Latest Updates
-
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది?
శీతాకాలంలో మహిళల చర్మసంరక్షణకు కొన్నిరహస్యాలు
ప్రతి మహిళ అందంగా మరియు కాంతివంతమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటుంది . వింటర్ స్కిన్ కేర్ లో నైట్ క్రీమ్స్ అద్భుత పాత్ర పోషిస్తాయి. చర్మానికి నైట్ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల చర్మాన్ని తేమగా, కాంతివంతంగా చేస్తాయి మరియు నిద్రించేటప్పడు చర్మ కణాల పునరుద్ధరణకు సహాయపడుతాయి. ఈ వింటర్ స్కిన్ కేర్ సీక్రేట్ వల్ల, మీరు ఎటువంటి ఆందోళన లేకుండా, శీతాకాలంలో ఎదురయ్యే అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. వింటర్ సీజన్ లో అన్నీ ఫ్యాన్సీ మేకప్ ట్రిక్ మరియు సీక్రెట్స్ అన్ని మీ పొడి చర్మ వెనుక దాగి ఉండి, చర్మాన్ని మరింత వరెస్ట్ గా మార్చుతుంది.
వింటర్ లో, మచ్చుకురిసే సీజన్ లో మీ చర్మానికి రక్షణ ఏవిధంగా కల్పించాలి మరియు నేచురల్ గా ఏవిధంగా తొలగించుకోవల్సిన ఆశ్చర్యం కలిగించవచ్చు. అందుకోసం ఇక్కడ కొన్ని మీరు ‘సీక్రెట్ గా' అనుసరించి అందమైన చర్మ సౌందర్యాన్ని పొందండి. సంవత్సరం మొత్తం ఏ సీజన్ లో అయినా సరే చర్మ సంరక్షణ చాలా అవసరం. ఈ వింటర్ సీజన్ లో మీ చర్మఛాయలో మార్పును గమనించినట్లైతే, అది వాతావరణంలో మార్పుల వల్లే, కాబట్టి, చర్మం మరింత వరెస్ట్ గా తయారవ్వక ముందే చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వింటర్ సీజన్ లో మహిళలు అనుసరించాల్సిన కొన్ని బెస్ట్ వింటర్ స్కిన్ కేర్ టిప్స్ ను బోల్డ్ స్కూ మీకోసం అందిస్తోంది . ఈ వింటర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ 20ఏళ్ళ వయస్సు దాటిన మహిళలకు చాలా అవసరం. మీ చర్మానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం..

మాయిశ్చరైజర్:
నాణ్యమైన మాయిశ్చరైజింగ్ క్రీములతో చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మం సాఫ్ట్ గా మరియు తేమగా ఉంటుంది.

నీళ్ళు:
సీజన్ ఏదైనా, మన శరీరానికి మాత్రం తగినన్ని నీళ్ళు అవసరం. ముఖ్యంగా వింటర్ సీజన్ లో మన శరీరానికి నీళ్ళు ఒక మెడిసిన వంటిది. ప్రతి రోజు ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల చర్మం తేమగా మరియు మెరుస్తుంటుంది.

వేడి స్నానాలే చేయకూడదు:
వింటర్ సీజన్ లో వేడివేడిగా స్నానం చేయాలినిపిస్తుంది. కానీ, వింటర్ స్కిన్ కేర్ లో మొదట చేయాల్సింది వేడినీటి స్నానాన్ని నివారించాలి. వేడినీటి స్నానం వల్ల చర్మం మరింత పగుళ్ళకు దారితీస్తుంది.

ఆల్కహాల్ ట్రీట్మెంట్స్:
ఆల్కహాల్ అన్ని రకాలా క్రీమ్స్ మరియు స్క్రబ్స్ లో ఉపయోగించిబడి ఉంటుంది . కాబట్టి, ఆల్కహాల్ బేస్డ్ వింటర్ క్రీమ్ లను నివారించడం వల్ల, శీతాలంలో ఏర్పడే చర్మం పగుళ్ళు మరియు రాషెస్ ను నివారించవచ్చు.

లిప్ కేర్:
వింటర్లో మహిళలు తమ పెదాలను తేమగా మరియు సాప్ట్ గా ఉంచుకోవడానికి బట్టర్ ఒక వింటర్ స్కిన్ కేర్ సీక్రెట్. వింటర్లో పెదాల పగుళ్ళను నివారించాలంటే, నిద్రించే ముందు, మీ పెదాలకు కొద్దిగా బట్టర్ ను అప్లై చేయాలి.

నోస్ బామ్:
శీతాకాలంలో ముక్క వద్ద, ముక్కు ప్రక్కన పగుళ్ళను నివారించడానికి అనేక మార్గాలున్నాయి. అందుకు, ప్రతి రోజూ ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత కొద్దిగీ షీ బటర్ ను ముక్కచుట్టు అప్లై చేయడం ఉత్తమం.

మేకప్:
వింటర్ సీజన్ లో మేకప్ అప్లై చేయడం వల్ల మీలో కొంత మార్పు కనిపిస్తుంది. కాబట్టి, మీ ముఖానికి మేకప్ అప్లై చేయడానికి ముందు, కొద్దిగా కోల్డ్ క్రీమ్ ను అప్లై చేసి, ముఖంను తేమగా ఉంచుకోవాలి.

ఫేస్ ప్యాక్స్:
సంవత్సరం అంతా మీ ముఖానికి ఫేస్ ఫ్యాక్ లు వేసుకొనే అలవాటు ఉన్నట్లైతే, ఈ వింటర్ సీజన్ లో కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అయితే, ఈ వింటర్ సీజన్ లో మీ చర్మం మరింత అందంగా, సున్నితంగా ఉంచుకోవాలంటే ఫ్రూట్ ఫేస్ ప్యాక్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

ఎక్స్ ప్లోయేట్:
వింటర్ సీజన్ లో మీచర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయడం కొచ్చెం కష్టమైన పనే. మరి చర్మం మరింత పొడిబారడం జరుగుతుంది. అందువల్ల, వింటర్ సీజన్ లో ఎక్స్ ఫ్లోయేట్ చేయడానికి, ముఖం, మెడ, వీపు మన్నికైన స్ర్కబ్ ను మాత్రమే ఉపయోగించాలి. అందుకు కుక్కింగ్ సాల్ట్ చాలా మంచిది.

ప్రత్యేక వస్తువులు:
చర్మం మరింత సాప్ట్ గా ఉంచుకోవడానికి తేనెను చాలా మంది మహిళలు ఉపయోగిస్తుంటారు. నిపుణుల ప్రకారం, తేనె మీ చర్మం పగుళ్లకు దారితీస్తుంది. ఎందుకంటే తేనెలో చర్మానికి అంటుకోవడం వల్ల చర్మం మరింత బిగుతుగా చేస్తుంది . కాబట్టి, వింటర్ లో చర్మానికి తేనెను ఉపయోగించకూడదు.

మొటిమలు:
మీరు వింటర్ సీజన్లో మొటిమలతో బాధపడుతున్నట్లైతే, మీ చర్మం మరింత ఘోరంగా తయారవుతుంది. ఈ సమస్య నివారించడానికి బెస్ట్ వింటర్ కేర్ సీక్రెట్ గోరువెచ్చని నీటితో మీ ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల దురద, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు.

కొన్ని రకాల కూరగాయలను నివారించండి:
ఎల్లప్పుడు వింటర్ సీజన్ లో అనేక రకాల కూరగాయలను తినమని కోరుతుంటారు. కానీ, ఆస్పరాగస్ వంటి వెజిటేబుల్స్ పొడిచర్మానికి దారితీస్తుంది.



Click it and Unblock the Notifications