Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్‌కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
‘మడతా’..? ఉందిగా మసాజ్..!!

హోర్మోన్లలో మార్పులు, శరీరం వాస్తవ బరువును కోల్పొయిన సందర్భాల్లో మడతలు ఏర్పడతాయి. అయితే వీటిని నియంత్రించి, మృదువైన చర్మాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు సమగ్ర ఆహార ప్రణాళికను పాటించాలి. ముఖ్యంగా విటమిన్ 'సీ', 'ఏ' పోషకాల గల ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోవాలి.
ప్రకృతి ప్రసాదించిన ఔషుధాలతో శరీరానికి 'మసాజ్' చేస్తే శరీరం పై మడతలు తొలగిపోతాయి. ఈ 'ఆయిల్స్' కోసం మీరు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదు. అన్ని మీ ఇంట్లో దొరికేవే... ఒంటికి ఆయిల్ మసాజ్‌ను పట్టించటం వల్ల చర్మ మృధత్వాన్ని సంతరించుకోవటంతో పాటు రక్త ప్రసరణ వృద్థి చెందుతుంది, ఈ ప్రభావంతో మీరు ఎప్పుడు ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనబడుతుంటారు. మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా ఈ మడతలు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రసవం అనంతరం ఈ సమస్యలు వేధిస్తుంటాయి. వీటిని సులువుగా నియంత్రించుకునేందుకు అందుకోండి పలు చిట్కాలు..
- రెండు టీ స్పూన్ల 'బాదం' నూనెలో 1 టీ స్పూన్ 'వీట్ జర్మ్' ఆయిల్‌ని కలిపి, ఈ మిశ్రమంలో 5 చుక్కులు 'గులాబీ' నూనెతో పాటు 'ఆరెంజ్' ఫ్లవర్ నూనెను జోడించి మడతల భాగంలో 20 నిమిషాల పాటు సుతి మెత్తంగా మర్ధనా చేయించుకోండి.
- 10 చుక్కల 'రోజ్ మ్యారీ' ( దవనము చెట్టు నూనె)ను, 2 టీ స్పూన్ల 'బాదాం నూనె'లో కలిపి మడతలకు పట్టించండి. నూనెను చర్మం పీల్చుకునేంతవరకు మసాజ్ చేస్తూనే ఉండండి.
- 5 చక్కుల 'లావెండర్' ఆయిల్‌లో, తగినంత 'ఆలివ్' ఆయిల్‌ను కలిపి మసాజ్ చేసకుంటే ఫలితం లభిస్తుంది, అదేవిధంగా మూడు టీ స్పూన్ల 'జోజోబా' ఆయిల్‌లో. 5 చుక్కల 'లావెండర్' ఆయిల్‌ను కలిపి మడతల భాగంలో పావుగంట పాటు మసాజ్ చేస్తే మడతలు మటుమాయమవుతాయి.



Click it and Unblock the Notifications