మందారతో శిరోజాలని ఆరోగ్యంగా అలాగే కాంతివంతంగా మార్చుకోండిలా

Subscribe to Boldsky

జీవితంలో, ఎదో ఒక సమయంలో హెయిర్ కి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి సమయంలో, హెయిర్ కేర్ కు తోడ్పడే పదార్థాల కోసం సహజంగానే అన్వేషణ ప్రారంభమవుతుంది. హెయిర్ కేర్ కి సంబంధించి అనేక సహజ పదార్థాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కాస్మటిక్స్ కంటే సహజ పదార్థాల ద్వారా శిరోజాలకు అందే సంరక్షణ మెరుగైనది. అటువంటి ఒక ముఖ్యమైన పదార్థం మందార. మందార హెయిర్ లాస్ ను అరికట్టి హెయిర్ రీగ్రోత్ ను పెంపొందిస్తుంది.

కానీ సహజంగా హెయిర్ కేర్ కి సంబంధించిన విషయాలలో షాంపూపై ఫోకస్ ఎక్కువగా పెడతారు. షాంపూ అనేది శిరోజాల సంరక్షణకు తోడ్పడదు. ఇందులో హెయిర్ అనేది ఒత్తుగా అలాగే మృదువుగా కనిపించేందుకు తోడ్పడే కొన్ని కెమికల్స్ ను వాడతారు. వీటి ఫలితం తాత్కాలికం మాత్రమే. కాబట్టి, సహజమైన పదార్థాలతో శిరోజాల సంరక్షణను చేపట్టడం ఉత్తమం.

10 Ways To Use Hibiscus For Healthy & Shiny Hair

సహజమైన హెయిర్ కేర్ ఇంగ్రిడియెంట్ గా మందార తనదైన పాత్ర పోషిస్తుంది. మందార ద్వారా అందే హెయిర్ కేర్ గురించి ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పుకోనక్కరలేదు. కొన్ని తరాలుగా ఇది అనేక హెయిర్ సమస్యలను తగ్గిస్తూ హెయిర్ కేర్ విషయంలో తనదైన పాత్రను పోషిస్తోంది. ఇందులో ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే, విటమిన్ ఏ, విటమిన్ సి మరియు అల్ఫా హైడ్రాక్సీల్ యాసిడ్స్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శిరోజాలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి. కొన్ని మందార పూలను తీసుకుని వాటిని బ్లెండ్ చేసి మృదువైన పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్ ను స్కాల్ప్ పై అప్లై చేసుకోవాలి. మార్కెట్ లో హైబిస్కస్ పౌడర్ రెడీగా లభిస్తుంది. హెర్బల్ హైబిస్కస్ షాంపూలతో పాటు కండిషనర్లు లభించినా మీరు స్వయంగా హైబిస్కస్ పౌడర్ ను గాని లేదా పేస్ట్ ను తయారుచేసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన అలాగే కాంతివంతమైన శిరోజాలను పొందటం కోసం మందారను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను చదవండి.

హెయిర్ గ్రోత్ కు తోడ్పడే హైబిస్కస్ హెయిర్ ఆయిల్

హెయిర్ గ్రోత్ కు తోడ్పడే హైబిస్కస్ హెయిర్ ఆయిల్

ఈ మాస్క్ ను తయారుచేయడం కోసం 8 మందార పూవులు, 8 మందార ఆకులు అలాగే ఒక కప్పు కొబ్బరి నూనెను మీరు అందుబాటులో ఉంచుకోవాలి. మొదటగా, మీరు మందార పూలను అలాగే ఆకులను వాష్ చేయాలి. ఆ తరువాత వాటిని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి నూనెను ఒక సాస్ పాన్ లో వేడి చేసి హైబిస్కస్ పేస్ట్ ను జోడించాలి. రెండు నిమిషాల పాటు వీటిని వేడి చేయాలి. పాన్ ను లిడ్ తో కవర్ చేసి ఫ్లేమ్ ను ఆర్పాలి. పాన్ ను చల్లారేవరకు కాసేపు కదపకూడదు.

నూనె చల్లారిన తరువాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ను తీసుకుని హెయిర్ కేర్ కోసం వినియోగించుకోవాలి. మిగిలినది జార్ లో లేదా బాటిల్ లో ఫ్యూచర్ యూజ్ కోసం భద్రపరుచుకోవాలి. ఈ నూనెతో స్కాల్ప్ ను ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేసుకోవాలి. హెయిర్ టిప్స్ వరకు మసాజ్ ను కొనసాగించాలి. హెయిర్ మొత్తానికి మసాజ్ అందాలి. పది నిమిషాల పాటు ఈ మసాజ్ ను కొనసాగించాలి. ఆ తరువాత హెయిర్ పై ఈ ఆయిల్ ను ముప్పై నిమిషాల పాటు ఉండనివ్వాలి. తేలికపాటి షాంపూతో ఆయిల్ ను తొలగించాలి.

దృఢమైన శిరోజాల కోసం మందార మరియు పెరుగు హెయిర్ మాస్క్

దృఢమైన శిరోజాల కోసం మందార మరియు పెరుగు హెయిర్ మాస్క్

ఈ మాస్క్ ను తయారుచేసుకునేందుకు ఒక మందార పువ్వు, 3-4 మందార పూలు మరియు 4 టేబుల్ స్పూన్ల పెరుగును అందుబాటులో ఉంచుకోవాలి. మందార పువ్వును మందార ఆకులతో కలిపి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు, ఈ మిశ్రమంలో పెరుగును జోడించాలి. మెత్తటి పేస్ట్ తయారవుతుంది.

