Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
చర్మకాంతిని పెంచి యవ్వనంగా ఉంచే 8 టాప్ ఫుడ్స్..
సాధారణంగా అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. చాలా మంది. అందుకు కారణం ఇంట్లో తయారు చేసుకొనే సహజ బ్యూటీ ఐటమ్స్ మీద అవగాహన లేకపోవడమో లేదో టైమ్ లేకపోవడమో కారణం ఏదైనా కావచ్చు. కాబట్టి ఇంట్లో సహజంగా ఉపయోగించే పదార్థాలు కూడా చర్మ సంరక్షణకు ఉపయోగపడుతాయని తెలుసుకొని వాటిని ఉపయోగించడం వల్ల చర్మం నిగారింపు, తాజాదనాన్ని తీసుకురావచ్చు. అందుకు ఉపయోగించాల్సిన పదార్థాలేంటో ఒక సారి చూద్దాం...

ముఖం ప్రశవంతం చేసే నిమ్మరసం
ఇది చాలా విరవిగా దొరికే వంటింటి సామాగ్రి అని అందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి కానీ, అందానికి కానీ దీని మేలు అంతా ఇంతా కాదు.

యవ్వనానికి గుడ్డు
ఇది శాకాహారం కాదు. గుడ్డులోని తెల్ల సొన చర్మ సంరక్షణకు ఒక మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగ పడుతుంది.

మృదువైన సున్నితమైన చర్మానికి తేనె
తేనెను ప్రతి రోజూ ముఖానికి అప్లై చేయ్యొచ్చు. చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచే తేనెను ఉపయోగించడం వల్ల ముఖం మీద ఏర్పడం మచ్చలను తొలగించి...

చర్మంలో దుమ్ము ధూళి శుభ్రపరిచే స్ట్రాబెర్రీస్
స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో పేరుకొన్న...

ముఖానికి రిఫ్రెషనస్ బనానా
అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది.

వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్
ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది.

బొప్పాయి
బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా...

మామిడి
పండల్ల రారాజు మామిడి అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందానికి అన్ని ప్రయోజనాలను చేకూర్చుతుంది.
1. ముఖం ప్రశవంతం చేసే నిమ్మరసం: ఇది చాలా విరవిగా దొరికే వంటింటి సామాగ్రి అని అందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి కానీ, అందానికి కానీ దీని మేలు అంతా ఇంతా కాదు. చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో దీన్ని మించింది లేదు. కాబట్టి దీని ప్రయోగజనం చాలానే ఉంటుంది. నిమ్మరసం ఉపయోగించి చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఇది చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. మొటిమలు మచ్చలను వదలగొడుతుంది. ముఖ చర్మాన్ని శుభ్రం చేసి ఫ్రెష్ మెరుస్తుండేలా చేస్తుంది. కాబట్టి నిమ్మరసంను వేరే ఇతర పదార్థాలు ఉపయోగించకుండా డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేసి కొద్ది నిమిషాల్లోనే శుభ్రం చేసేసుకోవాలి.
2. యవ్వనానికి గుడ్డు: ఇది శాకాహారం కాదు. గుడ్డులోని తెల్ల సొన చర్మ సంరక్షణకు ఒక మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగ పడుతుంది. గుడ్డులోని తెల్లసొనను డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖ చర్మం వదులుగా లేకుండా టైట్ గా ఉంచి యవ్వనంగా ఉండేట్లు చేస్తుంది. గుడ్డులోని తెల్లని సొన ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిని ముఖానికి చల్లుకొని బాగా గుండ్రంగా మర్ధన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం యవ్వనంగా కనబడుతుంది.
3. మృదువైన సున్నితమైన చర్మానికి తేనె: తేనెను ప్రతి రోజూ ముఖానికి అప్లై చేయ్యొచ్చు. చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచే తేనెను ఉపయోగించడం వల్ల ముఖం మీద ఏర్పడం మచ్చలను తొలగించి, చర్మంలో ఏదేని ఇన్ఫెక్షన్ ఉన్నా తొలగిపోతుంది. అంతేకాదు ఇది మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. తేనె ముఖానికి బాగా పట్టించి ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోవాలి. అంతే కాదు తేనెతో ఫేస్ ప్యాక్ ను అతి సులభంగా తయారు చేసుకోవచ్చు. రెండు టీ స్సూన్ల తేనెలో ఒక టీస్పూన్ నిమ్మరసం చేర్చి బాగామిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం మీకే తెలుస్తుంది.
4. చర్మంలో దుమ్ము ధూళి శుభ్రపరిచే స్ట్రాబెర్రీస్: స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రాబెరీ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో పేరుకొన్న దుమ్ము ధూళిని శుభ్రపరిచి ఎటువంటి వంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా కాపాడుతుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ సి యాంటి యాక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల వీటిని డైరెక్ట గా ముఖం మీద స్ర్కబ్ చేయవచ్చు. లేదా ముక్కలుగా కట్ చేసి ముఖం మీద అలాగే పెట్టుకోవచ్చు. స్ట్రాబెరీ చాలా మెత్తగా ఉడంటం వల్ల స్మూత్ మాస్క్ లా ఉపయోగపడుతుంది. అలాగే బ్లూబెర్రీన్ పెరుగు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకొన్న తర్వాత ముఖంలో కనబడే గ్లో మీరు గమనించవచ్చు.
5. ముఖానికి రిఫ్రెషనస్ బనానా: అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది. అందుకు అరటి పండును జస్ట్ బాగా చిదిమి ముఖానికి అప్లై చేసి దానికి కొద్దిగా తేనె చేర్చి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల ర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
6. వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్: ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. ఆరెంజ్ ను కట్ చేసి అలాగే ముఖానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మం స్పష్టంగా కనబడేలా చేస్తుంది.
7. బొప్పాయి: బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా కలిగి ఉండటం చేత మృత కణాలను వదలగొడుతుంది. బొప్పాయి పాలు లేదా బొప్పాయను ముఖానికి అప్లై చేడంవల్ల చర్మంలో అద్భతమైన మార్పులను మీరు గమనించవచ్చు.
8. మామిడి: పండల్ల రారాజు మామిడి అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందానికి అన్ని ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఈ మెత్తని మామిడి పండు చర్మంలో ఓ అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. మామిడిలో ఉన్న విటమిన్ ఎ మరియు యాంటిఆక్సిడెంట్స్ వృద్ధాప్యం ఛాయలు కనబడనీయకుండా పోరాడుతుంది. చర్మకణాలను పునరుత్పత్తికి బాగా ఉపయోగపడి చర్మాన్ని స్థితిస్థాపకత చేకూర్చుతుంది.



Click it and Unblock the Notifications