For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ కండీషనర్: జుట్టుకు ఎందుకు..ఎలా వాడాలి

|

కండిషనర్ అనేది తలస్నానం సమయంలో షాంపూతో పాటుగా వినియోగించవలసిన అద్భుతమైన ఉత్పత్తిగా ఉంటుంది. మనలో అనేకమంది కండిషనర్ అనుసరిస్తున్నప్పటికీ, దీని గురించిన వివరాలపై పూర్తి స్పష్టత ఉండకపోవచ్చు. మన హెయిర్ కేర్ రొటీన్లో భాగంగా ఉండే కండిషనర్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం మీకు సహాయపడగలదు.

ఈరోజు మనం తరచుగా ఎదుర్కొనే జుట్టు సమస్యలను నిర్వహించడంతో పాటుగా, మీ జుట్టు పట్ల తగిన శ్రద్ధ వహించడం, మరియు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమైన అంశంగా మారింది. కండిషనర్ అనేది జుట్టు సంరక్షణకు కేటాయించబడిన ఉత్పత్తి, ఇది మీ జుట్టును మృదువుగా మారుస్తుంది, అదేవిధంగా మీ జుట్టుకు తగిన పోషణను నిర్వహిస్తుంది. ఇది మీ జుట్టుపై ఒక రక్షణ పొరను ఏర్పాటు చేసి, క్రమంగా మీ జుట్టు చిక్కు పడకుండా, మరియు విరిగిపోకుండా చూడగలుగుతుంది.

మార్కెట్లో లభ్యమఅయ్యే కండిషనర్లు మాత్రమే కాకుండా, కొన్ని సహజ సిద్దమైన పదార్థాలు కూడా కండిషనర్ వలె ఉపయోగపడగలవు. ఒకవేళ మీరు సహజసిద్దమైన మార్గాన్ని ఎంచుకొన్నట్లయితే. మీ హెయిర్ కేర్ రొటీన్లో భాగంగా కండిషనర్ల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వైద్యుల, లేదా సౌందర్య నిపుణుల సూచనల మేరకు ఎన్నుకోవలసి ఉంటుంది. మీ జుట్టు సంరక్షణపట్ల మీరు తీసుకోవదగిన చర్యల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది.

అసలు కండిషనర్ ఎందుకు ఉపయోగించాలి ?

అసలు కండిషనర్ ఎందుకు ఉపయోగించాలి ?

వాస్తవానికి పేరులోనే ఉంది దానికి సమాధానం. ఒక కండిషనర్ మీ జుట్టును సరైన కండిషన్లో ఉంచుతుంది. మీ జుట్టుకు ఇది ఖచ్చితంగా అవసరంగా ఉంటుంది. మీ జుట్టు రకం ఏవిధంగా ఉన్నా, మీ తల మీది చర్మానికి మాయిశ్చరైజర్ ప్రాముఖ్యతను ఎవ్వరూ కాదనలేరు. క్రమంగా, , కండిషనర్ మీ జుట్టులో ఉండే తేమను లాక్ చేస్తుంది. తద్వారా మంచి పోషణను అందిస్తుంది. కండీషనర్ మీ జుట్టు యొక్క ప్రక్షాళన పనుల్ని సంపూర్ణంగా పూర్తిచేస్తుంది. షాంపూలు, కొన్ని సందర్భాలలో మీ జుట్టు నుండి దాని సహజ నూనెలను బయటకు నెట్టివేసి, తద్వారా జుట్టు నష్టాన్ని పెంచవచ్చు. కండిషనర్ని ఉపయోగించి మీ కేశాలకు మాయిశ్చరైజ్ అందివ్వడం ద్వారా ఆ సమస్యను సమూలంగా రూపుమాపడానికి సహాయపడుతుంది. మరియు జుట్టు విరిగిపోవడాన్ని నిరోధిస్తుంది. కావున షాంపూ వినియోగంతో పాటుగా, అప్పుడప్పుడు కండిషనర్ వినియోగం కూడా ఉండేలా చూసుకోవాలి. కండిషనర్ను తరచుగా వినియోగించడం మూలంగా, లాభాలతో పాటుగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. క్రమంగా దీని దుష్ప్రభావాల గురించి కూడా వ్యాసంలో వివరించబడింది.

