Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
క్యాబేజి తో చక్కటి ముఖ సౌందర్యం...!

క్యాబేజీ వంటకంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసం రాస్తే బాగా పనిచేస్తుంది. అయితే క్యాబేజీని పచ్చిగా నేరుగా ముఖంపై పూయకూడదు. దీని వాడకానికి కొన్ని పద్ధతులు పాటించాలి...
ప్రతిరోజూ ఉడికించిన క్యాబేజీ తరుగును గుజ్జులా చేసి అందులో దూదిని ముంచి ముఖంపై నెమ్మదిగా మర్దనా చేస్తూ రాసి, పది నిమిషాల తరువాత కడిగేస్తే ముఖంపై పేరుకున్న నలుపు తగ్గుతుంది. క్యాబేజీరి నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉడికించి తర్వాత ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకొంటే చర్మం చాలా సున్నితంగా మరియు యవ్వనంగా కనబడుతారు.
క్యాబేజిని ఆకులను తీసుకొని మిక్సర్ వేసి జ్యూస్ చేసుకోవాలి. రెండు చెంచాల క్యాబేజీ జ్యూస్ లో చిటికెడు ఈస్ట్ కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి బాగా పట్టించాలి. తర్వాత అరగంట సేపు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంలోని డస్ట్ ను తొలగించి ముఖం ప్రకాశవంతంగా తయారయ్యేలా చేస్తుంది.
క్యాబేజీ తరుగును నీళ్లల్లో ఐదు నిమిషాల పాటు ఉడికించి ఆ నీటిని కూడా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా తేనె కలిపితే మరింత మంచి ఫలితం లభిస్తుంది. క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే ముడతలు కనిపించవు.
ఒక స్పూన్ క్యాబేజీ గుజ్జులో రెండు స్పూన్ల కోడిగుడ్డు తెల్లసొన, ఒక స్పూను సోయాపిండి, ఒక స్పూను తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక కడిగేస్తే ముఖానికి మెరుపు రావడంతో పాటు ముడతలు కూడా తగ్గుతాయి.
క్యాబేజి ఆకులను ముద్దలా చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.



Click it and Unblock the Notifications