For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలను పాటిస్తే.. అందం, ఆరోగ్యం, మీ సొంతం..

|

అందం కోసం మహిళలు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. వారి విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం అందం కోసం అబ్బాయిలు తెగ ఆరాటపడిపోతున్నారట. మగవాళ్లు చర్మం లేదా అందంపైనా పెద్దగా శ్రద్ధగా తీసుకోరు. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పురుషులు కూడా తమ అందాన్ని పెంచుకునేందుకు, చర్మంలో గ్లో వచ్చేందుకు, తెగ ప్రయత్నిస్తున్నారు.

Men Beauty

ఇందుకోసం సెలూన్ షాపుల్లో ఫేషియల్స్, క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ వంటివి చేయించుకుంటున్నారు. కానీ వీటి వల్ల ఫలితం అంతగా ఉండదు. అందుకే అబ్బాయిల కోసం మేము ఈరోజు కొన్ని చిట్కాలను తీసుకొచ్చాం. వీటిని పాటించి అందరికంటే అందంగా కనిపించేందుకు ప్రయత్నించండి..

మగవాళ్ల చర్మం ఎక్కువ రఫ్ గా ఉంటుంది. వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వారి చర్మం హార్డ్ గా, డల్ గా కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు మనం కొన్ని చిట్కాలను పాటించాలి.

షేవింగ్ జెల్ ను ఉపయోగించండి..

షేవింగ్ జెల్ ను ఉపయోగించండి..

షేవింగ్ సమయంలో మీ చర్మం తెగకుండా ఉండేందుకు షేవింగ్ జెల్ ని ఐదు లేదా ఏడు నిమిషాలు రాసి ఉంచండి. ఆ తర్వాత రేజర్ తో మీ పనిని ప్రారంభించండి.

కండిషనర్ ను ఉపయోగించండి..

కండిషనర్ ను ఉపయోగించండి..

షేవింగ్ జెల్ తక్కువగా ఉన్నప్పుడు లేదా అది ఒక్కోసారి మొత్తం ఖాళీ అయిన సమయంలో హెయిర్ కండిషనర్లను వాటి స్థానంలో ఉంచండి. సున్నితమైన ప్లేసుల్లో కాకుండా, మృదువైన డ్రైవ్ ను అందించడానికి మాత్రమే సులభంగా ఉంటుంది.

లిప్-బామ్ అవసరం..

లిప్-బామ్ అవసరం..

మీరు షేవ్ చేస్తున్నప్పుడు మీకు మీరే చిన్న కత్తెరతో వెంట్రుకలను కత్తిరించుకునే ప్రయత్నంలో ఒక్కోసారి రక్తస్రావం జరిగే అవకాశముంది. అందుకనే ఆ రక్తస్రావాన్ని నివారించేందుకు లేదా ఆ రక్తాన్ని నివారించడానికి మీరు ఎక్కడైతే చర్మం తెగుతుందో అక్కడ లిప్ బామ్ ను వాడాలి.

పెదవులపై బ్రష్ తో..

పెదవులపై బ్రష్ తో..

ఒకవేళ మీ వద్ద లిప్ బామ్ లేకపోతే లేదా దాన్ని మర్చిపోతే మీరు దాని ప్లేసులో టూత్ బ్రష్ ను వాడొచ్చు. టూత్ బ్రష్ తో మీరు మీ పళ్ళను క్లీన్ చేసుకున్న తర్వాత మీ పెదవుల మీద కూడా ఆ బ్రష్ తో రుద్దండి. ఇలా చేయడం వల్ల మీ సున్నితమైన పెదవుల మీద ఉన్న చర్మం యొక్క పొలుసులను పోయేలా చేస్తుంది. ఆ విధంగా మీరు చేయడం వల్ల మీ పెదవులు అందంగా కనిపిస్తాయి. మీరు కూడా అందంగా కనిపిస్తారు.

ఆయిల్ (నూనె)తో చెవులను శుభ్రపరచుకోండి..

ఆయిల్ (నూనె)తో చెవులను శుభ్రపరచుకోండి..

మీ ఇయర్ -బడ్స్ తో మీ చెవులను మీ చెవులను శుభ్రపరచుకోకపోవడం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే, మీ చెవుల లోపలి మరియు బయటి ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు ఆలివ్ ఆయిల్ (నూనె)ను వాడండి. అలా నూనెను వాడిన ప్రదేశాన్ని, పొడిగా చేయడానికి దూదిని ఉపయోగించండి. ఈ నూనె చెవి లోపలి నిర్మాణాన్ని మృదువుగా ఉంచుతుంది.

సోప్స్ వద్దు.. ఫేస్ వాష్ లు ముద్దు..

సోప్స్ వద్దు.. ఫేస్ వాష్ లు ముద్దు..

మగవారిలో చాలా మందికి సోప్స్ (సబ్బు) వాడే అలవాటు ఉంటుంది. కానీ దీనికి బదులు ఫేస్ వాష్ లు వాడటం చాలా మంచిది. మీది సున్నితమైన చర్మతత్వం అయితే ఫేస్ వాష్ వాడటం చాలా ఉత్తమం. మైక్రో బీడ్స్ కలిగిన ఫేస్ వాష్ లు టాక్సిన్స్ ని తొలగిస్తాయి. మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి. కాబట్టి అలాంటి వాటినే వాడితే మంచి ఫలితం ఉంటుంది.

కొన్ని చుక్కల నిమ్మరసం..

కొన్ని చుక్కల నిమ్మరసం..

మీ పళ్లు తెల్లగా మారడానికి అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా.. టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పంటికి అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత బ్రష్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. నెలకు ఒకటి రెండు సార్లు ఈ ట్రిక్ ఫాలో అయితే తెల్లని నిగనిగ లాడుతూ మెరిసే పళ్లు మీ సొంతం అవుతాయి.

హెయిర్ జెల్స్ కన్నా కొబ్బరినూనె మిన్న..

హెయిర్ జెల్స్ కన్నా కొబ్బరినూనె మిన్న..

హెయిర్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన వాటిలో ఎక్కువ జెల్స్ ఉన్న హెయిర్ జెల్స్ లో ఆల్కహాల్ ఉంటుంది. ఇది జుట్టు సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. జుట్టు డ్రైగా, డ్యామేజ్ అయ్యేందుకు కారణమవుతుంది. కాబట్టి అలాంటి జెల్స్ కంటే కొబ్బరినూనె వాడటమే మంచిది.

English summary

Men Beauty Tips: How to Get Healthy, Glowing Skin

Most men have a habit of using soaps. But it is better to use face washes instead. If you have sensitive skin, it is best to use a face wash. For girls and boys .. Tea Spoon Baking Soda Mix a few drops of lemon juice to make your teeth white. Apply this mixture to the tooth and brush after five minutes. Follow this trick one or two times a month and you will have your own glossy teeth.
Story first published: Tuesday, September 17, 2019, 19:05 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more