ఆయుష్యును పెంచుతాయి..అందాన్ని రెట్టింపు చేస్తాయి..!

అందం గా ఉండాలనే కోరిక ప్రతిఒక్కరిలొనూ ఉంటుంది . నేడు ఆ అందచందాల్ని పొందడానికి బ్యుతీపార్లర్లను ఆశ్రయిస్తునారు . .. లేదా వివిధ రకాలైన వ్యాపార ప్రకటనలను చూసి ప్రభావితమవుతునారు . ఈ కృత్రిమ రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అందచందాలు వస్తాయో లేదో కాని కొన్ని చరం సమస్యలు తలెత్తుతున్నాయి .

ఆరోగ్యంతో పాటు అందానికి పండ్లు బాగా ఉపయోగ పడతాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్‌ కార్బోహైడ్రేట్స్‌, పీచు పదార్థాలతో బాటు 'ఆంటి ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి సౌందర్యాన్నివ్వడంతోపాటు రకరకాల చర్మ వ్యాధుల రాకుండా నివారిస్తాయి. ప్రకృతి పరంగా లభించే పండ్లును తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు.

అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్యును పెంచుతాయి. ఆరోగ్యానికి ఎంతగా పండ్లు ఉపయోగపడుతాయో.. అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా అంతగా పనిచేస్తాయి.. చర్మాన్నికి మెరుపునందంచి, కాంతివంతగా, ఫ్రెష్ గా ఉంచి...అందాన్ని రెట్టింపు చేసే కొన్ని రకాల పండ్లు మీకోసం ...

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

బొప్పాయి: బొప్పాయిలో ఉండే విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ, విటమిన్‌ సి చర్మానికి మృదుత్వాన్ని కలుగజేస్తాయి. బొప్పాయి జ్యూసు ఎండ వల్ల వచ్చే మచ్చలను నివారిస్తుంది. దీనితో తయారు చేసిన నూనె, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. వేసవికాలంలో బొప్పాయి ముఖానికి మంచి ఫేస్‌ ప్యాక్‌లా పనిచేస్తుంది. ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు , ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు , ఒక స్పూన్ నిమ్మరసం ముద్దలా తయారుచేసి ముఖానికి పట్టించి , 15 - 20 నిముషాలు ఉంది ముఖం కడుక్కోవాలి . ముఖ చర్మం బిగుతుగాను , కాంతివంతం గాను ఉంటుంది .

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

పైనాపిల్: ముకం మీద ముడతలు వస్తే ముసలితనాన్ని ఎత్తిచుపుతుంది .. దీనికిగాను పైనాపిల్ రసం , యాపిల్ రసం , నిమ్మరసము ఒక్కో స్పూను చొప్పున్న తీసుకొని బాగా కలియబెట్టి ముఖానికి పట్టించి , అరగంట నిముషాలు ఉంచి ముఖం కడుగుకోవాలి . ముడతలు తగ్గిపోతాయి ..ఒక వారం రోజులు చేస్తే .. ఇలా ప్రతి వారం ఒకసారి చేయాలి .

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

ద్రాక్ష: తియ్యని పుల్లని ద్రాక్ష పండ్లు తినడానికే కాదు, సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ద్రాక్షలు చర్మానికి మెరుపు తీసుకొస్తాయి. వయసు చాయలు కనిపించకుండా చేస్తాయి. కొన్ని ద్రాక్ష పళ్లని చేతులతో ముద్దగా చేసుకుని, దానికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ పట్టించి కాసేపయ్యాక కడిగేసుకుంటే జిడ్డు దూరమై, చర్మం కాంతిమంతం అవుతుంది.

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

మామిడి: వాతావరణ కాలుష్యం ,దుమ్ము ధూళి కారణంగా చర్మంపై మృతకణాలు తొలగించడంలో మామిడి ఎంతగానో సహకరిస్తుంది .రెండు చెంచాల పాలు ,చెంచ తేనె ,చెంచాన్నర మామిడిపండు గుజ్జు అన్నిటిని కలిపి ముఖానికి రాసి మూడునిమిషాలు మర్దన చేసి ఐదు నిమిషాలయ్యాక తొలగించాలి.ఇది లోతుగా చర్మాన్ని శుభ్రం చేసి మలినాలని తొలగించి చక్కని తేమ అందిస్తుంది.

