Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాలు-కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ తో చర్మం నిగనిగ..!

కుంకుమపువ్వు సౌందర్యానికి, ఆరోగ్యానికీ కూడా ఉపయోగిస్తుంది. కుంకుమపువ్వు చర్మపు వర్చస్సును, కాంతిని పెంచుతుంది. చర్మానికి మంచి రంగును కలిగించి, చర్మపు సౌందర్యానికి తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు. గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును,పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన.
చెంచా గంధం పొడిలో రెండు మూడే కుంకుమ పువ్వు రేకలు, కాసిన్ని పాలు, చేర్చి ముఖానికి పూత వేయాలి. అరగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది. మొటిమల తాలూకు మచ్చలతో బాధపడేవారు రెండు రేకలను నలిపి ఆ పొడిలో చెంచా తేనె కలిపి పక్కన పెట్టాలి. కొద్దిసేపయ్యాక దానిలో రెండు చెంచాల పెరుగును చేర్చి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి.
పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టి అరగంట తర్వాత ముఖం, మెడ, చేతులకు రాసుకోవాలి. చర్మం తడారిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల మేని కళ మెరుగవుతుంది. కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.
అలానే పాలమీగడలో రెండు రేకలు, చిటికెడు పసుపు వేసి ముఖానికి పట్టించి చల్లటినీళ్లతో కడిగేసుకొంటే మృత చర్మం తొలగిపోతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన చర్మతత్వం. ఏ రకమైన చర్మతత్వానికైనా కానీ తగిన పోషణ అందించి కాంతిమంతంగా చేయడానికి కుంకుమ పువ్వు తోడ్పడుతుంది. ముంుద రోజు రాత్రి మూడు రేకల్ని నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఆ నీళ్లు రంగు మారతాయి. అందులో చెంచా చొప్పున పాలు, పంచదార, రెండు చుక్కల ఆలివ్ నూనె కలుపుకొని ఒంటికి రాసుకోవాలి. అరగంటయ్యాక సబ్బుతో రుద్దకుండా చన్నీటితో స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తూ వన్నెలీనుతుంది.



Click it and Unblock the Notifications