Latest Updates
-
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం!
వయస్సు పెరిగినా యవ్వనంగా ఉండాలంటే..?
ప్రతి ఒక్కొరూ యవ్వనంగా ఉండటానికి చాలా ఇష్టపడుతుంటారు. కానీ, 30ఏళ్ళు లేదా 30 దాటిన తర్వాత మీ చర్మం కూడా 20సంవత్సరంలో ఉన్నట్లు ఉండదు. ఎందుకంటే ఒత్తిడితో కూడిన జీవన శైలితో చిన్నవయస్సులోనే పెద్దవారిలా కనిపించే లక్షణాలు(ప్రీమెచ్యుర్ ఏజింగ్)పెద్ద సవాల్ వంటిది. మీరు 30ఏళ్ళ సమయానికి, మీరు చర్మంలో ముడుతలు ప్రారంభం అవ్వడాన్ని గమనించవచ్చు. 30లో అలా జరగనప్పుడు, కనీసం 35ఏళ్ళ వయస్సులోనైనా కనబడుతాయి. వయస్సు మీరే లక్షణాలు మీ ముఖంలో ఖచ్చితంగా కనిపిస్తాయి.
ఏజింగ్ స్కిన్ కొరకు కొన్ని స్కిన్ కేర్ టిప్స్ సాధారణం చిట్కాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. పెద్ద వయస్సు కలగిన స్త్రీలు, వారు చిన్న వయస్సులో చర్మం మీద తీసుకొన్న జాగ్రత్తలు మరియు శ్రద్ద అంతగా తీసుకోరు. కాబట్టి ఏజింగ్ స్కిన్ లక్షణాలను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక వేళల మీరు తేలికగా తీసిపడేస్తే, సరైన స్కిన్ కేర్ టిప్స్ పాటించకపోయినా, చర్మంలో ముడుతలు ఎక్కువై అసహ్యాంగా కనబడుతుంది. ఏజ్ స్పాట్ వంటి లక్షణాలు శాశ్వతంగా నిలిచిఉండిపోవడానికి కారణం అవుతుంది.
ఏజింగ్ స్కిన్ కోసం కొన్ని స్మార్ట్ మరియు స్పెషల్ కేర్ చాలా అవసరం. చాలా వరకూ మీరు చాలా సులభంగా చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ కంట్రోల్లో ఉండేలా జాగ్రత్తతీసుకోవాలి. మీరు మీ వృద్ధాప్యం చర్మంపై సమయం సర్వనాశనాలను ఆపడానికి వీలుకాదు, కానీ మీరు మీ మంచి సంరక్షణ చిట్కాలు పాటించి ఏజింగ్ లక్షణాల వేగాన్ని తగ్గించవచ్చు.
ఏజింగ్ స్కిన్ నివారించడంకోసం జీవనశైలిలో కొన్ని మార్పులతో పాటు, బ్యూటీ ట్రీట్మెంట్ ను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ మార్గాలేంటో ఒకసారి చూద్దాం..

నీరు ఎక్కువగా తాగాలి:
వయస్సు పెరిగే కొద్ది, మీ చర్మం పొడిబారడం మొదలవుతుంది. ముందులాగే మీ చర్మంలో ఆయిల్ ఉత్పత్తి కావడం లేదని గమనించవచ్చు. కాబట్టి చర్మంకు తగినంత తేమను అంధించి, హైడ్రేషన్ లో ఉంచుకోండానికి తగినన్ని నీళ్ళు తాగాలి. అంతే కాదు నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్(వ్యర్థాలను తొలగించుకోవచ్చు.

తగినంత నిద్ర:
వయస్సులో ఉన్నప్పుడు మీరు పార్టీ అనిమల్స్ కావచ్చు. ప్రతి రోజూ నిద్రలేకుండా పార్టీలు, పబ్ ల చుట్టూ తిరిగినా, లేట్ నైట్ పార్టీలతో నిద్రలేకున్నా 20ఏళ్ళలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే వయస్సు పెరిగే కొద్ది, చర్మంలో మార్పలు ఏర్పడుతాయి. కొన్నిగంటలు తగినంత నిద్ర పొందలేనప్పుడు, చర్మంలో ముడుతలు, కళ్ళక్రింద చాలా వరకు కారణం అవుతుంది. కాబట్టి నిద్ర విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వొద్దు.

