Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బొప్పాయితో బోల్డన్నీ సౌందర్య రహస్యాలు...

1. ఎండాకాలంలో బొప్పాయి చాలా మంచిది. ఇది మంచి ఫేస్ ప్యాక్‌గా పనిచేస్తుంది. రెండు బొప్పాయి గుజ్జుకుకు ఒక తేనె, గుడ్డులోని తెల్లసొన తీసుకుని కలుపుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఆగి కడిగేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
2. పచ్చిబొప్పాయి చెక్కు తీసి చిన్న ముక్కను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో నాలుగు చుక్కల వెనిగర్, కొద్దిగా నీళ్లు కలిపి ముఖానికి మర్దన చేసుకొని కడిగేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇది చక్కని క్లెన్సర్ లా పనిచేస్తుంది.
3. చర్మం బరకగా ఉంటే బొప్పాయి గుజ్జును రాసి కొద్దిసేపయ్యాక నీళ్లతో తడిపి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మదత్వాన్ని సంతరించుకుంటుంది. బొప్పాయి కలిపిన ముల్తానీ మట్టితో తరచూ పూత వేసుకోవడం వల్ల ముడతలను సమస్య నియంత్రణలో ఉంచవచ్చు
4. బొప్పాయి, అరటి గుజ్జు సమపాళ్లలో తీసుకొని రాత్రిపూట ముఖానిక మర్దన చేసి పావుగంటయ్యాక కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మర్నాటికి చర్మం మెత్తబడి, రోజంతా తాజాగా కనిపిస్తుంది.
5. అరటిపండు, బొప్పాయి, యాపిల్ పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
6. జిడ్డు చర్మం వాళ్లు.. బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి, కచ్చుర్ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో మిక్స్ చేసి ముఖానికి అపె్లై చేయాలి. 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు తగ్గడమే కాదు, మొటిమలు తగ్గుతాయి.
7. బొప్పాయి, కచ్చుర్ సుగంధీ పౌడర్, ముల్తాన్ మట్టి, ఛాయపసుపు, గులాబీ పౌడర్‌లను రోజ్‌వాటర్‌లో వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20నిమిషాల తర్వాత కడిగితే పిగ్మెం మొటిమల మచ్చలు తగ్గుతాయి. అయితే ఇలా వారానికి మూడు సార్లు తప్పనిసరిగా చేస్తేనే ఫలితం ఉంటుంది.
8. కొంత మందికి చర్మం గరుకుగా ఉంటుంది. ఇటువంటి వారి చర్మాన్ని కూడా మృదువుగా మార్చ గల గుణం బొప్పాయిలో ఉంది. బొప్పాయి తొక్కను తీసి ఓ గిన్నెలో వేసి ఉడికించి దానిని మెత్తగా నూరి ముఖానికి రాసి పదిహేను నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా ముఖం కోమలత్వాన్ని సంతరించుకుంటుంది.



Click it and Unblock the Notifications