Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
వేసవి హోం మేడ్ ప్యాక్స్ తో చర్మం తాజాదనం..సున్నితత్వం

1. వేసవిలో ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించే ప్యాక్ ఇది. క్యారెట్, క్యాబేజీ, టమాట ముక్కలను సమపాళ్లలో తీసుకొని మెత్తని పేస్టులా చేయాలి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగేశాక.. ఈ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. ఐదు నిమిషాల య్యాక మునివేళ్లతో వలయాకారంలో మర్దన చేయాలి. ఆరాక చన్నీటితో ముఖం కడిగేసుకొని మల్తానీ మట్టితో ముఖం, మెడకు ప్యాక్ వేయాలి. కాసేపయ్యాక కడిగేసి నాణ్యమైన మాయిశ్చ రైజర్ రాస్తే.. చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
2. ఐదు బాదం పప్పులు, రెండు రెమ్మల వేపాకు, చందనం పొడి కలిపి అవసరమైన మేర కు పాలు పోస్తూ గ్రైండ్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరే వరకు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటిని చల్లుతూ మర్దన చేయాలి. ఈ ప్యాక్ చర్మాన్ని తెల్లబరుస్తుంది.
3. వేసవిలో ఎండ తాపానికి ఏర్పడిన చర్మం పగుళ్లు విపరీతమైన మంటతో అసహనానికి గురిచేస్తాయి. వీటిబారి నుండి బయటపడాలంటే దోసకాయ పైతొక్కను జ్యూస్ చేసి, అందులో అర టీ స్పూన్ గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి, ఈ మిశ్రమాన్ని పగులు ఏర్పడిన చోట పూసి కాసేపు వదిలేయాలి. చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు చర్మం సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది.
4. తాజా కొబ్బరిపాలతో ముఖాన్ని మర్దన చేస్తే చర్మం తెల్లబడుతుంది. పెదవులు నల్లగా పొడిబారి ఉన్నా కొబ్బరిపాలతో మర్దన చేస్తే నలుపు పోయి పెదవులు మృదువుగా ఉంటాయి.
5. చందనంలో పన్నీటిని కలిపి ప్యాక్ వేసుకుంటే చల్లదనంతోపాటు చర్మానికి నునుపుదనం వస్తుంది. ఈ ప్యాక్ ను వేసవిలో పెద్దవాళ్లతోపాటు పిల్లలకు కూడా వేయవచ్చు.
6. కీరదోస, ముల్లంగి రసం బ్లీచ్ గా పనిచేస్తాయి. గాఢత తక్కువగా ఉండి సహజమైన బ్లీచ్ లు చర్మానికి స్వాంతన ఇవ్వడంతోపాటు తెల్లబరుస్తుంది కూడా.



Click it and Unblock the Notifications
