Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
అరటి(బనానా) ఫేస్ ప్యాక్ తో చర్మం సౌందర్యవృద్ధి...

1. అరటి పండును పేస్ట్ గా చేసి, దానిలో కొంచెం కొబ్బరి నూనె గాని, అవిసనూనె గానీ కలిపి, కొంచెం తేనె కూడా కలిపి ఫేషియల్ క్రీమ్ గా వాడుకోవచ్చు. దీన్ని కాళ్లు చేతులకు కూడా పట్టించవచ్చు. చర్మసౌందర్యం వృద్ధి చెందుతుంది.
2. బాగా పండిన అరటి పండును పావు భాగం తీసుకుని మెత్తగా చిదిమి క్రీమ్ గా వచ్చే వరకు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పదిహీను లేదా ఇరవై నిమిషాల తర్వాత ముందుగా వేడి నీటితోను తరువాత చల్లటి నీటితోను కడగాలి. కడిగిన తర్వాత ముఖాన్ని స్వతహాగా ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతితో మెరుస్తూ ఉండడంతో పాటు ముడుతలను కూడా నివారిస్తుంది.
3. ముదుగా ముఖాన్ని శుభ్రంగా కడుకున్న తరువాత అరటిపండు గుజ్జుని ముఖం అంతా సమానంగా పట్టించి ఐదు నిమిషాలపాటు అలానే వుంచుకోవాలి, మీది జిడ్డు చర్మం అయినా, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నా, రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేషియల్ స్టీమ్ తీసుకోవాలి. ఫేషియల్ స్టీమ్ వలన చర్మం మృదువుగా మారుతుంది.
4. అరటిపండు తొక్కతో ముఖం మీద తేలికగా రబ్ చేస్తూ చర్మంలో వున్న మృత కణాలను తొలగించుకోవాలి. మృతకణాల తొలగింపు అయిపోయిన తరువాత అరటి - కోకో బటర్ (మసాజ్ క్రీమ్) కలిపి మృదువుగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
5. బనానా పాక్‌ను ముఖానికి, మెడకి దట్టించి 15 నిమిషాలపాటు అలానే వుంచే యాలి, ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచుకుంటే ముఖం అందంగా కనబడుతుంది



Click it and Unblock the Notifications