Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
మీ బ్యూటీ ప్రొడక్ట్స్ తో కాస్త జాగ్రత్త వహించండి..!
బాహ్యసౌందర్యానికి కాస్మటిక్స్‌వాడకం విపరీతంగా పెరిగింది. దేశ, విదేశ కాస్మటిక్స్ నేడు మార్కెట్లో ఆడ,మగ,పెద్ద,చిన్న అనే తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తూ, కుప్పలు తెప్పలుగా వాడకంలోకి వచ్చేస్తున్నాయి. నగరాల్లోనే కాదు, పల్లెల్లోనూ వీటి వ్యామోహం పెరుగుతోంది. ఎంత ఆదరణ పొందుతున్నా కాస్మటిక్స్ వల్ల కలిగే అనర్థాలూ కూడా అంతేస్థాయిలో కనిపిస్తున్నాయి. అసలు కాస్మటిక్స్‌లో ఉండేవేమిటి? వాటివల్ల కలిగే ప్రయోజన, దుష్ప్రయోజనాలేమిటి? ఈ ఉత్పత్తులను వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం.
శరీరాన్ని శుభ్రపరచడానికి, అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి, శరీరం కనిపించే తీరును మార్చడానికి కాస్మటిక్స్‌ను వాడతారు. చర్మంపైన ప్రయోగించే క్రీములు, లోషన్లు, పెర్‌ఫ్యూమ్‌లు, లిప్‌స్టిక్‌లు, గోళ్ల రంగులు, కళ్లకూ మొహానికి వేసుకునే మేకప్‌లు, వీవింగ్ లేదా విగ్గులు, జుట్టుకు వేసుకునే రంగులు, టూత్‌పేస్టులు, సబ్బులు, డియోడరెంటులు, వీటిని ప్రధానంగా కాస్మటిక్స్ అంటాం. మందులకు, కాస్మటిక్స్‌కు మౌలికంగా తేడా ఉంది. మందులను ఏదైనా వ్యాధులను తగ్గించడానికి లేదా నిరోధించడానికి వాడతారు. కాస్మటిక్స్ అనేవి శరీర నిర్మాణాన్ని లేదా పని తీరుని మార్చవు. ఇవి కేవలం సౌందర్యాన్ని ఇనుమడింప చేసేందుకు మాత్రమే ఉద్దేశించినవి.

వీటిలో ఏముంటాయి?
సుగంధాలను వెదజల్లే ఫ్రాగ్రెన్స్‌లు, పదార్థాన్ని చెడి పోకుండా చేసే ప్రిజర్వేటివ్‌లు కాస్మటిక్స్‌లో ప్రధానంగా ఉంటాయి. పడకపోతే చర్మ సంబంధమైన ఎలర్జీలకు, శ్వాస కోశవ్యాధులకు, తలనొప్పులకు ఫ్రాగ్రెన్స్‌లు కారణం అవుతాయి కూడా. సౌందర్య ఉత్పత్తుల్లో కత్రిమ సుగంధ పదార్థాలను ఐదువేలకు పైచిలుకు వాడుతున్నారు. కొన్ని ఉత్పత్తుల మీద పెర్‌ఫ్యూం ఫ్రీ అని రాసి ఉంటుంది. దీనర్ధం ఏరకమైన సుగంధ పదార్థమూ కలపకుండా తయారు చేసినదని. ఇలాంటి వాటిల్లో కూడా కొద్దో గొప్పో సుగంధ ద్రవ్యాలను కలుపు తూనే ఉంటారు.
సౌందర్య ఉత్పత్తుల వల్ల చర్మవ్యాధులు కలగడానికి మరో ప్రధాన కారణం వాటిల్లో కలిపే ప్రిజర్వేటివ్‌లు. గాలి వెలుతురులు తగిలి చెడిపోకుండా, బ్యాక్టీరియా, ఫంగస్‌లు వంటివి పెరగకుండా కాస్మటిక్స్‌లో ప్రిజర్వేటివ్‌లను కలుపుతుం టారు. ఇవి సూక్ష్మక్రిములను నిరోధించే ప్రయత్నంలో చర్మాన్ని ఎంతో కొంత దెబ్బతీసి కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి వ్యాధులను కలిగించే అవకాశం ఉంది. కాస్మటిక్స్‌ను చెడిపోకుండా నిల్వ ఉంచడం కోసం వాడే క్లోరోఫాం, వినైల్ క్లోరైడ్ వంటి పదార్థాలు కేన్సర్లను సైతం కలిగించే ప్రమాదం ఉంది.
