Latest Updates
-
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.!
నల్లగా...గరుకుగా మారిన మోచేతులు..కోమలంగా ఉండాలంటే

సాధారణంగా మహిళల మోచేతుల వద్ద నల్లబడి, చర్మం మొద్దుబారిపోవడం పెద్ద సమస్యగా మారింది. మిగతా చర్మం ఎంత అందంగా, మృదువుగా ఉన్నా మోచేతి కారణంగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకు నిర్లక్షమే కారణం. ఎక్కడా కొద్దిగా సపోర్ట్ దొరికితే చాలు అక్కడ చేయి మోపేసి రిలాక్ష అయిపోతుంటారు. అప్పటికీ హాయిగా ఉంటుంది. కానీ ఈ అలవాటు మోచేతి సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడైనా జాగ్రత్తగ పడాలి. నల్లగా మారిన మోచేతికి పరిష్కాషరానికి చిన్నపాటి నియమాలు పాటిస్తే అందమైన..కోమలమైన చేతులు మీ సొంతం అవుతాయి.
1. వారానికి ఒక సారి ఒక స్పూన్ పంచదార, సంగం చెక్క నిమ్మరసం కలిపి మోచేతుల దగ్గర రాసి, నిమ్మచెక్కతో బాగా మర్థన చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.
2. సున్నిపిండిలో ఆరెంజ్ తొక్కల పొడి కలిపి..అందులో పాలు కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని మోచేతికి ప్యాక్ వేసి ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి.
3. నిద్రించే ముందు మోచేతులకు మందంగా పెట్రోలియం జెల్లీని పట్టించి. ఆ మర్నాడు సబ్బుతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది.
4. స్నానం చేసే ముందు నిమ్మచెక్కను రుద్దుకోవాలి. పొడిబారి, బరకగా మారిన మోచేతులు కోమలంగా మారతాయి.
5. బరకగా మారిన మోచేతులకు కొద్దిగా ఆలివ్ నూనె రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది.
6. మోచేతులు పొడిబారి దురద కూడా బాధిస్తుంటే.. స్నానం చేసేందుకు ఇరవై నిమిషాల ముందు ఆ ప్రాంతంలో కొద్దిగా వెన్న రాసి.. ఆ తరవాత నలుగు పెట్టి రుద్దుకోండి.
7.మోచేతులు తదితర ప్రాంతాల్లో కొంత మందికి చర్మం నల్లగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపి నిత్యం ఆయా భాగాల మీద రుద్దడం వల్ల నలుపు వర్ణం క్రమేపీ కనుమరుగవుతుంది.
8. మెత్తని ఉప్పులో కొద్దిగా బాదం నూనె కలిపి అందులో నిమ్మచెక్క ముంచి మోచేతులపై తరచు రుద్దినట్లైతే నలుపు తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
