Latest Updates
-
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే!
చందనం ఒక అద్భుతమైన సౌందర్యవర్ధకసాధనం..!
సాండిల్ వుడ్ పౌడర్ లేదా చందనంను బ్యూటీ వస్తువుగా చాలా విరివిగా ఉపయోగిస్తుంటారు. చందనం పట్టు వేసుకుంటే చలువ చేసి, తల నొప్పి తగ్గుతుందని మన బామ్మలు వైద్యం చేస్తుండేవారు. ఆరోగ్యానికే కాకుండా, అందానికి సైతం చందనం వాడుకలో ఉంది. పరిమళాలీనే చంద నం, భారతీయుల మనసుల్లో ఒక ప్రముఖస్థానాన్ని ఆక్రమించే ఉంది. పూజల తరువాత నుదుట పెట్టుకు నే తిలకంగానో, వేసవిలో ఎండ వేడిమి తట్టుకునేందుకు లేపనంగానో అందరూ వాడుతున్నాము. చందనం లోని యాంటి సెప్టిక్ గుణాల వల్ల, రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాము. చందనం వేసవిలో సూర్యరశ్మిలోని అల్ట్రా మయొలెట్ కిరణాలు నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తుంది. అందుకని చందనం కలిసిన సన్‌లోషన్స్ వాడుతున్నారు. సౌందర్యసాధనంగా చందనం గురించి తెలుసుకుందాం.
చాలా మంది మంచి అందమైన, ప్రకాశించే చర్మాన్ని కోరుకుంటారో వారు చదనంతో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. సాండిల్ వుడ్ పౌడర్ ను ఉపయోగించి అనేక హోం మేడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సాండిల్ వుడ్ పౌడర్ చాలా వరకూ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించి ప్రధానమైనటువంటి బ్యూటీ వస్తువు. సాండిల్ వుడ్ పౌడర్ ను ఎక్కువగా రోజ్ వాటర్ తో మిక్స్ చేస్తుంటారు. ఈ అద్భుతమైన, ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్ చర్మంలో పూర్తి ఫెయిర్ నెస్ మరియు చర్మ రంగును ప్రకాశవంతంగా మార్చుతుంది. మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గానూ పని చేసేది చందనమే. చర్మంలో నుంచి పోయిన తేమను తిరిగి తీసుకురాగలగిన చక్కని సాధనం. అంతే కాకుండా, చర్మంలోని అదనపు జిడ్డును కూడా చందనం తొలగిస్తుంది. అందుకనే సంపూర్ణమైన స్కిన్ కేర్ ప్రాడక్ట్‌గా చందనాన్ని నేటి వారూ భావిస్తున్నారు.
సాండిల్ వుడ్ పౌడర్ ను ఉపయోగించడంలో మరో మార్గం సాండిల్ వుడ్ పౌడర్ ను ముల్తానీ మట్టి లేదా ఫుల్లర్స్ ఎర్త్ ఉపయోగిస్తారు. సాండిల్ ఉడ్ పౌడర్ బర్నింగ్ స్కిన్ ను చల్లబర్చడమే కాదు, మొటిమలు, చర్మంలో డ్రైనెస్ వంటి వాటిని నిర్మూలిస్తుంది. మీ ముఖం మొటిమలతో చిరాకు పెడుతుంటే మరి మీరు సాండిల్ వుడ్ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడమే..సాండిల్ వుడ్ పౌడర్, కర్పూరం, పసుపు మిశ్రమంతో మొటిమలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు. ఈ మూడింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టిచడం ద్వారా ముఖంలో నల్ల మచ్చలు శాశ్వతంగా తొలగించుకోవడంలో ఇదొక నేచురల్ పద్దతి.
చాలా ప్రభావంతంగా పనిచేసే శాండిల్ వుడ్ పౌడర్ పేస్ ప్యాక్ లు కొన్ని మీకోసం...

