Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ముఖ సౌందర్యానికి మిన్నంటి ఉండే ‘జెల్’...!

ఇవి చర్మంపై దద్దుర్లు తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అలర్జీ లాంటి సమస్య ఉండదు. కొన్ని రకాల పదార్థాలను నేరుగా వాడలేం. అలాంటివాటిల్లో పసుపు, పుదీనా, తులసి, నిమ్మకాయ లాంటి సమస్య ఉండదు. అలాంటివాటిల్లో పసుపు, పుదీనా, తులసి, నిమ్మకాయ లాంటివాటి గురించి చెప్పుకోవాలి. వీటిని నేరుగా కాకుండా జెల్స్ తో కలిపి లేదా ఆ రూంపలో ఉన్న వాటిని ఎంచుకుని వాడితో చర్మం పొడిబారడం, నల్లబడటం లాంటి సమస్యలు బాధించవు. ఇవి క్రీం ఉత్పత్తులు కాదు కాబట్టి సెబెమ్ ను నియంత్రిస్తాయి. అందుకే కేవలం పెద్దవారే కాదు. టీనేజ్ అమ్మాయిలు కూడా వాటిని ఉపయోగించవచ్చు.
అందుకు మార్కెట్లో రకరకాల జెల్స్ లభ్యమవుతున్నాయి. వాటిల్లో సమస్యను బట్టి ఎంచుకుంటే సరిపోతుంది.
నిమ్మ: జిడ్డు చర్మతత్వం ఉన్న వారు ఇది ఎంతో మేలు చేస్తుంది.
కుంకుమపువ్వు: చర్మాన్ని చాలా ప్రకాశవంతంగా మారుస్తుందిది. వదలని మొండిమచ్చల్ని కూడా నివారిస్తుంది.
బాదం: సహజ, పొడిబారిన, జిడ్డు చర్మతత్వం ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు విటమిన్ ‘ఇఈ అంది కాంతిమంతంగా మారుతుంది.
పుదీనా: ఇది వేసవికి చాలా మంచిది చర్మంలోని అధిక నూనెను తగ్గించి తాజాదనాన్ని అందిస్తుంది. దీన్ని వాడటం వల్ల రాసెస్, మొటిమలు, వాటితాలూకు మచ్చల్లాంటివి తగ్గుతాయి.
పసుపు: ఇందులో పసుపు సుగుణాలు ఉంటాయి. యాంటీ సెప్టిక్ సుగుణాలతోపాటు, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే పసుపు ఈ రూపంలో కూడా లభిస్తుంది. కాబట్టి ఆ లాభాలే కాదు... చర్మం కూడా పొడి బారదు.
గులాబీ: రోజాపూలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ వేసవిలో చర్మం నల్లగా లేదా అతి ఎండ కారణంగా ఎర్రగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల్ని తగ్గించి చాలా తక్కువ సమయంలో మనుపటి మెరుపునందిస్తుంది గులాబీ జెల్....
వేప: ఇది జిడ్డు చర్మతత్వం కలవారికి మంచిది. ముఖం దురదగా ఉన్నా మొటిమలు మరీ ఎక్కువగా వేధిస్తున్నా దీన్ని రాసుకుంటే సాంత్వన చేకూరుతుంది. కాబట్టి మీకు సరిపోయే రకాన్ని ఎంచుకోవచ్చు. అయినా కూడా ఫలితం లేకపోతే వీటితో ముఖానికి పూతలాగ ప్రయత్నించవచ్చు.
ముందుగా పసుపు జెల్ తో చర్మాన్ని వుబ్రం చేయాలి. ఎండ వల్ల చిరాకు కలిగించే చర్మానికి హాయిగా ఉంటుంది. నల్లదనం కూడా తగ్గుతుంది. అది పూర్తయ్యాక పుదీనా జెల్ తో మర్థన చేయాలి. దానివల్ల చర్మం చల్లగా మారుతుంది. తాజాగాను కనిపిస్తుంది.
కుంకుమ పువ్వు జెల్ కలిపిన ప్యాక్ చర్మానికి పట్టించి పదినిమిషాల తర్వాత తీసేయాలి. అన్నీ ఉత్పత్తులు చాలా చల్లగా ఉంటాయి కాబట్టి చర్మానికి హాయిగా ఉంటుంది. మెరుపు సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications
