నుదుటి బట్టతలపై హెయిర్ రీగ్రోత్ కు తోడ్పడే రెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

నుదుటిపై బట్టతల కలిగి ఉండటం ఎంతగానో ఇబ్బందికి గురిచేసే విషయం. స్త్రీపురుషులు ఇద్దరిలో ఈ సమస్య ఈ మధ్య సాధారణంగా మారిపోయింది. ఇది మన అపియరెన్స్ ను దెబ్బతీయడంతో పాటు మనలోని ఆత్మవిశ్వాసంపై కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. పబ్లిక్ గెట్ టుగెదర్ ని అవాయిడ్ చేసే స్థాయివరకు ఈ నుదుటి బట్టతల తన ప్రతాపము చూపిస్తుంది. చాలా మంది ఈ విషయంలో ఆత్మన్యూనతకు గురవుతారు.

లైఫ్ స్టయిల్ లో ఆకస్మిక మార్పులు, బిజీ వర్క్ లైఫ్, టెన్షన్, ఎండలో ఎక్కువసేపు ఉండటం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, కెమికల్స్ ని వాడటం వంటివి బాల్డ్ నెస్ కు దారితీసే కారణాలు.

These Remedies Will Help You To Regrow Hair On Your Bald Forehead

బాల్డ్ నెస్ సమస్య తలపై ఎక్కడైనా దర్శనమివ్వచ్చు. అయితే, సాధారణంగా నుదుటిపై కనిపిస్తుంది. బట్టతలపై హెయిర్ రీగ్రోత్ అనేది సాధారణంగా అసాధ్యం.

అయితే, సరైన కేర్ ను ను తీసుకుంటూ నేచురల్ రెమెడీస్ ను పాటిస్తే హెయిర్ రీగ్రోత్ ను గమనించవచ్చు. ఈ రోజు, నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ను ఉపయోగించి నుదుటిపై బాల్డ్ నెస్ ను తగ్గించుకునే రెమెడీస్ గురించి చర్చించుకుందాం.

ఆనియన్:

ఆనియన్:

హెయిర్ గ్రోత్ ను పెంపొందించే సల్ఫర్ ఆనియన్ లో సమృద్ధిగా లభిస్తుంది. ఇది బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందించి హెయిర్ గ్రోత్ కు తోడ్పడుతుంది.

రెండు లేదా మూడు ఆనియన్స్ ను తీసుకుని చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను బాల్డ్ ఏరియాపై అప్లై చేసి పది నిమిషాల పాటు మసాజ్ చేయండి. గంటపాటు ఈ పేస్ట్ ను అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి.

ఎగ్ మాస్క్:

ఎగ్ మాస్క్:

వేగంగా ఎదిగేందుకు హెయిర్ కు ప్రోటీన్లు అవసరపడతాయి. ఈ ప్రోటీన్లు ఎగ్ లోంచి లభిస్తాయి. ఎగ్ ప్రోటీన్ మాస్క్ అనేది హెయిర్ గ్రోత్ ను వేగవంతం చేస్తుంది.

పదార్థాలు:

1 ఎగ్ యోల్క్

2 టీస్పూన్ల లెమన్ జ్యూస్

1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్

ఎగ్ లోంచి ఎగ్ యోల్క్ ను సెపరేట్ చేయండి. బాగా విస్క్ చేయండి. ఒక టీస్పూన్ తాజా లెమన్ జ్యూస్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలపండి. ఈ పదార్థాలని బాగా కలపండి. ఈ మాస్క్ ను స్కాల్ప్ పై బాల్డ్ ఏరియాలో అప్లై చేయండి. షవర్ క్యాప్ తో కవర్ చేయండి. గంటపాటు అలాగే ఉండనివ్వండి. మైల్డ్ షాంపూని వాడి రిన్స్ చేయండి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటిస్తే వేగవంతమైన ఫలితాలను గమనించవచ్చు.

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు:

కొబ్బరిపాల వలన హెయిర్ ఫాల్ సమస్య తగ్గడమే కాకుండా హెయిర్ కు చక్కటి పోషణ కూడా లభిస్తుంది. అందువలన, హెయిర్ అనేది మృదువుగా, నిగనిగలాడుతూ ఉంటుంది.

పావు కప్పుడు కొబ్బరిపాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె అలాగే రెండు టేబుల్ స్పూన్ల అన్ఫ్లేవర్డ్ యోగర్ట్ ను కలపాలి. ఈ పదార్థాలని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి ముప్పై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ప్లెయిన్ వాటర్ తో రిన్స్ చేయాలి. ఈ రెమెడీను వారానికి ఒకసారి పాటిస్తే మంచి ఫలితం లభిస్తుంది.

బీట్ రూట్ లీవ్స్:

బీట్ రూట్ లీవ్స్:

బీట్ రూట్ లో హెయిర్ గ్రోత్ ని బలపరిచే పోషకాలు మరియు విటమిన్లు లభిస్తాయి.

గుప్పెడు బీట్రూట్ లీవ్స్ ను తీసుకోండి. వాటిని కప్పుడు నీళ్ళల్లో బాయిల్ చేయండి. బాగా మరిగిన తరువాత ఈ లీవ్స్ ను బ్లెండ్ చేసి చిక్కటి పేస్ట్ గా మార్చుకోండి. రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్ ను బీట్ రూట్ లీవ్స్ పేస్ట్ లో కలిపి ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అలాగే హెయిర్ పై అప్లై చేయండి. దీనిని అరగంటపాటు అలాగే ఉండనివ్వండి. చివరగా, ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయండి.

కరివేపాకు:

కరివేపాకు:

హెయిర్ గ్రోత్ కు తోడ్పడే ఏజ్ ఓల్డ్ రెమెడీ ఇది. హెయిర్ లాస్ ను తగ్గిస్తుంది. ఇందులో ఎమినో యాసిడ్స్ లభిస్తాయి. ఇవి హెయిర్ కు పోషణని అందిస్తాయి.

కరివేపాకులను ఎండబెట్టండి. వీటిని పొడిచేసుకోండి. ఇందులో కొంత కొబ్బరి నూనెను లేదా క్యాస్టర్ ఆయిల్ ను కలిపి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను నేరుగా హెయిర్ పై అలాగే బాల్డ్ ప్యాచెస్ పై అప్లై చేయండి. 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో రిన్స్ చేసుకోండి. ఈ రెమెడీను వారానికి రెండుసార్లు పాటిస్తే మంచి ఫలితం అందుతుంది.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంపొందించేందుకు బ్లాక్ పెప్పర్ అమితంగా తోడ్పడుతుంది. అందువలన, హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది.

బ్లాక్ పెప్పర్ పౌడర్ ను అలాగే కొంత లెమన్ జ్యూస్ ను అందుబాటులో ఉంచుకోండి. ఈ రెండిటినీ కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాల్డ్ ఏరియాపై అప్లై చేసి 15-20 నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో రిన్స్ చేయండి.

English summary

These Remedies Will Help You To Regrow Hair On Your Bald Forehead

Hair can be regained in the bald areas with proper care and natural remedies. Some remedies can be done using natural ingredients to solve this common issue of forehead baldness. Some ingredients are onion, egg, coconut oil, olive oil, beetroot leaves, etc. These remedies will definitely work if you use it regularly for at least a month.
Story first published: Saturday, May 12, 2018, 12:30 [IST]