ‌మో చేయండి. ఇది మీ మెద‌డు సేద తీరేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో జుట్టు రాల‌డం త‌గ్గిపోతుంది.

6. ఆహార‌పుట‌ల‌వాట్లు

6. ఆహార‌పుట‌ల‌వాట్లు

మీ ఆహార అల‌వాట్ల‌పై శ్ర‌ద్ధ వ‌హించండి. ప్రొటీన్లు పుష్క‌లంగా ల‌భించే ఆహారాన్ని తీసుకోండి. ఇది మీ జుట్టు నిండుద‌నం పెంచుతుంది. టెక్స్ఛ‌ర్‌ను అలాగే చ‌క్క‌గా ఉంచుతుంది. నిండైన‌, ఒత్తైన జుట్టంటే రాలిపోకుండా ఉండ‌ట‌మే అని గుర్తుంచుకోండి.

English summary

How To Increase Hair Volume

How To Increase Hair Volume, Try to include mild forms of breathing exercises to reduce stress. Apart from that, these tips would help your hair grow faster.
Story first published: Saturday, January 27, 2018, 9:00 [IST]
Subscribe Newsletter