For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బలహీనమైన జుట్టుకు, పోషణను అందించగల 7 రకాల చికిత్స విధానాలు !

జుట్టు ఊడక ముందే, జుట్టు యొక్క చిగుళ్ళు బాగా బలహీనంగా ఉన్న సమయంలోనే సరైన చికిత్సను అందించాల్సి ఉంటుంది లేకుంటే, దానిని సరిగ్గా నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. బలహీనమైన జుట్టు మూలాలకు చికిత్స చేయడా

|

జుట్టు ఊడక ముందే, జుట్టు యొక్క చిగుళ్ళు బాగా బలహీనంగా ఉన్న సమయంలోనే సరైన చికిత్సను అందించాల్సి ఉంటుంది లేకుంటే, దానిని సరిగ్గా నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. బలహీనమైన జుట్టు మూలాలకు చికిత్స చేయడానికి, మీరు ఎల్లప్పుడూ సహజమైన చికిత్సా పద్ధతులను ఆచరించాలి.

సేంద్రీయ నూనెల ద్వారానే, జుట్టు మూలాలను బాగా బలపరుస్తాయని అందరికీ తెలిసిన నిజం. కొబ్బరి నూనె మరియు ఆలివ్ నూనె వంటి వాటిలో మరికొన్ని పదార్థాలు కలిసి ఉండటం వల్ల, మీ జుట్టు యొక్క చర్మంలోని బాగా చొచ్చుకొని వెళ్లి, బలహీనమైన మీ జుట్టు మూలాలు బలపరుస్తుంది.

బలహీనమైన జుట్టు మూలాలకు సరైన చికిత్సను అందించే సులువైన మార్గాలను, బోల్డ్ స్కై, ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వీటిని రోజులో కనీసం రెండు సార్లు మీ తలపై చర్మం మీద అప్లై చేయాలి.

7 Treatments To Nourish Weak Hair Roots

మీరు ఈ పదార్ధాలను, మీ తలపై చర్మం మీద అప్లై చేసేటప్పుడు, ఆ పదార్థాలన్నీ మీ తలలోకి 1 గంట పాటు బాగా నానేలా చేసిన తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి.

అందుకే మేము ఈ పదార్ధాలను ఈరోజు నుండే వాడాలని సూచిస్తున్నాము. ఎందుకంటే, ఇది ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నా మీ జుట్టు సమస్యను పరిష్కరించేందుకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జుట్టు సమస్యతో బాధ పడుతున్న మహిళలందరూ స్పందించవలసిన సరైన సమయం ఇదే.

ఈ వేసవి మీ బలహీనమైన జుట్టును తిరిగి బలోపేతం చేయడానికి చేసే ఈ కొత్త చికిత్స పద్ధతులు మీకు ఒక కొత్త మార్గాన్ని తయారుచేస్తాయి. అవేమిటో ఒకసారి చూడండి.

ఎగ్ హెయిర్ ప్యాక్:

ఎగ్ హెయిర్ ప్యాక్:

గుడ్లలో మాంసకృత్తులలో పుష్కలంగా ఉంటాయి, ఒత్తైన జుట్టు కోసం గుడ్డును వాడమని నిపుణులు మనకి సలహా ఇస్తారు. గుడ్డులో ఉండే తెల్లని సొనని మాత్రమే మీ తలపై ఉన్న చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. గోరువెచ్చని నీటితో మరియు సహజసిద్ధంగా తయారు చేయబడిన షాంపూతో మీ జుట్టును శుభ్రంగా కడగాలి.

మిల్క్ హెయిర్ ప్యాక్:

మిల్క్ హెయిర్ ప్యాక్:

మీ జుట్టును శుభ్రం చేసినప్పుడు, అధికంగా ఉన్న నీటిని తొలగించి, మీ జుట్టు కాస్త తేమగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మీ జుట్టు యొక్క కుదుళ్ళలోకి - పాలు బాగా ఇంకేలా చేతివేళ్లతో మసాజ్ చేయాలి. అలా చేసిన కొద్ది సేపటి తరువాత, మీ జుట్టును గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి పొడిగా చెయ్యాలి.

హెన్నా హెయిర్ ప్యాక్:

హెన్నా హెయిర్ ప్యాక్:

హెన్నా అంటే గోరింటాకని మనందరికి తెలుసు, దీనిని మన జుట్టు మూలాలకు మరియు కుదుళ్ళకు అప్లై చేసేటప్పుడు, మీ జుట్టు యొక్క కుదుళ్లను మరింత దృఢంగా బలపరిచేందిగా చేసి, జుట్టు బాగా పెరగడాన్ని ప్రేరేపిస్తుంది, మరియు బూడిద రంగులో ఉన్న జుట్టును కప్పి ఉంచడానికి సహాయపడుతుంది. అందువలన, ఈ పద్ధతిలో మీ జుట్టు మరింత అందంగా కనబడేందుకు బాగా ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది, ఇది చాలా సురక్షితమైనది కూడా.

బనానా హెయిర్ ప్యాక్:

బనానా హెయిర్ ప్యాక్:

ఈ పండులో విటమిన్లు మరియు మినరల్స్ను కలిగి ఉన్నందున బలహీనంగా, పలుచగా ఉన్న జుట్టును మరింత బలంగా మార్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. బనానా హెయిర్ ప్యాక్ను మీ జుట్టుకు అప్లై చేశాక అలా 10 నిమిషాలపాటు వదిలివేయండి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో, మీ జుట్టును శుభ్రంగా కడగండి.

బీర్ హెయిర్ ప్యాక్:

బీర్ హెయిర్ ప్యాక్:

పశ్చిమ దేశాలలో నివసించే స్త్రీలు బీరు తాగే అలవాటును కలిగి ఉంటారని మీకు ఖచ్చితంగా తెలుసు. నీటితో మీ జుట్టును శుభ్రంగా కడిగే ముందు, గోరువెచ్చని బీరులో మీ జుట్టు బాగా నానేలా 10 నిమిషాల వరకు అలా నానబెడుతూ వుంచాలి. మీ జుట్టు బాగా దృఢంగా పెరగాలని మీరు కోరుకున్నట్లయితే ఈ పద్ధతిని ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

ఆమ్లా హెయిర్ ప్యాక్:

ఆమ్లా హెయిర్ ప్యాక్:

జట్టులో బలపరిచి, సంరక్షించే ఉసిరిని - పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది మీ జుట్టును కుదుళ్ల నుంచి చాలా దృఢంగా చేసి, జుట్టును పెంచేలా చేస్తుంది అంతేకాకుండా, చుండ్రును కూడా బాగా తగ్గిస్తుంది.

కొబ్బరినూనె హెయిర్ ప్యాక్:

కొబ్బరినూనె హెయిర్ ప్యాక్:

మీ తలపై ఉన్న చర్మానికి, గోరువెచ్చగా వేడి చేసిన 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను అప్లై చెయ్యాలి. అలా మీ తలలోకి ఈ నూనె పూర్తిగా ఇంకిపోయేలా మర్దనా చెయ్యాలి. ఈ పద్ధతిని వారంలో 2 సార్లు చెప్పున పాటించినట్లయితే 30 రోజుల్లో వచ్చే మార్పును మీరే తెలుసుకోగలరు.

English summary

7 Treatments To Nourish Weak Hair Roots

When your hair roots are weak, you will suffer from terrible hair loss. It is time you do something about it by trying out these hair packs.
Desktop Bottom Promotion