Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిన్నవయస్సులోనే వయస్సు పైబడిన వారిలా కనిపిస్తున్నారా...

1. రాత్రి పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాయాలి. ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. రెండు వారాల పాటు రెగ్యులర్ గా చేస్తే సరి.
2. అరటి పండు గుజ్జును ముఖానికి అప్లై చేసి అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
3. క్యారెట్ జ్యూస్ లో పాలు కలపండి. దీనికి బాదం పలుకుల పొడిని జత చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేయండి.
4. ప్రతి రోజూ బాదం నూనెతో ముఖానికి మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
5. కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి అప్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం గట్టి పడి... ముడతలు మాయమవుతాయి.
6. బీట్ రూట్ రసం రెగ్యులర్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు.
7. ముడతలు ఎక్కువగా ఉంటే కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి అప్లై చేయండి.
8. తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అప్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
9. నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్ గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది.
10. నట్స్: బాదం, కర్జూరాల వంటి డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు, జింక్ అధిక శాతం ఉం టాయి. జింక్ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్ రాకుండా చేస్తుంది. రఫ్‌గా ఉండే చర్మాన్ని మృదువుగా చేస్తుంది.



Click it and Unblock the Notifications