Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పగిలిన ముఖ చర్మానికి ఉపశమనం ఎలా...?
మీ శరీరంలోని చర్మం మొత్తం మీద మీ ముఖం మీది చర్మమే ఎక్కువగా కఠినమైన వాతావరణానికి, ఎండిపోయే ముఖ సంరక్షణ ఉత్పత్తులకు, తేమ తగ్గుదలకు బాగా గురౌతుంది. చర్మం మీద పగుళ్ళు వచ్చి ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. అలర్జీల వల్ల చర్మం దురద పుట్టి ఎరుపెక్కుతుంది. ముఖం మీది చర్మం మృదువుగా ఉండకపొతే దాన్ని బాగుచేసుకుని బాధను, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలో మీరు తెలుసుకోవాలనుకు౦టున్నారా?
చర్యలు:
1. మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. కానీ ఎప్పటికన్నా కొంచెం తక్కువ క్షుణ్ణంగా చేయండి. మీ ముఖం నీటికి, క్లీన్సర్లకు ఎంత తక్కువ సమయం బహిర్గతం అయితే అంత మంచిది. తేలిక పాటి సబ్బు లేదా క్లీన్సర్లు వాడండి, రుద్దడం తగ్గించండి.
2. వేడి నీటి స్నానాలు, షవర్లు తగ్గించండి. దాని బదులు గోరువెచ్చటి నీటిని వాడండి. మీ ముఖాన్ని రుద్దే బదులు పొడిగా అయ్యేలా అద్దుకోండి.
3. వెంటనే మాయిశ్చరైజర్ రాయండి. క్రీమీగా వుండే మాయిశ్చరైజర్లు ఎక్జేమా వుండే వాళ్ళకు మంచివి. లోషన్లు తేలిగ్గానే వుంటాయి గానీ, ఆల్కాహల్ వుంటుంది కనుక జిడ్డుగా వుండే ఆయింట్మెంట్ లేదా క్రీమ్ వాడలేని పక్షంలో మాత్రమే వాడండి. మీకు మొటిమలు ఉన్నట్టయితే నూనె రహిత ఉత్పత్తులే వాడండి.

4. పొడిగా వుండి దురద పెట్టె ముఖ చర్మానికి స్థానికంగా దొరికే పై పూత కార్టిసోన్ క్రీమ్ ను 1 నుంచి 2 వారాల పాటు రాయండి. దెబ్బ తిన్న చర్మానికి మాత్రమె రోజుకు రెండు సార్ల కన్నా ఎక్కువ కాకుండా ఈ క్రీమ్ రాయండి. ముందుగా కార్టిసోన్ రాసాక, దాని మీద మాయిశ్చరైజర్ రాయండి. మీరు వాడే ఆయింట్మెంట్ ఏదైనా మీ చర్మం మండేలా లేదా ఎరుపెక్కేలా చేస్తే దాన్ని వాడడం ఆపేయండి. దురద పుట్టకుండా ఉండడానికి వాడే ఉత్పత్తులో వుండే కఠినమైన రసాయనాలు ఇప్పటికే పాడైన చర్మాన్ని మరింత చీకాకు పెడతాయి. కర్పూరం లేదా మెంతాల్ వుండే దురద నివారణ క్రీములు సాధారణంగా ముఖం మీది చర్మానికి హాని చేయవు. దురద లేకపోతే మీ ముఖాన్ని గోకడం తగ్గుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
5. ఇంట్లో తేమ కలిగించే యంత్రం నడిపితే పొడి గాలి తగ్గుతుంది - ఎందుకంటే పొడి, పగిలిన చర్మానికి ఇదే ప్రధాన కారణం.
6. రోజుకి మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు మాయిశ్చరైజర్ రాయండి. మీరు గోరువెచ్చటి స్నానం లేదా షవర్ చేసి వచ్చాక దీన్ని పూయడం ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీ చర్మంలో సాధ్యమైనంత ఎక్కువ తేమ కలిగి ఉండేలా చూసుకుంటే పగిలిన చర్మం త్వరగా నయం అవడానికి సాయం చేస్తుంది.
7. మీ ముఖం మీది చర్మం బాగా పగిలినా ఇన్ఫెక్షన్ వచ్చినా మీ వైద్యుడిని లేదా చర్మ వైద్యుడిని కలవండి. డెర్మటైటిస్ అనేది పుట్టుకతో రావచ్చు, హార్మోన్ల అసమతౌల్యం వల్ల రావచ్చు, లేదా విషపు మొక్కల్ని తాకినందువల్ల గానీ తామర లాంటి వ్యాధుల వల్ల రావచ్చు. ఇలాంటప్పుడు, ఇతర చికిత్సలు కూడా అవసరమౌతాయి. మీ ముఖం మీది డెర్మటైటిస్ పొడిబారడం వల్ల అయితే, మీ వైద్యుడు గృహవైద్య చిట్కాలు, మందుల షాపుల్లో దొరికే వాటికన్నా మరింత బలమైన మందులు, చికిత్సా వాడాల్సి రావచ్చు.



Click it and Unblock the Notifications