నైట్ క్రీమ్ లను ఉపయోగించాలి:
మనం వయస్సులో ఉన్నప్పుడు, రెగ్యులర్ బ్యూటీ జాగ్రత్తలు మనకు అంత అవసరం ఉండకపోవచ్చు. కానీ వయస్సు పెరిగే కొద్ది, స్కిన్ కేర్ విషయంలో రెగ్యులర్ హ్యాబిట్ చేసుకోవాలి . మీరే వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్ని కాపాడుకోవాలి. ఏజింగ్ స్కిన్ రూపు మాపడానికి నిద్రించే ముందు నైట్ క్రీమ్ లను అప్లై చేయాలి.

స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజ్:
వయస్సులో ఉన్నప్పుడు మీరు త్వరత్వరగా స్నానం చేసి కాలేజ్ కు పరుగులు పెట్టవచ్చు . కానీ వయస్సు పెరిగే కొద్ది, చర్మానికి మాయిశ్చరైజ్ ను అప్లై చేయడం చాలా అవసరం. చర్మం పొడిబారితే ఎక్కువ ముడుతలకు దారితీస్తుంది.

మేకప్ ను శుభ్రం చేసుకోవాలి:
ఏజింగ్ స్కిన్ లో వయస్సు పైబడ్డ లక్షణాలను కవర్ చేసుకోవడానికి మేకప్ ఖచ్చితంగా వేసుకుంటుంటారు. కానీ, నిద్రించే ముందు ఖచ్చింతా మేకప్ ను తొలగించాలని గుర్తించుకోవాలి. కెమికల్ కాస్మొటిక్స్ ముడుతలను మరింత వేగవంతం చేస్తుంది.

నేచురల్:
చర్మాన్నికి సాధ్యమైనంత వరకూ నేచురల్ పదార్థాలను ఉపయోగించాలి, ఇది చాలా ఉత్తమమైన పద్దతి. నేచురల్ యాంటీఏజింగ్ వస్తువులు పసుపు, పాలు, మరియు అలొవెరా వంటి నేచురల్ బ్యూటీ వస్తువులను ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చర్మాన్ని కాపాడుకోవాలి.

యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్:
ఏజింగ్ స్కిన్ చూపించడంలో మీరు తీసుకొనే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు ఉదా: బెర్రీస్, బ్రొకోలీ మరియు బెల్ పెప్పర్ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి చర్మంలో తాజాగా కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతాయి.

స్కిన్ లిప్ట్:
ఎల్లప్పుడూ మాయిశ్చరైజ్ లేదా క్రీమ్ లను అప్ వార్డ్ మోషన్ లో చర్మానికి మర్ధన చేయాలి. క్రీములు, మాయిశ్చరైజర్ లో అప్లై చేసేటప్పుడు క్రిందికి మర్దన చేస్తే చర్మం సాగినట్లు అనిపిస్తుంది.

చెడు అవాట్లను వదిలివేయాలి:
చెడు అలవాట్లు, స్మోకింగ్, మరియు డ్రింకింగ్ కెఫిన్ వయస్సు మీదపడటాన్ని వేగవంతం చేస్తుంది. యవ్వనంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలిని కలిగి ఉండాలి.

డిటాక్స్ :
కొన్ని సందర్భాల్లో డిటాక్స్ డైట్ లో ఫాలో అవ్వాలి. ప్రొసెస్డ్ ఫుడ్స్, కెఫిన్ నివారించి, వ్యర్థాలను తొలగించే ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ మరియు తేనె చాలా ఉత్తమ డిటాక్స్ఫైర్ గా భావిస్తారు.



Click it and Unblock the Notifications