Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
బ్యూటీ టిప్స్ స్త్రీలకే కాదు పురుషులకు కూడా...!

పురుషులు తరచూ తమ చర్మాన్ని శుభ్ర పరుచుకొంటుండాలి: పురుషులు తమ చర్మాన్ని శుభ్ర పరచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉండాలి. సాధారణంగా చాలా మంది మగవారి చర్మం ఆయిల్ చర్మం కలిగి, జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు కలిగి ఉంటాయి. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్ము, ధూళి ముఖ రంధ్రాల్లో చేరి ముఖంలో మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మగవారి ముఖాన్నిశుభ్రపరుచుకోవడానికి కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం మంచిది. అలాంటి ప్రొడక్ట్స్ కోసం మంచి బ్రాండ్ కలిగినటువంటి మన్నికైన క్రీములను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్ళతో శుభ్ర పరచుకొని క్లెన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది.
పురుషులకు ఉపయోగపడే ఫేస్ ఫేషియల్స్:
1. అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
2. రోజుకు కనీసం మూడు సార్లైన ఫేస్ వాష్ క్రీమ్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
3. సోపు ఉత్పత్తులకు సంబంధించిన లేదా డియోడరెంట్స్ కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడకూడదు.
4. ముఖ్యంగా పురుషు చర్మం రఫ్ గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ ఇ ప్రోడక్ట్స్ ను లేదా ఆలోవరా(కలబంద)లతో తయారైనటు వంటి ఫేష్ వాష్ లతో శుభ్రం చేసుకోవాలి.
5. షేవింగ్ చేసిన తర్వాత అలోవెరా ఫేష్ వాష్ చేసుకొంటే షేవింగ్ సమయంలో చిన్న గాట్లు ఏర్పడ్డా ఏటువంటి మార్క్స్ లేకుండా చేస్తుంది.
6. వ్యాజ్ లైన్ ను తరచూ పెదవులకు రాస్తుండాలి.
7. ముఖం మరీ గరుకుగా ఉన్నప్పుడు తప్పని సరిగాపార్లర్ కి వెళ్ళి ఒకటి రెండు సార్లు వారి సలహాలను, పద్దతులను పాటించాలి.
8. ఇలాంటి చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ముఖంలో మొటిమలు, ముడతలు, రంద్రాలు పోగొట్టి ముఖ చర్మాన్ని ఆకర్షనీయంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
