Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
పౌడర్ల్లు.. క్రీములు వాడకుండా అందంగా..?

షాంపూలో వెనిగర్‌ను కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకల పట్టులాంటి నిఘారింపును సంతరించుకుంటాయి. స్నానం చేసే నీటిలో 6 నుంచి 8 చుక్కుల గంధపు నూనెను కలపితే చర్మ సంబంధిత వ్యాధులు దరికి చేరవు. చందనంతో తయారుకాబడిన నూనె కళ్లు మంటలను దూరం చేస్తుంది.
ఎండపెట్టిన నారింజ తొక్కల పొడిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంటుంది. నిమ్మకాయరసం కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పడితే బ్లాక్, వైట్ హెడ్స్‌ను నివారించవచ్చు. రోజ్ వాటర్ సహజసిద్ధమైన టోనర్, క్లెన్సర్‌లుగా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జు ముఖంపై మచ్చల్ని మాయం చేస్తుంది. కీరదోసకాయ రసం సన్‌టాన్‌ని పోగొట్టడమే కాకుండా యాస్ట్రింజెంట్‌గా కూడా పనిచేస్తుంది. నిగారింపు లేని, పొడి చర్మం గల వాళ్లు ఆల్మండ్ పేస్ట్, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుంది.
కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో తగినంత పుసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పై పేరుకున్నమురికి తొలగిపోయి కొత్త రూపు సంతరించుకుంటుంది.
మీగడ ముఖ సౌందర్యానికి దోహద పడుతుంది. తాజా మీగడను ప్రతిరోజు ముఖానికి రాయడం వల్ల చర్మ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాదు ముఖం పై వ్యాపించిన నల్లమచ్చలు, ముడతలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications