Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖం ప్రకాశవంతంగా మెరవాలంటే ఆవిరి(స్టీమ్)థెరపీ

వాతావరణంలోని కాలుష్యం, మనం పీల్చే గాలి, వాహనాల పొగ, తీసుకునే ఆహారం ఇలా ఎక్కడ చూసి కాలుష్యం. దాని ఫలితంగా మన శరీరంలో ఎన్నో విషపదార్థాలు చేరుతుంటాయి. దాని ద్వారా ఎర్పడే ఈటాక్సిన్లు చర్మం త్వరగా ముడతలు పడేలా చేయడం నుంచి గుండె జబ్బులదాకా బాధిస్తాయి. అంతే కాదు చర్మంపై మచ్చలు, మంగు, మొటిమలు ఎక్కువయ్యేందుకు కారణమవుతాయి. దాంతో చర్మ రంగు మారుతుంది.
ఇలాంటి సమస్యలను నుండి బయటపడాలంటే పౌష్టికాహారంతో పాటు ఎక్కువ నీళ్ళు తాగాలి. వీటితో పాటు వారానికోసారి శరీరానికి ఆవిరిపట్టాలి. రోజంతా బయట తిరిగే వారు ఇంటికి రాగానే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. జుట్టు కూడా నిర్జీవంగా మారకుండా రెండు రోజులకొక్కసారి తలస్నానం చేయాలి.
ఆయిల్ స్కిన్ ఉన్నవారు పాలలో కాటన్ ముంచి ముఖాన్ని క్లీన్ చేసుకుని ఆవిరి పట్టుకుని ఒక టీ స్పీన్ పెరుగు, ఒక స్పూన్ శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించిఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం ప్రకాశిస్తుంది.
ముఖానికి ఆవిరి పట్టే నీటిలో తులసి ఆకులతోపాటు చిటికెడు చాయ పసుపు కలిపి ఆవిరి పడితే మొటిమలు మటుమాయమవడమే కాకుండా చర్మానికి సహజసిద్ధమైన పోషకాలు లభించిముఖం కాంతివంతమవుతుంది.
నిమ్మరసంలో తేనె కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలపాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. రెండురోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే ముఖం కాంతులీనుతుంది.
ఆయిల్ స్కిన్ ఉన్నావుర నిమ్మకాయ చెక్కతో ముఖాన్ని అయిదునిమిషాలు మప్దన చేసి, ఆవిరి పడితే నలల్ని మచ్చలు, తెల్లమచ్చలు యేనవైనా ఉంటే పోవడంతోపాటటు చర్మం నిగనిగలాడుతుంది.
మొదట పొడి చర్మానికి పచ్చిపాలను రాసి మర్దనా చేయాలి. కాస్త ఆరిన తరువాత దూదితో తుడిచినట్లయితే ముఖంపై ఉండే మురికి, జిడ్డు తొలగి పోతుంది. ముఖానికి ఆవిరి పట్టినట్లయితే.. చర్మంపై ఉండే గ్రంథులు తెరచుకుంటాయి. ఇప్పుడు బ్లాక్‌హెడ్స్‌ను సులువుగా తొలగించవచ్చు. ఆ తర్వాత ఐసు ముక్కతో రుద్దుకుంటే.. గ్రంథులు మూసుకుంటాయి. లేదా ఆవిరి పట్టిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
ముఖం మీద నల్లటి మచ్చలున్నట్లైతే. కొన్ని గులాబీ పువ్వులను తీసుకొని. పెద్ద గిన్నెలో నీళ్లు పోసి, దానిలో గులాబీరేకులు వేసి మరిగించి నీళ్ల నుంచి పొగలు వస్తున్నపుడే ముఖానికి ఆవిరి పట్టాలి. పదినిమిషాల పాటు ఇలా చేశాక చల్లటినీటితో ముఖం తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. ఆవిరి థెరపీతో చర్మం శుభ్రపడుతుంది. నల్లమచ్చలు పోయి శరీరం ప్రకాశవంతం అవుతుంది.



Click it and Unblock the Notifications