Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
పండ్లతో చర్మానికి రక్షణ, టైట్‌నెస్, కాంతి, నిగారింపు
సౌందర్యాన్ని నిర్వచించినపుడు చర్మకాంతి ముందు వరుసలోనే ఉంటుంది. మెరుపులీనే చర్మం చూసే కళ్ళను ఆకట్టుకుంటుంది. అంతేకాదు, వయసుని చెప్పే శారీరక లక్షణాల్లో కూడా చర్మానిదే ప్రధమస్థానం. యవ్వన వంతమైన చర్మం ఉన్నవారు తక్కువ వయసున్న వారిలా కనిపించడం అందరికీ తెలిసిన విషయమే. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మకాంతి తగ్గుతుండటం సహజమే. పెదవుల పక్కన, కళ్ళ దగ్గర, మెడమీద కనిపించే ముడతలు పెరుగుతున్న వయసుని చెబుతుంటాయి. ప్రత్యేకంగా వయసు కారణంగా చర్మంలో వచ్చే ఇలాంటి మార్పులను నిరోధించేందుకు ఆయా వయసులకు తగ్గ అవసరాలను బట్టి సౌందర్య ఉత్పత్తులు నేడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.
చర్మానికి రక్షణ, టైట్‌నెస్, కాంతి, నిగారింపు ఇవ్వటంలో ఫేస్‌ప్యాక్‌లు ఎంతో ప్రధానపాత్ర వహిస్తాయి. అనేక పండ్ల నుంచి ధాన్యాల నుంచి కాయగూరల నుంచి వీటిని చేసుకోవచ్చు. పైగా అలాంటి ఫేస్‌ప్యాక్స్ ఎంతో మంచివి, సురక్షితమైనవే కాకుండా ముఖానికి మంచి వన్నెని, చక్కటి కళను తెచ్చిపెడతాయి. చర్మాన్ని సౌందర్యవంతం చేస్తాయి. చర్మవ్యవస్థని బలోపేతం చేస్తాయి. ముఖానికి పోషకాలు సమతుల్యంగా అందిస్తాయి. అయితే ఈ హోమ్‌మేడ్ ఫేస్‌ప్యాక్‌లేమిటి? వేటితో వీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

ఆపిల్‌మాస్క్
ఒక టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని పచ్చసొన, ఒక టేబుల్‌స్పూన్ ఎస్కోర్బిన్ ఆమ్లం, వెనిగర్, రెండు టేబుల్‌స్పూన్ల నూనె వీటన్నింటిని ఒక బౌల్‌లో చేర్చి పూర్తిగా కలిసిపోయే వరకు కలిపి పేస్ట్‌లా చేయండి. ఆ తర్వాత ముఖానికి అప్లయి చేయండి. మెడచుట్టూ రాసుకోండి. ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోండి.

మట్టి మాస్క్
పుల్లర్స్ ఎర్త్ (మట్టి), రెండు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్ , ఒక టేబుల్‌స్పూన్ గ్లిజరిన్, టమోటరసం వీటన్నింటిని బాగా కలపాలి. కావలసినంత వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ముఖానికి పట్టించి బాగా ఆరిపోయాక ఇరవై నిమిషాలు అలానే ఉంచి ఆపై తాజాపాలతో ముఖాన్ని వాష్ చేసుకోండి. చర్మాన్ని మృదువుగా ఉంచటంతో పాటు మంచి టైట్‌నెస్‌ని కూడా ఇస్తుంది. కొత్తగా ఫ్రెష్‌గా ఉంటుంది. మాస్క్‌లన్నింటిలోని అత్యుత్తమ మాస్క్ ఇది.

స్ట్రాబెరీస్
మూడు పెద్ద స్ట్రాబెరీలు. వీటిని బాగా చిదిమి గుజ్జుగుజ్జుగా చేయండి. దాన్ని ఫేస్‌కి మాస్క్‌లా వేసుకోండి. పావుగంట సేపు ఉంచి తర్వాత వాటర్‌తో వాష్‌చేసుకోండి. స్ట్రాబెరీలు కొంత ఆమ్లత్వాన్ని కలిగి ఉండటంతో పాటు విటమిన్ సి కలిగి ఉంటాయి. విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

అవకాడో మాస్క్
అవకాడో లోపల భాగాన్ని గుజ్జుగుజ్జుగా చేయండి. బాగా రసంలా చేసుకున్న తర్వాత ముఖానికి పట్టించండి. ఇరవై నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మళ్లీ కొద్దిపాటి చల్లటినీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మ సూక్షరంధ్రాలు మూసుకుని పోతాయి. తద్వారా ముఖచర్మం ఆరోగ్యవంతంగా, సౌందర్యవంతంగా తయారవుతుంది.

క్విక్ మాస్క్
ఏదైనా రెండు టీస్పూన్ల పిండిని తీసుకోండి. ఒక టేబుల్‌స్పూన్ వేడిపాలు తీసుకోండి. ఆ రెంటిని మిశ్రమం చేయండి. పేస్ట్‌లా చేసుకున్న తర్వాత ముఖానికి మెడకి రాయండి. పావుగంట నుంచి పదినిమిషాల మధ్యలో ముఖం వాష్ చేసుకోండి. చర్మం మృదువుగా బిగుతుగా తయారవుతుంది.

బనానామాస్క్
బాగా పండిన ఒక అరటికాయను గుజ్జుగుజ్జుగా చేయండి. దానిని తగినంత తేనె కలపండి. పేస్ట్‌లా అయిన పదార్థాన్ని ముఖానికి రాయండి. ముఖ చర్మ సౌందర్యం కాంతివంతంగా తయారవుతుంది.

ఆరెంజ్‌మాస్క్
కొంచెం ఆరెంజ్ జ్యూస్‌ని, పాలని తీసుకుని మిశ్రమంగా చేయండి. శుభ్రమైన కాటన్ తీసుకుని జ్యూస్‌ని ముఖానికి పట్టించండి. ఇలా రెగ్యులర్‌గా చెయ్యటం వల్ల ముఖచర్మం మృదువుగా తయారవుతుంది.

టమోటా ప్యాక్
టమోట రసం ఒక అరకప్పు తీసుకోండి. ఒక టీస్పూన్ నిమ్మకాయ రసం తీసుకోండి. ఆ రెంటిని బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మెడకి రాసుకోండి. చల్లటినీటితో పదినిమిషాల తర్వాత అడగండి. కాంతివంతమైన చర్మంగా మారుతుంది.

ద్రాక్ష
రెండు లేదా మూడు ద్రాక్షపళ్లని మధ్యకి కోసి ఒక్కోముక్కని తీసుకుని మెడపై రుద్దుకోండి. తర్వాత చల్లని నీటితో వాష్‌చేసుకోండి. ఎంత మార్పు వస్తుందో మీరే చూసుకోండి.

బొప్పాయి:
బొప్పాయిని బాగా గుజ్జులా చేసి అందులో పెరుగు, రెండు చుక్కల గ్లిజరిన్ కలిపి బాగా మిక్స్ చేసి, ముఖానికి మాస్క్ లా వేసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications