Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఆరెంజ్ తొక్కతో చర్మం సున్నితం, ప్రకాశవంతం
సౌందర్యానికి పండ్లు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయన్న సంగతి మనకు తెలిసిందే. పండ్లలో ముఖ్యంగా ఆరోగ్యానికి మరియు అందానికి బాగా ఉపయోగపడేది ఆరెంజ్. ఆరెంజ్ తొక్క ముఖం మరియు చర్మఛాయను పెంచడంలో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. ఆయిల్ చర్మాన్ని, చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలను, ఇన్ఫ్లమేషన్ ను తొలగిస్తుంది, మొటిమలను నివారిస్తుంది, blemishesను తొలగిస్తుంది. ఇంకా స్కిన్ టోన్ కూడా మీ ముఖం మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను నిల్వ చేయడంతో పాటు ఉపయోగించడం కూడా చాలా సులభం.
అందుకు మీరు చేయాల్సిందల్లా, మీరు తిన్నప్రతి సారి ఆరెంజ్ తొక్కను పడేయకుండా సేవ్ చేయాలి. తర్వాత కొంత పెద్ద మెత్తం అయిన తర్వాత తొక్కను రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అంతే ఫేస్ కు ఉపయోగించడానికి ఆరెంజ్ పౌడర్ రెడీ. ఈ పౌడర్ ను దీర్ఘకాలం ఉపయోగించడానికి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ పౌడర్ తో ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో మంచి ఛాయతో పాటు, కళంకంలేని క్లియర్ స్కిన్ ను మీకు అందిస్తుంది. మరి ఈ సులభమైన ఫేస్ ప్యాక్ తో మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి తప్పనిసరిగా ఆరెంజ్ తొక్కలను ఉపయోగించండి. ఆరెంజ్ పౌడర్ తో ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలో చూద్దాం..

ఆరెంజ్ తొక్క మరియు పెరుగు: ముందుగా ఆరెంజ్ తొక్కను శుభ్రం చేయాలి. ఆరెంజ్ తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి, దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ముఖంలో దుమ్ము, ధూళి తొలగించడానికి ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ సేసుకొన్న ఆరెంజ్ పీల్ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట పాటు అలాగే వదలి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ డెడ్స్ స్కిన్ సెల్స్ ను తొలగించడంతో పాటు ముఖం మీద మురికిని కూడా తొలగిస్తుంది. దాంతో ముఖం తాజాగా మరియు మెరుస్తుంటుంది.
ఆరెంజ్ పీల్ మరియు నిమ్మ: ఆరెంజ్ తొక్కను శుభ్రం చేసి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తో మిక్స్ చేసి, మరొక్కసారి బాగా బ్లెడ్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మం త్వరగా శుభ్రపడుతుంది. మరియు సున్నితంగా మారుతుంది. బేబీ స్కిన్ ను పోలి ఉంటుంది.
ఆరెంజ్ ఫీల్ మరియు పసుపు: ఆరెంజ్ తొక్కను చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి, పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు కూడా వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమానికి కొద్దిగా పసుపు చేర్చి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ప్యాక్ వేసుకొనే ముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్కతో ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖ చర్మం ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. చర్మ ఛాయలో మార్పు వస్తుంది. చర్మం క్లీన్ గా.. క్లియర్ గా కనిపిస్తుంది.
ఆరెంజ్ పీల్ మరియు సాండిల్ ఉడ్: ఎండిన ఆరెంజ్ తొక్కను మిక్సీలో వేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ మరియు సాండిల్ ఉడ్ పౌడర్ రెండూ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొన్న తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి మెడకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ వేసుకొన్న అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ వల్ల ముఖ్యం సున్నితంగా, ప్రకాశవంతమైన ఛాయతో ఉంటుంది. మరియు మొటిమలు మచ్చలు తొలగించి క్లియర్ స్కిన్ ను అంధిస్తుంది.
ఆరెంజ్ తొక్కను ప్యాక్ లా ఉపయోగించి సున్నితమైన చర్మం, ప్రకాశవంతమైన ఛాయ పొందడానికి ఈ కొన్ని పద్దతులను మీరు కూడా ఫాలో అవ్వండి.



Click it and Unblock the Notifications











