Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
చర్మ సంరక్షణలో గ్లిజరిన్ ఫేస్ మాస్క్ తో అత్యద్భుతమైన మార్పు...
సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలకు ఉత్తమమైన నివారినిగా పనిచేస్తుంది గ్లిజరిన్. చర్మ సంరక్షణలో గ్లిజరిన్ మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. మరియు చర్మ సమస్యలకు వినియోగించే మెడిసినల్ ప్రొడక్ట్స్ లోనూ గ్టిజరిన్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే గ్లిజరిన్ ను ఉపయోగించే ముందు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. అదికూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. కాబట్టి గ్లిజరిన్ ను ఎంత మోతాదులో ఉపయోగించాలి. వేటితో ఉపయోగిస్తే ముఖాన్ని తేమగా ఉంచి, కాంతివంతంగా కనిపిస్తోందో చూద్దాం....

గ్లిజరిన్ మరియు తేనె: మిక్సింగ్ బౌల్ లో ఒక చెంచా గ్లిజరిన్, ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖానికి, మెడకు పూర్తిగా అప్లై చేయాలి. అప్లై చేసిన అలాగే అరగంట సేపు వదిలేసి, తర్వాత శుభ్రం చేసుకొంటే అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం అవుతుంది. పొడి భారిన చర్మానికి కావల్సినంత తేమను అందించి ముఖం తాజాగా, ఫ్రెష్ గా ఉండేట్లు చేస్తుంది.
గ్లిజరిన్ మరియు అరటి పండు: ఒక చిన్న బౌల్ ల్లో ఒక చెంచా గ్లిజరిన్, మూడు చెంచాల బాగా పండిన అరటిపండు గుజ్జును తీసికొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేషియల్ చేసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటిపండులో ఉండే ఖనిజాలు మీ చర్మానికి కావల్సినంత పోషకాలు నిలిచి ఉండేట్లు చేస్తుంది. దాంతో చర్మం తాజాగా ఉంటుంది. ముఖం మరింత కళగా కనబడుతుంది.
గ్లిజరిన్ మరియు ఓట్స్: మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తటి పౌడర్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ వేసి అందులో ఓట్స్ పౌడర్ వేసి బాగా మిక్సి చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఇది ముఖానికి సహజ ఫేష్ ప్యాక్ మాత్రమే కాదు. అద్భుతమైన ఫేషియల్ స్ర్కబ్బింగ్ గా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన అరగంట తర్వాత ముఖాన్ని తడిచేసి క్లాక్ వైజ్, యాంటి క్లాక్ వైజ్ దిశల్ సున్నితంగా రుద్దాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గ్లిజరిన్ మీ చర్మానికి తేమను అందిస్తే, ఓట్స్ చర్మంలో నున్న బ్లాక్ హెడ్స్, మృత కణాలను తొలగిస్తుంది.
గ్లిజరిన్-గుడ్డు మరియు నిమ్మరసం: చిన్న మిక్సింగ్ బౌల్ ల్లో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, గుడ్డులోని తెల్ల సొన, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అది ముఖానికి అప్లై చేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే, మీ ముఖ చర్మానికి కావలసినంత తేమను అందించడంతో పాటు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
మట్టి(ముల్తాని మట్టి) మరియు గ్లిజరాల్: చర్మానికి గ్లిజరిన్ తో పాటు మట్టి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అతి త్వరగా చర్మంలో మార్పును తీసుకొస్తుంది. కాబట్టి ఈ ఫేస్ మాస్క్ ను ప్రయత్నించి చూడండి. ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి రెండు చెంచాల గ్లిజరిన్ ను వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెండి మిశ్రమంతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేయడమే కాకుండా, ముఖంలో నునుపుదనం సంతరించుకుంటుంది. మునుపటి కంటే అందంగా కనబడేలా చేస్తుంది.
మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ చిట్కాలన్ని చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ సహజమైనటువంటి ఫేస్ మాస్క్ ను వారానికి ఒకసారి లేదా రెండు సార్లు అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు అప్లై చేయకూడదు.



Click it and Unblock the Notifications