Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
శరీర ఛాయను పెంచే సహజమైన చిట్కాలు..!
ఫెయిర్ నెస్ కోసం కొన్ని చిట్కాలు. బాదాంపప్పును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కు రోజ్ వాటర్ చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మీ ముఖం, మెడ సహజ సౌందర్యాన్ని పొందుతుంది.
కొబ్బరి నీళ్ళు కీరదోసయను మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ముఖం, మెడ, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్ర పరచుకోవడం వల్ల దుమ్ము, ధూళిని పోగొట్టి, ఎండ వేడిమి నుండి చర్మాన్ని కాపాడి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

ముఖంగా ప్రకాశవంతంగా మెరవడానికి ప్రతి రోజూ పసుపు, గంధం పొడి రెండూ మిక్స్ చేసి అందులో రోజ్ వాటర్ కానీ, లేదా పాలు కానీ లేదా అలోవరా జెల్ కానీ కలిపి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర ఛాయ పెరుగుదులకు దోహదపడుతుంది. చర్మం మంచి రంగును సంతరించుకొంటుంది. అలాగే ముల్లంగి తరుమును కూడా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో మంచి రంగు వస్తుంది.
అలాగే నిమ్మకాయను రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని వాటితో ఒక ఐదు నిమిషాల పాటు ముఖం మీద సున్నితంగా మర్ధన చేస్తూ ఉండాలి. ఇలా ఒక రోజులో రెండు, మూడు సార్లైనా చేయాలి. ఇలా చేసిన తర్వాత పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి. ఇలా వారంలో మూడు లేదా నాలుగుసారలైనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆలోవెరా జెల్ ని షాంపూలాగా ఫేష్ వాష్ కు ఉపయోగించవచ్చు. ఈ ఆలోవెరా జెల్ లో చర్మానికి ఉపయోగపడే తగినన్ని పోషకాలు ఉన్నాయి. అలాగే ఇది క్లెన్సర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ జెల్ ను తరచూ వాడడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడతుంది.
సాధారణంగా మనం ఇంట్లో తరచూ కూరల్లో ఉపయోగించే దాల్చిన చెక్కను తీసుకొని బాగా మెత్తని పొడి చేసి, అందులో కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్ర పరచుకొన్నట్లైతే ముఖంలో ఫెయిర్ నెస్ వస్తుంది.
మీ చర్మాన్ని బాదాం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల సున్నితమైన, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఇంకా ఇందులో ముసాజ్ చేసే ముందు కుంకుమ పువ్వు వేసుకొని మసాజ్ చేయడం వల్ల మరింత మెరుపునిస్తుంది. ఇదే పద్దతి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా చేయవచ్చు.
ముఖంలో మంచి మెరుపు కోసం పుదీనా ఆకులును బాగా మెత్తగా పేస్ట్ చేసి, ముఖం, మెడకూ బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి. అలాగే రెండు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల కీరదోసకాయ రసం రెండు బాగా మిక్స్ చేసి ముఖానికే కాకుండా పూర్తి శరీరానికంతటికీ పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం, ముఖం తాజాగా మెరుస్తుంటుంది. ఫ్రెష్ నెస్ ను కలిగిస్తుంది. ఒక వేళ పొడి చర్మం కలిగిన వారైతే తేనె మరియు నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి తర్వాత శుభ్ర పరచుకొంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications