Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బాధించే మొటిమలు, నొప్పిని నివారించే చిట్కాలు..!
చాలా మందికి అందమైన ముఖం, తెల్లగా మిళమిళ మెరిసిపోతుంటుంది. కానీ, ముఖంలో ఏదో లోపం, ఏంటంటే మొటిమలు. ఒక్క మొటిమ ఉన్నాచాలు, అందాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఇటువంటివి ఎక్కువగా ప్రధానమైన పార్టీలకు మరియు కార్యక్రమాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడే ఇలా జరుగుతుంటుంది. మొటిమలు రావడం మాత్రమే కాదు చాలా నొప్పిని కలిగిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి.
అందుకు చింతించాల్సిన పనిలేదు. ఈ మొటిమ సమస్యలను నివారించుకోవడానికి మనకు ఇంట్లోనే చాలా వస్తువులు ఉన్నాయి. మన వంటగదిలోని నిత్యవసర వస్తువులతోనే అనేక చర్మ సమస్యలతో పాటు, మొటిమలు మచ్చలు నివారించుకోవచ్చు.
ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సౌందర్యానికి బాగా సహాయపడుతాయి. ఆరెంజ్, ద్రాక్ష. కూరగాయల్లో కీరదోస, నిమ్మ ఇక వంటింటి వస్తువులు మెంతులు, తేనె మరియు ఇతరములు. ఇటువంటివి చాలనే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన మార్పులు తీసుకురావడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొటిమలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. మొటిమల నివారణకు అనేక క్రీములు, చికిత్సలు, ట్రీట్మెట్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కంటే ఇటువంటి మన్నికైన మరయు చీపైన పదార్థాలతో రెగ్యులర్ గా ట్రై చేసి, మొటమలకు దూరంగా ఉండండి.
మిమ్మల్ని భాదించే మొటిమలను నివారించడానికి ఎఫెక్టివ్ గా ఉపయోగపడే కొన్ని పదార్థాలు లేదా వస్తువులను క్రింది విధంగా ఉన్నాయి. వాటిని పరిశీలించి అందమైన, స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందండి..

నిమ్మరసం:
భాదకరమైన మొటిమలను నివారించడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసం చర్మ రంధ్రాల్లోనికి చొచ్చుకొనిపోయి మురికిని తొలగిస్తుంది. నిమ్మకాయను రెండు లేదా మూడు భాగాలుగా కట్ చేసి ముఖం మీద రుద్దాలి. రుద్దిన తర్వాత కొన్ని గంటలు అలాగే ఉంచాలి. తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల పెయిన్ ఫుల్ పింపుల్స్ ను నివారించి, చికిత్సనందిస్తుంది.

అద్భుతమైన మూలిక మెంతి:
మీరు మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేవచ్చు. నొప్పికలిగించే మొటిమల నివారణకు ఇది ఒక అద్భుతమైన హెర్బల్ రెమడీ. కొన్ని తాజా మెంతి ఆకులను తీసుకొని, కొద్దిగా నీళ్ళు చేర్చి, మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15నిముషాలు అలాగే వదిలేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేపతో అమ్మమ్మ చిట్కా:
స్నానం చేసే నీటిలో వేపాకులను వేయడం మీ అమ్మ లేదా బామ్మగారు వేయడాన్ని బహుశా మీరు చూసి ఉంటారు. అనేక చర్మ సమస్యలను నివారించడంలో అద్భుతమైన గుణగణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. వేపఆకులను మెత్తగా పేస్ట్ చేసి ప్రతి రోజూ ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు మచ్చలు నివారించుకోవచ్చు.

అలోవెర జెల్:
అనేక బ్యూటీ సమస్యలను నివారించడం కోసం అలోవెర జెల్ ను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. చాలా రకాలా బ్యూటీ క్రీముల్లో వినియోగిస్తున్నారు. అలోవెరా జెల్ ను సింపుల్ గా ముఖానికి అప్లై చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది. మొటిమలను పూర్తిగా నివారించడం కోసం ఇందులో పుష్కలమైన ఔషధగుణాలున్నాయి.

టీట్రీ ఆయిల్:
ఒక చుక్క టీ ట్రీ ఆయిల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమల మాయం అవుతాయి. మొటిమలు నివారించడంలో టీ ట్రీ ఆయిల్ చాలా బాగా తెలిసనటువంటి నేచురల్ హోం రెమడీ. ఇది ఒక యాంటీ సెప్టిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. మరియు మొటిమలను నివారించడంలో బ్యాక్టీరియాతో పోరాడే కణాలను ఉత్పత్తి చేస్తుంది.

తేనె:
మొటిమల ఉన్న ముఖం మీద వారం రోజుల పాటు క్రమంగా తేనెను అప్లై చేసి పది నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇది మొటమలకు దారితీసే చర్మ రంధ్రాలు మూసుకుపోయేందుకు బాగా సహాయపడుతుంది.

కీరదోస:
కీరదోస మరియు పెరుగు తీసుకొని మెత్తని పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంటా అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్:
ఆరెంజ్ లో పుష్కలమైన విటమిన్ సి మరియు అసిడిక్స్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక చర్మ సమస్యల నివారించడానికి ఖచ్చితంగా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, పొడి చేసి నీళ్ళతో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఇది నొప్పి కలిగికించి మొటిమల నుండి తక్షణ ఉపశమనం కలిగించి మొటిమలు రాకుండా నివారిస్తుంది.

ద్రాక్ష:
ఆరెంజ్ లాగే ద్రాక్షలో కూడా పుష్కలమైన విటమిన్ సి ఉంది . మొటిమలతో బాధపడుతున్నట్లైతే ద్రాక్షను రెండుగా కట్ చేసి ముఖం మీద బాగా మర్ధన లేదా రుద్దాలి. రుద్దిన తర్వాత అరగంట పాటు అలాగే వదిలేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టూత్ పేస్ట్:
నిద్రించడానికి ముందు నొప్పిని కలిగించే మొటిమల మీద కొద్దిగా టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి . ఇలా రెండు మూడు రోజులు వరుసగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు లేని స్వచ్చమైన ముఖ సౌందర్యాన్ని పొందవచ్చు.



Click it and Unblock the Notifications











