Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మం సౌందర్యానికి పాల మెరుపులు..!

వాతావరణ సమస్యలు, పోషకాల లేమి ఇలా కారణం ఏదైనా కొందిరి చర్మం నిర్జీవంగా ఉంటుంది. ఇలాంటి వారు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలల్లో చిటికెడు ఉప్పు వేసి రాత్రి పడుకొనే ముందు చేతులు, మెడ, ముఖం భాగాల్లో రాసుకొంటే చర్మానిక మెరుపు వస్తుంది. పాలల్లో గులాబి రేకుల మిశ్రమాన్ని కలిపినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
చర్మ కాంతి మెరుగుపడేందుకు: కొందరు రంగు తక్కువగా ఉన్నామని, మరికొందరు మునుపటి వర్ణం కోల్పోయామని తరచూ బాధపడుతుంటారు. ఇలాంటి వారు నానబెట్టిన మూడు బాదం గింజల్ని మిశ్రమంగా చేసుకొని పాలల్లో కలుపుకోవాలి. దీన్ని పడుకొనే ముందు ముఖం, మెడ కు రాసుకోవాలి.
పచ్చిశెనగపప్పును రాత్రంతా పాలల్లో నానబెట్టి మెత్తని పేస్టులా చేసి, అందులో కొద్దిగా పసుపు, రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలుపుకొని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ చాయ మెరుగుపడుతుంది.
ఓ టేబుల్ స్పూన్ పాలల్లో ఒక్కో చెంచా చొప్పున క్యారెట్, నారింజ రసం కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో మూడు చుక్కల తేనె వేసి కరిగే వరకూ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.
పొడిచర్మానికి: కాలంతో పనిలేకుండా, కొందరి చర్మం పొడిబారుతుంది. ఇలాంటి వారు సెనగపిండిలో కొద్దిగా పసుపు, అరచెంచా నారింజ తొడిమపొడి, బాగా గిలకొట్టిన పెరుగు ఒక చెంచా, పాలు ఒక చెంచా వేసి బాగా కలపి, పదినిమిషాలు నానబెట్టి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒంటికి నలుగులా పెట్టుకొంటే ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
మృదువైన చర్మం కోసం: పట్టులా జాలువారే చర్మం ఉంటే బాగుండని ప్రతి ఒక్కరూ కలలుగంటుంటారు. అలాంటి వారు చెంచా చొప్పున పుచ్చ, దోస, సొరకాయ గింజల్ని మొత్తగా పేస్ట్ చేసి దానికిలో చెంచా పాలు, చెంచా గులబీ నీరు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండ నేరుగా తగిలే చర్మం భాగాల్లో రాయాలి. దీని వల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడంతో పాటు కాంతివంతంగా ఉంటుంది. పాలల్లో కరిగించిన గంధం పొడిలో రెండు చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకొన్నా ఇదే ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications