Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మంపై పేరుకొన్న మృతకణాలను తొలగించాలంటే...!

గుడ్డులోని తెల్లసొనకు మొక్కజొన్న పిండి కలిపి ముఖం, మెడకు పూతలా వేయాలి. తేమ ఆరాక కడిగితే చాలు మృతకణాలు తొలగిపోతాయి. పనిలో పనిగా మురికి, జిడ్డూ వదిలి చర్మం శుభ్రపడుతుంది. బిగుతుగా ఉంటుంది.
జిడ్డు చర్మతత్వం ఉన్న వారు తరచూ చర్మాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. లేదంటే మృతచర్మం పేరుకుంటుంది. రెండు చెంచాల నిమ్మరసంలో తేనె, కొన్ని నీళ్లు, రెండు చెంచాల ముల్తానీమట్టి కలిపి పూతలా వేసుకోవాలి. అది ఆరాక శుభ్రపరచుకుంటే మార్పు ఉంటుంది.
చిన్న కప్పులో కొద్దిగా రాళ్ల ఉప్పు ఆలివ్ నూనె తీసుకుని బాగా కలపాలి. బరకగా ఉన్న ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు శరీరానికి రుద్దుకోవాలి. పంచదార, ఆలివ్ నూనె కలిపి కూడా రాసుకోవచ్చు. మృతకణాలు తొలగిపోయి..చర్మం కాంతివంతగా మారుతుంది. మృదుత్వాన్నీ సంతరించుకుంటుంది. ఇలా వారానికోసారి చేసుకోవాలి.
అరకప్పు కన్నా కొద్దిగా తక్కువగా ఆలివ్ నూనె తీసుకుని అందులో నాలుగైదు బాదం పప్పుల్ని బరకగా పొడిచేసి కలపాలి. ఈ నూనెను ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
నల్లని వలయాలను దూరం చేసే టీ బ్యాగులను మృతకణాలు తొలగించేందుకూ వాడుకోవచ్చు. స్నానికి ముందు ఆ ఒకటిరెండు టీబ్యాగుల్ని తీసుకుని చర్మంపై సున్నితంగా రడ్డుకోవాలి. అలాగే వారానికి రెండుసార్లు ఏం చేయాలంటే..అరకప్పు పెరుగులో రెండు చెంచాలా తేనె కలిపి ముఖానికి రాసుకుని బాగా రుద్దాలి. కాసేపయ్యాక దూదితో తుడుచుకుని గోరువెచ్చిన నీళ్లతో కడిగేసుకోవాలి. చర్మం శుభ్రపడుతుంది ప్రకాశవంతంగా మారుతుంది.
మృతకణాలను తొలగించడంలో ఆలస్యం చేయడం వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. దానికి తోడు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోకపోయినా తేమనందించే క్రీంలు రాసుకోకపోయినా చర్మం మరింత పొడిబారుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే...ఒక కప్పు ఓట్ మీల్ కు రెండు చెంచాల తేనె, పెరుగు, గుడ్డులోని తెల్లసొన, అరకప్పు గోరువెచ్చటి నీళ్లు కలిపి రెండు గంటలు నాననివ్వాలి. ఆ తర్వాత ముఖానికి పూతలా వేసి క్రమపద్దతిలో మర్దనుచేయాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చాలు. మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications