Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ముఖంపై నల్లమచ్చలు తొలగి..చక్కని రూపం మీ సొంతం....!

బంగాళాదుంప ముక్కల్ని తీసుకుని ముఖం రుద్దుకున్నా...మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, వైట్ హెడ్స్ లాంటివి దూరమవుతాయి. అలాగే దానిమ్మ పండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని అందులో చెంచా పొడిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి నల్లమచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా మచ్చలున్న చోట నిత్యం రాస్తుంటే మార్పు కనిపిస్తుంది.
తాజా మెంతి ఆకులు తీసుకొని, వాటిని మెత్తగా రుబ్బి రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేయడం వల్ల నల్లమచ్చలు దూరమవుతాయి. అలాగే గుప్పెడు మెంతి ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి ఆ డికాషన్ చల్లారాక ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.
గ్రీన్ టీ లో దూది ముంచి మచ్చలపై రోజూ రాసుకున్నా కూడా...సమస్య పరిష్కారమవుతుంది. వంటనూనె, నిమ్మరసం చెంచా చొప్పులన తీసుకొని మచ్చలున్న ప్రాంతంలో సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిసాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు.
మునగ ఆకుల్ని గుప్పెడు తీసుకుని మెత్తగా నూరి అందులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. మచ్చలతో పాటు..అధిక జిడ్డూ తొలగిపోతుంది. రెండు కప్పుల నీరు తీసుకుని నాలుగు చెంచాల ఎప్సంసాల్ట్ వేసి గంట తర్వాత అందులో దూదిని ముంచి మచ్చలపై బాగా రుద్దాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.
ఒక టీ స్పూన్ గోరువెచ్చని పాలని తీసుకుని అందులో కాటన్‌ను ముంచి దాన్ని మోహంపై మెల్లిగా రుద్దుండి. ఇలా చేసి ఒక పదిహేను నిముషాలు ఆరనివ్వండి.తరువాత చల్లని నీటితో మోహాన్ని కడగేసుకోవాలి. నాలుగు చెంచాల పచ్చిపాలలో రెండు చెంచాల నిమ్మరసం కలపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత దూదితో శుబ్రంగా తుడిచేసుకుంటే సరిపోతుంది. మరో సని కూడా చేయవచ్చు. చందనం పొడి, పసుపు సమపాళ్లో తీసుకొని నీటితో ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి తడారాక కడిగేయాలి. ఇలా చేస్తు నల్లమచ్చలు, మృతకణాలు క్రమంగా తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications
