Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పగిలిన పాదాలకు చికిత్స!

కాలిపగుళ్ళకు నివారణ ఎలా?
-కాలిపగుళ్ళ చర్మం గట్టిపడి ఎండిపోయి వుంటుంది. దీనిని ప్రతి స్నానం లోను రుద్దుడు రాయి లేదా ప్యూమైస్ స్టోన్ తో గట్టిగా రుద్ది మృత చర్మ కణాలను తొలగించండి. మడమల వద్ద మొత్తటి చర్మం వుండేలా చూడండి. మడమ భాగం చక్కటి తేమ లేదా మెత్తగా వుండేలా చూడండి. దీనికిగాను మంచిక్రీములు వాడాలి. పగులకూడదంటే దానికి క్రీము తప్పక రాయాలి. చర్మం ఎండిపోకుండా వీలైతే షూ ధరించండి. సాక్స్ వేసే ముందు బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాయండి. ఇది చర్మంలో తేమను వుంచుతుంది.
-మీ పాదాలను ఉప్పు వేసిన వేడి నీటిలో ప్రతి రోజు కనీసం 20 నిమిషాలపాటు వుంచండి. చర్మ రోగాలకు ఇది చక్కటి పరిష్కారం కాగలదు. కాలిని కొంత సేపు రుద్దుడు రాయితో రుద్దండి. సాక్స్ వేసుకొని పడుకోండి.
-రోజ్ వాటర్ ను గ్లిజరిన్ తో కలపండి. దీనిని కాటన్ తో పగిలిన భాగాలకు చక్కగా ప్రతి రోజూ రాయండి. ఈ విధంగా 15 రోజులు చేస్తే మంచి ఫలితాలు కనపడతాయి.
-పగుళ్ళు అధికం కాకుండా వుండాలంటే షూస్ వేసుకోవాలి. చర్మం పొడిబారకుండా ఎప్పుడూ తేమ కలిగి వుంటుంది.
-రోజంతా శరీరానికవసరమైన అధిక నీటిని తాగండి. చర్మానికి లోపలి నుండి కూడా తేమ లభిస్తుంది.
-బాగా పండిన అరటి పండు గుజ్జులో కొద్ది చుక్కలు గ్లిజరిన్ కలపండి. ఆ మిశ్రమాన్ని పగిలిన పాదాల మడమలకు రాయండి.
పై చిట్కాలు ఉపయోగించి మీ పాదాలను సున్నితంగా అందంగా వుండేలా చూసుకోండి.



Click it and Unblock the Notifications