Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రకాశవంతంగా మెరిసేటి చర్మ కోసం కిచెన్ సెల్ఫ్ చిట్కాలు...!

1. చిన్న బౌల్ లోనికి జీలకర్ర పొడి, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ ముఖానికి అప్లై చేయాలి. దీన్ని పది నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
2. ఒక చిన్న బౌల్ లో ఒక చెంచా తేనె, ఒక చెంచా గ్లిజరిన్, రెండు చెంచాల నిమ్మరసం తీసుకొని మూడా బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ఆరిన కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం బ్లీచ్ అయ్యి ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
3. బాగా పండిన టమోటో ముక్కలు మరియు తేనె బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది మీ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
4. ఒక గిన్నెలో ముల్తానీ మట్టి, సాండిల్ వుడ్ పౌడర్, మరియు కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిల్ స్కిన్ కలవారికి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చర్మంలో అధికంగా ఉన్న ఆయిల్ ను తొలగింస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది.
5. ఒక బౌల్ లో గంధం పొడి, నిమ్మరసం, దోసకాయ పేస్ట్, పసుపు మరియు నిమ్మరసం వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిర్జీవంగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతంగా తయారైయ్యేలా చేస్తుంది.
6. చిన్న గిన్నెలో రెండు చెంచాల శెనగ పిండి, చిటికెడు పసుపు, నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మంచి నీళ్ళు కడిగేసుకోవాలి. ఇది పొడి చర్మానకి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
7. మీరు రోజూ తాజా పెరుగును ముఖానికి, మెడకు అప్లై చేసుకొంటే ముఖం బేబీ సాప్ట్ చర్మలా మెరిసిపోతుంది.
8. ప్రతి రోజూ స్నానం చేసుకొనే ముందు కొద్దిగా ఆయిల్ లో ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి, కాళ్ళు, చేతులకు పట్టించి ఓ పది, పదిహేను నిమిషాల తర్వాత స్నానం చేసుకొంటే మీ చర్మం సున్నితంగా తయారవుతుంది.
9. క్యాస్ట్రాల్ ఆయిల్ ను ముఖం, మెడకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంపై ముడతలు, గీతలు తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
10. ఆయిల్ చర్మం కలవారు ఒక చెంచా పెరుగు, అర చెంచా పసుపు, ఒక చెంచా సాండిల్ వుండ్ పౌడర్ కలపి ముఖం, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఆయిల్ తొలగింపబడి మీ చర్మాన్ని చైతన్యవంతంగా మార్చుతుంది..



Click it and Unblock the Notifications