Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
కొంచెం స్మార్ట్..కొంచెం సాఫ్ట్ -మెన్ బ్యూటీ టిప్స్
సౌందర్యం అనేది ఒక్క మహిళలకు మాత్రమే కాదు. మగవారు కూడా తమ సౌందర్యాన్ని ఆహార్యాన్ని కాపాడుకోగల శక్తిని కలిగి ఉన్నారు. సాధారణంగా మేల్ నటులు, సెలబ్రెటీలు మాత్రమే మేకప్ వేసుకొంటారు అనేది వాస్తవమే అయినా.. సాధారణ వ్యక్తులు కూడా తమ సౌందర్యం పెంపొందించుకోవడానికి మేకప్ వేసుకోవచ్చు. చాలా మంది మేకప్పా అని సిగ్గుపడుతారు లేదా మగవారేంటీ.... మేకప్ ఏంటీ అని వెక్కిరిస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో మహిళలకు ధీటుగా పురుషులు కూడా అందంగా కనబడటానికి కొన్నిబ్యూటీ టిప్స్ ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో మహిళల్లో మాదిరే పురుషుల్లో కూడా వారి అందంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందంగా ఉండటానికి అందంగా కనబడటానికి వారు కూడా రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారి కోసం తప్పకుండా కొన్ని బ్యూటీ టిప్స్ అవసరం.
ప్రస్తుత జనరేషన్ లో హెయిర్ రిమూవల్ పద్ధతులు అమ్మాయిలకు మాత్రమే అనుకుంటారు చాలామంది. కాని ఇటీవల మగవారు కూడా చర్మం మృదువుగా ఉండటం కోసం హెయిర్ రిమూవర్ మెథడ్స్‌ను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా బాడీ బిల్డర్స్, సైక్లిస్ట్‌లు, స్విమ్మింగ్ చేసేవారు, డ్యాన్సర్స్... ఈ జాబితాలో ఉండే అవకాశాలు ఎక్కువ. శరీరంపై దట్టంగా వెంట్రుకలు ఉన్నవారు వాటిని తొలగించుకోవడానికి వ్యాక్సింగ్, లేజర్ చికిత్సల కోసం సెలూన్‌లను ఆశ్రయిస్తున్నారు.

హెయిర్ రిమూవల్ పట్ల ఆసక్తి చూపేవారు... చెవుల వెనకాల, మెడ, వీపు, ఛాతి, భుజాలపైన, బాహుమూలాల్లో ... దట్టంగా వెంట్రుకలు ఉన్నవారు.
లేజర్: ఈ చికిత్సలో వెంట్రుక కుదురు దగ్గర మళ్లీ వెంట్రుక పెరగకుండా నశింపజేస్తారు. ఈ పద్ధతి దీర్ఘకాలం పనిచేస్తుంది. ఈ చికిత్సకు 30 నిమిషాలు పడుతుంది. దాదాపు 8 సిటింగ్స్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది.
గమనిక: నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే ఈ చికిత్సలు చేయించుకోవాలి.
వ్యాక్సింగ్: మైనంలాంటి వ్యాక్స్‌లను హెయిర్ రిమూవర్ కోసం ఉపయోగించడం పాత పద్ధతి. వ్యాక్స్ లోషన్‌స మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ లోషన్‌ని చర్మంపై లేయర్‌లా పూసి, క్లాత్(బ్యాండేజ్‌కు వాడే గట్టి క్లాత్‌ను ఉపయోగించవచ్చు)ను ఆ లేయర్‌పైన వేసి, అదిమి, లాగాలి. కనుబొమల ఆకారానికి, చెవుల దగ్గర, మెడ, కాళ్లు, అండర్‌ఆర్మ్స్, భుజాలు, ఛాతిపై ఇలా శరీరం అంతా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో వెంట్రుక పెరుగుదల నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఉంటుంది.
గమనిక: ఈ పద్ధతిలో కొంత నొప్పి ఉంటుంది. అందుకని నిపుణుల పర్యవేక్షణలో చేయించుకోవాలి. చర్మ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు కొన్నాళ్లు యాంటీబ్యాక్టీరియల్ లోషన్స్ వాడాలి. ఇన్ఫెక్షన్ తగ్గాక వ్యాక్సింగ్ చేయించుకోవడం మేలు.



Click it and Unblock the Notifications