కండిషనర్ మీ జుట్టు రూపం మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఇది పొడిజుట్టు సమస్యను, మరియు చిక్కుపడడాన్ని నిర్వహిస్తుంది. క్రమంగా ఎటువంటి అవరోధాలు లేకుండా, జుట్టును దువ్వేందుకు వీలవుతుంది. క్రమంగా జుట్టు తెగిపోవడం, రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టగలదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా, మీ హెయిర్ మేకప్ దశలో, మీ జుట్టును వేగంగా మరియు తేలికగా స్టైలింగ్ చేయడంలో సహాయం చేస్తుంది.

కండీషనర్ ఎంచుకోవడం ఎలా ?

కండీషనర్ ఎంచుకోవడం ఎలా ?

వాస్తవానికి మీరు ఉపయోగించే కండీషనర్ల గురించిన పూర్తి వివరాలు మీకు తెలిసిఉండకపోవచ్చు. కానీ మీరు వీటి గురించిన అవగాహన తెచ్చుకోవడం ద్వారా, మీ జుట్టుకు తగిన విధంగా కండిషనర్ ఎంచుకునే వీలుంటుంది. ఉదాహరణకు, ఒకవేళ మీకు పలుచని జుట్టు ఉన్నట్లయితే, మీరు వాల్యూమినైజింగ్ కండిషనర్ ఎంచుకోవలసి ఉంటుంది. అదేవిధంగా ఆయిలీ హెయిర్ కోసంగా, మీరు ఆయిల్ కంట్రోల్ కండిషనర్ని ఎంచుకోవచ్చు. అతిగా దెబ్బతిన్న జుట్టుకు కూడా డ్యామేజీ కంట్రోల్ కండిషనర్లు లభ్యమవుతుంటాయి.

అంతేకాకుండా లీవ్ ఇన్ కండిషనర్లు మరియు డ్రై కండిషనర్లు కూడా మార్కెట్లో కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు షాంపు చేసుకున్న తరువాత లీవ్ ఇన్ కండిషనర్ ఉపయోగించబడుతుంది. కాకపోతే లీవ్ ఇన్ కండిషనర్ వాడిన తర్వాత, మరలా జుట్టును నీటితో శుభ్రపరచడం ఉండదు. డ్రై కండిషనర్ మాత్రం కొంతమేరకు డ్రై షాంపూల వలనే ఉంటుంది., మరియు మీ జుట్టును తేలికగా స్టైలింగ్ చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. కాకపోతే ఇవి, షాంపూ కన్నా ముందుగా అప్లై చేసుకోవలసి ఉంటుంది. కావున, ఇక్కడ మీ జుట్టుకు తగిన విధంగా కండిషనర్ ఎంచుకోవడం మీ మొదటి బాధ్యత అవుతుంది. మరియు వీటి వినియోగం గురించిన వివరాలను ఉత్పత్తికి సంబంధించిన మాన్యువల్, లేదా ప్రాడక్ట్ వెనుకభాగాన పొందుపరచబడి ఉంటాయి కూడా.

అయితే, మీరు తరచుగా వినియోగించే కండిషనర్ మీకు ఉత్తమంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లయితే, దానినే నిరభ్యంతరంగా కొనసాగించండి. మీరు ఏ కండీషనర్ ఎంచుకోవాలి అన్న విషయం మీద, ఖచ్చితమైన నియమమేదీ లేదు. మరియు వీటికోసం మీరు అధిక ఖర్చును వెచ్చించనవసరం లేదు. మీకు అందుబాటులో ఉండే డ్రగ్ స్టోర్ లేదా సూపర్ మార్కెట్లలో తక్కువ ఖర్చులోనే లభ్యమవుతాయి.

మీ జుట్టుకు కండిషనర్ అనుసరించడం ఎలా?