ఈ హెయిర్ మాస్క్ ను స్కాల్ప్ పై అప్లై చేసుకోండి. గంట పాటు అలాగే వదిలేయండి. ఈ మాస్క్ ను గోరువెచ్చటి నీటితో అలాగే షాంపూతో తొలగించుకోవచ్చు.

మందార మరియు మెంతులతో యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్:

మందార మరియు మెంతులతో యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్:

ఈ మాస్క్ ను తయారుచేయడానికి మీరు కొన్ని మందార ఆకులను అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులను మరియు పావు కప్పుడు మజ్జిగను తీసుకోవాలి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే, మెంతులను అలాగే మందార ఆకులను బాగా గ్రైండ్ చేయాలి. ఈ మెత్తటి మిశ్రమంలో కాస్తంత మజ్జిగను కలపాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అలాగే హెయిర్ పై అప్లై చేసుకోవాలి. గంటపాటు అలాగే ఉండనివ్వాలి. తేలికపాటి షాంపూతో వాష్ చేసుకోవాలి.

మందార మరియు మెహేందితో యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్:

మందార మరియు మెహేందితో యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్:

ఈ ప్యాక్ ను తయారుచేసుకునేందుకు గుప్పెడు మందార పూలను, గుప్పెడు మందార ఆకులను, గుప్పెడు మెహేందీ ఆకులను అలాగే అర నిమ్మను వద్ద ఉంచుకోవాలి. మెహేంది ఆకులను, మందార పూలు మరియు ఆకులను బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తటి మిశ్రమంలో కాస్తంత నిమ్మరసాన్ని జోడించాలి.

ఈ పేస్ట్ ను స్కాల్ప్ తో పాటు శిరోజాలకు అప్లై చేసుకోవాలి. గంట పాటు అలాగే ఉండనివ్వాలి. తేలికపాటి షాంపూతో వాష్ చేయాలి.

హైబిస్కస్ మరియు ఆమ్లా హెయిర్ మాస్క్:

హైబిస్కస్ మరియు ఆమ్లా హెయిర్ మాస్క్:

ఈ మాస్క్ ను తయారుచేసేందుకు మూడు టేబుల్ స్పూన్ల మందార మరియు ఆకుల పేస్ట్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్ అవసరపడుతుంది. వీటిని బాగా కలిపి పేస్ట్ ను తయారుచేసుకోండి. కొంత నీళ్లను జోడిస్తే స్మూత్ కన్సిస్టెన్సీ తయారవుతుంది.

ఈ ఆమ్లా హైబిస్కస్ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు శిరోజాలకు అప్లై చేసుకోండి. మీ హెయిర్ మొత్తానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఈ మాస్క్ ను నలభై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో రిన్స్ చేయండి.

కొబ్బరి పాలు మరియు మందారతో డ్రై హెయిర్ నివారణ:

కొబ్బరి పాలు మరియు మందారతో డ్రై హెయిర్ నివారణ:

ఈ ప్యాక్ ను తయారుచేసేందుకు మీకు రెండు టేబుల్ స్పూన్ల క్రష్డ్ హైబిస్కస్ పెటల్స్, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల పెరుగు మరియు 4 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ అవసరపడతాయి. ఈ పదార్థాల్ని బాగా కలిపి మెత్తటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి.

ఈ పేస్ట్ ను స్కాల్ప్ కు అలాగే హెయిర్ కు అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చటి నీటితో ప్యాక్ ను వాష్ చేయాలి.

అల్లం మరియు మందార ఆకులతో హెయిర్ రీగ్రోత్:

అల్లం మరియు మందార ఆకులతో హెయిర్ రీగ్రోత్:

ఈ ప్యాక్ ను తయారుచేసేందుకు మూడు టేబుల్ స్పూన్ల అల్లం రసం మరియు రెండు టేబుల్ స్పూన్ల క్రష్డ్ మందార పూవులు అవసరపడతాయి. ఈ పదార్థాలని ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలపండి.

శిరోజాలను సెక్షన్స్ గా విడదీసి ఈ సొల్యూషన్ స్కాల్ప్ కి అంటేలా అద్దండి. శిరోజాల టిప్స్ కి కూడా ఈ సొల్యూషన్ చేరేలా అప్లై చేయండి. మీ హెయిర్ మొత్తానికి ఈ సొల్యూషన్ ను అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను రిన్స్ చేయండి.

హెయిర్ గ్రోత్ కోసం ఎగ్ మరియు హైబిస్కస్ :

హెయిర్ గ్రోత్ కోసం ఎగ్ మరియు హైబిస్కస్ :

ఈ ప్యాక్ ను తయారుచేసేందుకు మీకు 2 ఎగ్ వైట్స్ అలాగే 3 టేబుల్ స్పూన్ల క్రష్డ్ హైబిస్కస్ ఫ్లవర్ అవసరపడుతుంది. ఈ పదార్థాలని ఒక పాత్రలోకి తీసుకుని మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోండి.

ఈ మిశ్రమాన్ని హెయిర్ కు అప్లై చేయండి. ఇరవై నిమిషాల తరువాత ఈ హైబిస్కస్ హెయిర్ ప్యాక్ ను శిరోజాలకు పెట్ట్టించండి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో హెయిర్ ను రిన్స్ చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Ways To Use Hibiscus For Healthy & Shiny Hair

    Hibiscus is one such flower that is best used for hair care as it helps to increase hair growth, reduces hair fall, makes your hair strong, removes dandruff, etc. Mixing hibiscus with other natural ingredients such as coconut oil, yogurt, mehendi leaves, lemon, etc. is very beneficial and provides overall benefits for your hair.
    Story first published: Friday, July 20, 2018, 14:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more