సురక్షితం కాదా?
సాధారణంగా కాస్మటిక్స్ వలన ప్రాణహాని కలగనప్పటికీ, అనేక రకాలైన ఆరోగ్యసమస్యలు, ఇబ్బందులూ కలిగే ప్రమాదం ఉంది. మేకప్‌లను ఇతరులతో పంచుకోకూడదు. ఒకరు వాడిన మేకప్‌లను మరొకరు వాడటం వల్ల చర్మంపైన వాడే కాస్మటిక్ బ్రష్‌లు, స్పాంజ్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది.
కొంతమంది మేకప్ వేసుకునే ముందు బ్రష్‌ను లాలాజలంతో తడిచేస్తుంటారు. ఇలా చేయటం ఎంతమాత్రమూ సరికాదు. లాలాజలంలో ఉండే బాక్టీరియా చర్మంపైన చేరటం వల్ల సమస్య తీవ్రతరమవు తుంది. మేకప్ వేసుకోబోయే ముందు చేతులను శుభ్రం చేసుకుంటే ఈ సమస్య అంతగా ఉండదు.
స్ప్రేరూపంలో లభ్యమయ్యే సౌందర్యసాధనాలు సాధా రణంగా ఆల్కహాలిక్ సంబంధిత పదార్థాలతో తయారవు తుంటాయి కాబట్టి మంట, నిప్పు వంటివి సమీపంలో ఉన్నపుడు వాడకూడదు. అలాగే సూక్ష్మమైన తుంపరరూపంలో వెదజల్లబడతాయి. కాబట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది. ఈ ఎయిరో సాల్స్‌ను వాడేప్పుడు ముక్కుకు దూరంగా ఉంచడం మరచిపోకూడదు.
గుర్తుంచుకోండి.
సౌందర్య ఉత్పత్తులను వాడిన వెంటనే మూతను పెట్టేయాలి. మూతలు లేని కాస్మటిక్స్ మీద ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది.
షాపుకి వెళ్లినపుడు ఒకవేళ ఏదైనా మేకప్‌ను శ్యాంపిల్ చూడదలచుకుంటే షాపతన్ని ఆల్కహాల్‌తో మూతలు వగైరా శుభ్రపరచమని చెప్పండి. మేకప్ పదార్థాలను ఎండకి, వేడికి దూరంగా ఉంచండి. వేడి, వెలుతురులు కాస్మటిక్స్‌లోని ప్రిజ ర్వేటివ్స్‌ను నాశనం చేస్తాయి. ఏదైనా కాస్మటిక్ పదార్థం గడ్డకట్టినట్లు అనిపిస్తే నీళ్లు, తదితర ఇతర పదార్థాలను చేర్చవద్దు.
గడ్డకట్టిన మేకప్ లేదా కాస్మటిక్స్‌ని వాడకపోవటం మంచిది. మేకప్ రంగుమారినా, వాసనలో మార్పు వచ్చినా చెడిపోయిం దని అర్ధం. పౌడర్లు మొహానికి రాసుకునేటప్పుడు శ్వాస తీసుకోకుండా కొద్దిసేపు ఆగాలి. లేకపోతే ఫేస్ పౌడర్‌లోని సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు ఊపిరితిత్తులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రాత్రి పడుకునేటప్పుడు అన్ని రకాల మేకప్‌లు తీసివేయాలి. అవసరమైతే, డాక్టర్ల సలహా మేరకు కాస్మటిక్స్‌ను వాడాలి.



Click it and Unblock the Notifications