అతి సాధారణమైన కండీషనర్ గా పోస్ట్ షాంపూ కండిషనర్ ఉంటుంది. మీరు మీ జుట్టుకు షాంపూ చేసుకున్న తర్వాత, మీ అరచేతిలో చిన్న మొత్తంలో కండీషనర్ తీసుకొని, మీ జుట్టు మద్య నుండి, మొదళ్ళ వరకు పూర్తిగా అప్లై చేయాలి. రెండు నిమిషాలపాటు అలాగే వదిలివేసిన తర్వాత, శుభ్రం చేసుకోవలసి ఉంటుంది. కండీషనర్ తన ప్రభావాన్ని వెంటనే చూపుతుంది.

మీ జుట్టుకు ఎంత తరచుగా కండిషనర్ చేయవలసి ఉంటుంది ?

మీ జుట్టుకు ఎంత తరచుగా కండిషనర్ చేయవలసి ఉంటుంది ?

మీ జుట్టుకు షాంపూ చేసుకున్న తరువాతనే, సాధారణంగా కండిషనర్ ఉపయోగించడం జరుగుతుంది. కావున దీని ఫ్రీక్వెన్సీ, మీరు మీ జుట్టును ఎంత తరచుగా షాంపూ చేస్తారోనన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది.

అలాగని ప్రతిరోజూ షాంపూ చేయడమనేది ఎన్నటికీ సూచించబడదు. జుట్టు సంరక్షణలో భాగంగా వారానికి రెండు లేదా, అధికంగా మూడు మార్లు మాత్రమే షాంపూ చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది.

ముఖ్య గమనిక ..

ముఖ్య గమనిక ..

మీ జుట్టును సున్నితంగా, మరియు ఒక క్రమపద్దతిలో కండిషనింగ్ చేయడం ముఖ్యం. దీని మూలంగా ఎటువంటి ప్రమాదాలు ఉండవు. సిలికాన్ ఆధారిత కండీషనర్లను ఎక్కువగా ఉపయోగించడం మూలంగా జుట్టుకు వ్యతిరేక ప్రభావాలను కలుగజేస్తూ, జుట్టు రాలడానికి మరియు విపరీతంగా జుట్టు పాడవడానికి దారితీస్తుంది. కావున వాటి వినియోగం తగ్గించడం మంచిది.

మీరు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయమేమిటంటే, ఎట్టి పరిస్థితులలో కండిషనర్ను మీ జుట్టు కుదుళ్ళకు పట్టించకూడదు. అధికంగా కండిషనర్ని కుదుళ్ళకు పట్టించడం, మీ జుట్టుకు హానికారకం. మరియు నిస్తేజమైన, మరియు పాడైపోయిన జుట్టుకు కూడా దారితీస్తుంది. కావున ఎల్లప్పుడూ మీ జుట్టు మధ్యభాగం నుంచి చివరి వరకు మాత్రమే కండిషనర్ అప్లై చేయాలని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, మీ జుట్టు మీద రెండు నిమిషాలకంటే ఎక్కువసేపు ఉంచకూడదని గుర్తుంచుకోండి.

అదేవిధంగా, మీరు మీ జుట్టుకు రంగు వేసుకుని ఉన్నట్లయితే, మీరు ఉపయోగించే రంగుకు సరిపోయేలా కండీషనర్ను ఉపయోగించాల్సి ఉంటుంది. మరియు తరచుగా కండిషనర్ వాడడం కూడా మంచిది కాదు. వీలైనంతవరకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే కండిషనర్ అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.

ఇప్పుడు మీకు కండిషనర్ మీద సరైన అవగాహన వచ్చి ఉంటుందని మేము ఆశిస్తున్నాం. క్రమంగా మంచి కండిషనర్ను ఎంచుకుని, మీ జుట్టు పరిస్థితిని బట్టి, పైన చెప్పిన పద్దతులలో అనుసరించిన ఎడల, ప్రకాశవంతమైన, ఒత్తైన మరియు తేమతో కూడిన దృఢమైన జుట్టును సాధించగలరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

why and how to use hair conditioner

With the plethora of hair issues that we face today, taking proper care of your hair has become even more important. A conditioner is a hair product that not only makes your hair smooth, but also manageable. It forms a protective layer on your hair and prevents your hair from breaking. Here is everything you need to know about conditioning your hair. Read on!
Desktop Bottom Promotion