ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్నికి 12 ఉత్తమ పండ్లు

సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఫ్రూట్ ఫేషియల్ గురించి సుపరిచితులైనవారే. ఫ్రూట్ ఫేషియల్ చేసుకొన్న వారు ప్రకాశవంతమైన చర్మంతో నిగనిగలాడుతుంటారు. అందుకు పండ్లను గుజ్జు చేసి ముఖానికి ఫేషియల్ గా వేసుకొంటాం కదా..అలాకాకుండా పండ్లను డైరెక్ట్ గా తీసుకుంటే ఇంకెన్నీ ప్రయోజనాలు చేకూరుతాయో ఒకసారి ఆలోచించండి?అందుకే మీరు పండ్ల ద్వారా న్యూట్రీషినల్ బెనిఫిట్స్ ఎక్కువగా పొందవచ్చు. పండ్లను డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల స్నాక్స్ తిన్న ఫీలింగ్ తో జీర్ణ క్రియను పెంపొందించుకోవడంతో పాటు మీ చర్మ ఛాయను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు.

ఒకరి చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. ఇంకొకరి చర్మం పేలవంగా కనిపిస్తుంది. ఏమిటీ తేడా? బహుశా చర్మం నిగనిగలాడేవారు ఖరీదైన సౌందర్యసాధనాలు వాడుతారేమో! అస్తమానం సౌందర్యశాలలను సందర్శిస్తారేమో! అనుకుంటారు. కాని అదంతా నిజం కాదు. చర్మం నిగారింపు పైపై పూతలతో రాదు. ఖరీదైన క్రీములతో వెలిగిపోదు. కాలానుగుణంగా వాతావరణంలో జరిగే మార్పులను తట్టుకుంటూ చర్మం జీవకళతో నవనవలాడాలంటే మనం రోజూ తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మనం తినే ఆహారం ద్వారానే చర్మానికి కావలసిన పోషణ లభిస్తుంది. ‘చర్మం పేలవంగా, ముడతలు పడ్డట్టుగా, ఉన్నదానికన్నా వయసు మీద పడినట్టుగా కనిపిస్తోందంటే ఆహారం పట్ల మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నమాట' ఆహారానికి తోడు వాతావరణంలో కాలుష్యం, ఎండలు మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలు రావడం, గరుకుగా తయారవడం, వంటివి జరగవచ్చు. ఇలాంటి దుష్ప్రాబావాలన్నింటి నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే..ఆహారంతో పాటు తాజా పండ్లకు కూడా ప్రాధాన్యత కల్పించాలి.

ప్రకటనలు చూసి.. వందలు పోసి.. క్రీములు పూస్తున్నారు.. వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా అంటే..? సమాధానం మాత్రం స్పష్టంగా రావటం లేదు.!! కృత్రిమంగా తయారు చేయబడ్డ క్రీములు వల్ల ఫలితం తూతుమంత్రమే అంటున్నారు పలువుర సౌందర్య నిపుణులు. ప్రక్రతి ప్రసాదించిన సహజ సిద్ధమైన పండ్లు, నట్స్ ఆహారాన్ని క్రమ పద్దతిలో తీసుకుంటే కాంతి వంతమైన చర్మం మీ సొంతమవుతుందని వారు సూచిస్తున్నారు. మరి మీ చర్మ ఛాయను రెట్టింపు చేయడంలో సహాయపడే పండ్లు లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం...

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

దానిమ్మ: దానిమ్మ రుచికి మాత్రమే కాదు. దానిమ్మ గింజల్లో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఎరుపు రంగులో ఉండే దానిమ్మ మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో చక్కెర గణాంకాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

టమోటో: ముఖ చర్మం కోమలం గా కనిపించేందుకు ప్రక్రుతి ప్రసాదించిన టమాటో చాలు . తాజా గా ఉన టమాటో లను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది , పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగించబడతాయి . పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది . ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని , కాంతిని ఇస్తుంది.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

బ్లూ బెర్రీస్:ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

అవొకాడో: అవొకాడో : అవొకాడో చాలా మందికి తెలియదు. మన నిత్యం తినేటటువంటి పండ్లలో ఇది కూడా ఒక రకమైన పండే. పండు మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ఒక దివ్వౌషదం. ముఖ్యంగా పొడిబారిన చర్మం కలవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పండును డైరెక్ట్ గా తినడవచ్చు. అలాగే ఇది ఇక అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.... అవొకాడో పండును సగ భాగానికి కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లైచేసి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