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

ఆపిల్ స్లైస్ ఆయిల్ కంట్రోల్ సొల్యూషన్: ఆపిల్ ఒక్కటి ఉంటే చాలు ఏమయినా చేయొచ్చు. ఆపిల్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి. ఆయిలీ స్కిన్‌కు ఇది ఇంట్లో చేసుకోగలిగిన సింపుల్ ట్రీట్‌మెంట్. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాల్లో దాగిన అదనపు ఆయిల్ పోతుంది. జిడ్డు రావడాన్ని కంట్రోల్ చేస్తుంది కూడా.

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

బనానా ఫేషియల్ క్రీమ్: బాగా పండిన అరటిపండును పావు భాగం తీసుకుని మెత్తగా చిదిమి మెత్తగా అయ్యేవరకు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పదిహేను లేదా ఇరవై నిమిషాల తర్వాత ముందుగా వేడినీటితోనూ తరువాత చల్లటి నీటితోనూ కడగాలి. కడిగిన తర్వాత ముఖాన్ని తుడవకుండా గాలికి ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరవడంతో పాటు పాటు ముడతలను కూడా నివారిస్తుంది.

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

ఆరెంజ్ పీల్ నేచురల్ బ్లీచ్: కమలాపండు తొక్కలు, పాలు తీసుకోవాలి. కమలా తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పౌడర్‌లో పాలు కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి ప్యాక్ వేసి అరగంట తరవాత కడగాలి. ఇలా రోజూ కాని రెండు రోజులకొకసారి కాని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది నేచురల్ బ్లీచ్. చర్మానికి హాని కలిగించకుండా తెల్లబరుస్తుంది. ముఖం మీద ఉన్న అన్‌వాంటెడ్ హెయిర్ కూడా రంగు మారి చర్మపురంగుతో కలిసిపోతుంది.

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

అవొకాడో : అవొకాడో చాలా మందికి తెలియదు. మన నిత్యం తినేటటువంటి పండ్లలో ఇది కూడా ఒక రకమైన పండే. పండు మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఇది ఒక దివ్వౌషదం. ముఖ్యంగా పొడిబారిన చర్మం కలవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇక అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందుకు చేయాల్సిందల్లా.... అవొకాడో పండును సగ భాగానికి కట్ చేసి మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లైచేసి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

పీచెస్: ఇవి చూడటానికి ఆపిల్స్ లానే ఉంటాయి. కానీ ఆపిల్ కాదు. పీచెస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, బిగుతు చేయడానికి మాత్రమే కాదు, ముఖ కండరాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది. అందుకు పీచెస్ పండ్ల మీద ఉన్న తొక్కను తొలగించి లోపల ఉన్న పదార్థంతో ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దాంతో వెంటనే మీరు ఫ్రెష్ గా ఫీల్ అవ్వడమే కాకుండా చర్మం టైట్ గా అనిపిస్తుంది.

మేని ఛాయను రెట్టింపు చేసే సమ్మర్ ఫ్రుట్స్...!

టమోటో: ముఖ చర్మం కోమలం గా కనిపించేందుకు ప్రక్రుతి ప్రసాదించిన టమాటో చాలు . తాజా గా ఉన టమాటో లను బాగా చితకకొట్టి అలా వచ్చిన రసానికి రెండు చెంచాల పాలు కలుపగా వచ్చిన గుజ్జును ముఖానికి రాసుకుని పది , పదిహేను నిముషాలు ఉంచి ఆ పైన నీటితో కడుక్కోవాలి . దీనివలన చర్మం పైన మ్రుతకనాలు తొలగించబడతాయి . పైగా చర్మం లోపలికి వెళ్లి శుభ్రం చేస్తుంది . ముఖం పైనుండే జిడ్డు తొలగిపోయి చర్మానికి తాజాదనాన్ని , కాంతిని ఇస్తుంది.

Story first published: Friday, May 10, 2013, 12:24 [IST]
Desktop Bottom Promotion