Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ముఖ సౌందర్యానికి గులాబీ మెరుపులు..

సౌందర్య పోషణలోనూ గులాబీ నీళ్లది కీలకపాత్ర దానివల్ల చర్మం..నిగారింపు సంతరించుకోవడమే కాదు..అలసిన మేనికి స్వాంతననందిస్తుంది. గులాబీ రేకుల్నించి తయారుచేసినద్రవాన్ని సర్వ సాధారణంగా ప్రతి నిత్యం వాడుకోచ్చు.ఈ రోజఆయిల్ ని చర్మ సౌందర్యానికి, మేకప్ సామాగ్రిలోను చాలా ఎక్కువగా వాడతారు.
1. గులాబీ రేకుల్ని 4 చెంచాల గోరువెచ్చని పాలలో బాగా నలిపి, కొద్ది సేపు ఉంచిన తరువాత ముఖానికి రాసుకుని, అరగంట తరువాత స్నానం చేస్తే ముఖం ప్రకాశవంతంగా, తాజాగా ఉంటుంది.
2. గులాబీనీళ్లు పొడి చర్మతత్వం ఉన్న వారికి మంచి ప్రయోజనకారి. దీన్ని యాస్ట్రింజెంట్ గా ఉపయోగించడం వల్ల చర్మం మీద మురికి తొలగిపోయి..తేమ అందుతుంది.
3. రోజూ రాత్రిపూట పడుకునే ముందు ముఖం, కాళ్లు, చేతులకు ఈనీళ్లను పట్టిస్తే మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.
4. ఆయిల్ స్కిన్ కలవారికి రెండు టీస్పూన్ల టమోటో రసం, రెండు టీస్పూన్ల కీరదోసకాయ రసం తీసుకొని అందులో ఒక స్పూన్ రోజ్ వాటర్ ను కలపి ముఖానికి రాసుకొని 10-15నిమిషాలపాటు అలాగా ఉండి తర్వాత చల్లటి నీటితో కడుకొంటే ముఖంలో ఆయిల్ పోగొట్టి ఫ్రెష్ గా ఉంచుతుంది.
5. మేకప్ తొలగించుకున్న తర్వాత నీటితో ముఖం కడుగుతుంటారు కొందరు. దానికి బదులు గులాబీనీళ్లలో ముంచిన వస్త్రంతో తుడిస్తే చర్మం మీద జిడ్డు తొలగిపోతుంది.
6. సున్నిత చర్మతత్వం కలవారు బయటకు వెళ్లడానికి ముందు తర్వాత రోజ్ వాటర్ లో నానబెట్టిన వస్త్రంతో ముఖం, మెడ, చేతులను రుద్దితే సరిపోతుంది.
7.ముఖానికి రోజ్ వాటర్ పట్టించడం వల్ల నల్లమచ్చలు, మొటిమలు నియంత్రణలో ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవు.



Click it and Unblock the Notifications