అరటిపండు: అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండు ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచడమే కాదు. చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెగ్యులర్ ఒక అరటిపండు తినాలి. పొడి చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. బాగా పండిని అరటి పండును, చేత్తో మెత్తగా గుజ్జులా చేసి ఫేషియల్ మాస్క్ వేసుకోవాలి. పదినిముషాల తర్వాత శుభ్రం చేసి చూడండి మార్పు మీకే తెలుస్తుంది. చర్మ బిగుతుగా అవ్వడంతో పాటు ముఖం కాంతివంతంగా మారుతుంది.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

మాయిడి: మామిడి పండల్ల రారాజు మామిడి అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందానికి అన్ని ప్రయోజనాలను చేకూర్చుతుంది. మామిడి పండ్లను డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వాతావరణ కాలుష్యం ,దుమ్ము ధూళి కారణంగా చర్మంపై మృతకణాలు తొలగించడంలో మామిడి ఎంతగానో సహకరిస్తుంది .రెండు చెంచాల పాలు ,చెంచ తేనె ,చెంచాన్నర మామిడిపండు గుజ్జు అన్నిటిని కలిపి ముఖానికి రాసి మూడునిమిషాలు మర్దన చేసి ఐదు నిమిషాలయ్యాక తొలగించాలి.ఇది లోతుగా చర్మాన్ని శుభ్రం చేసి మలినాలని తొలగించి చక్కని తేమ అందిస్తుంది.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

చెర్రీస్: చూడటానికి చిన్నగా..పుల్లగా ఉండే ఈ చెర్రీస్ మరో లో గైసిమిక్ ఇండెక్స్ ప్రూట్. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించే ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చెర్రీస్ లో బయోఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి హెయిర్ లాస్ ను అరికడుతాయి.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

బొప్పాయి: బొప్పాయి బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా ఉన్నాయి.సహజంగా ఈ పండు అందరి ఇళ్లలో దొరుకుతుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతం చేయటంలో బొప్పాయి తన వంతు పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటి మంచిది. అంతే కాదు బొప్పాయి గుజ్జుతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. పాపాయ అద్భుతమైన చర్మ క్లెన్సర్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే పాపాయలో పపిన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆయిల్ స్కిన్ కలవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖంలో ఉన్నజిడ్డును తొలగిస్తుంది. అంతే కాదు చర్మ కాంతిని పెంచి చర్మ ఛాయను పెంచుతుంది. నల్లటి వలయాల్ను తొలగిస్తుంది. చారలు, గీతలు తొలగిస్తుంది. పాపాయను చిన్న ముక్కలుగా చేసి, గుజ్జులా తయారు చేసుకొని ముఖానికి, కళ్ళ క్రింది మాస్క్ వేసి శుభ్రపరచుకోవాలి.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

ఆరెంజ్: అరటి, నారింజ, జామ వంటి తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది.ప్రతి మనిషికి రోజుకు 200 గ్రాముల విటమిన్ 'సి' అవసరమవుతుంది. కాబట్టి నారింజ జ్యూస్ తాగటం కన్నా పండు రూపుంలో ఆరగిస్తే ఉత్తమం. ఈ పండును తినటం వల్ల సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం మన చర్మం పై ఉండదు. అంతేకాదు చర్మం ముడతల పడకుండా, బిగుతుగా ఉండేదుకు సహకరిస్తుంది.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

కివి: కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖ్యం బ్యూటిఫుల్ గా కనబడుతుంది.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

స్ట్రాబెర్రీ: స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడగానే నోరూరిస్తూ ఎర్రని రంగులో చిరుపులుపుతో, స్వీట్ గా స్వభావం కలిగి, చక్కటి ఆకారం కలిగినటువంటి పండు స్ట్రాబెరీ. ఈ ఫ్రూట్ తినడానికి మాత్రమే కాదు సౌదర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. 1. స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్‌ ప్రెష్‌ గా కనిపిస్తుంది.

అందాన్ని రెట్టింపు చేసే 12 బెస్ట్ ఫ్రూట్స్..!

నిమ్మ: ఇది చాలా విరవిగా దొరికే వంటింటి సామాగ్రి అని అందరికీ తెలిసిందే.నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్వౌషదం అంతే కాదు. చర్మాన్ని శుభ్రపరచుటలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు కలిగి ఉన్నది. చర్మాన్ని శుభ్ర పరిచి ఫ్రెష్ గా ఉంచుతుంది. నిమ్మకాయను సౌందర్యాన్ని పెంచే ఖచ్చితమైన నేచురల్ బ్లీచ్ అని చెప్పవచ్చు. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు కమిలిన చర్మాన్ని బాగు చేసి, ముఖంలో ఉన్న మొటిమలు మచ్చలను తొలగిస్తుంది.

Story first published: Tuesday, June 18, 2013, 12:40 [IST]
Desktop Bottom Promotion