రోజ్ వాటర్ తో:
ఇది చందన పౌడర్ తో తయారు చేసే ఒక సాధరణ ఫేస్ ప్యాక్. ఆరోమాటిక్ రోజ్ వాటర్ చందనం పొడిని మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని శుభ్రం చేసి తర్వాత చర్మానికి మంచి రంగును తీసుకొస్తుంది. మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత దీన్ని అప్లై చేయడం వల్ల చర్మంలో పేర్కొన్న మురికి తొలగిపోయి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

ముల్తానీ మట్టి:
అరటీస్పూన్ ముల్తానీ మట్టి, అరటీస్పూన్ సాండిల్ వుడ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి, దీనికి పెరుగు లేదా క్రీమ్ కూడా మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసి 15నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చందనాన్ని ముల్తానీ మట్టి, పన్నీరు కలిపి, పేస్ట్‌లా చేసి, ముఖం, మెడ మీద రాసుకుంటే ఈ లేపనం చర్మాన్ని స్నిగ్ధం చేస్తుంది. చాలా శుష్కంగా వుండే చర్మానికి కూడా చందనం మేలు చేస్తుంది.

బాదాం పౌడర్:
బాదాం మరో బ్యూటీ వస్తువుగా ఉపయోగిస్తారు. ఇది స్కిన్ మరియు హెయిర్ కు చాలా మంచి వస్తువు. ఒక బౌల్ తీసుకొని అందులో బాదం పొడి మరియు సాండిల్ వుడ్ పౌడర్ వేసి, కొద్దిగా పాలు వేసి, బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి.

పసుపు:
ఒక టీ స్పూన్ చందనం, పసుపు, నిమ్మరసం కలిపి చర్మంపై దురద, మంట ఉన్న చోట రాసుకుని, అరగంట తరువాత చల్లటి నీటితో కడిగితే ఆ దురద, మంట ఇట్టే మాయమైపోతాయి.

గుడ్డు మరియు తేనె:
ఇది మరో హోం మేడ్ ఫేస్ ప్యాక్, ఇందులో సాండిల్ వుడ్ పౌడర్ చాలా ప్రధానమైన వస్తువు. ఒక గిన్నెలో గుడ్డు, తేనె మిక్స్ చేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో సాండిల్ వుడ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేయాలి. తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ఇది చర్మం సాగేగుణాన్ని తగ్గిస్తుంది మరియు ముడుతలను నిర్మూలిస్తుంది.

సాండిల్ వుడ్ ఆయిల్ :
సాండిల్ వుడ్ ఆయిల్ ను ముల్తానిమట్టిలో వేసి పేస్ట్ లా తయారు చేసి ముఖం మీద అప్లై చేయడం వల్ల ప్రకాశవంతమైన నేచురల్ స్కిన్ సొంతం అవుతుంది.

కర్పూరం:
సాండిల్ వుడ్ పౌడర్ మొటిమలను సహజంగా నివారిస్తుంది. కాబట్టి ఈ పొడిని కర్పూరంతో మిక్స్ చేసి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దాంతో మొటిమలు లేని ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

పెరుగు:
పెరుగు చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు ఎక్స్ ఫ్లోయిట్ మరియు మెరిసే గుణాన్ని కలిగి ఉంటుంది. సాండిల్ వుడ్ పౌడర్ ఇది సున్నితమైన మరియు ఫెయిర్ నెస్ స్కిన్ ను అంధిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను పెరుగుతో మిక్స్ చేసినప్పుడు సన్ టాన్ ను నేచురల్ గా తగ్గిస్తుంది.

నిమ్మరసం:
చందనం పొడిని నిమ్మరసంతో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడ వల్ల, ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మాన్ని శుభ్రం చేసి, మొటిమలతో పోరాడుతుంది.

టమోటో గుజ్జు:
టమోటోను గుజ్జులా తయారు చేసుకొని అందులో కొద్దిగా సాండిల్ వుడ్ పౌడర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయడం వల్ల ఫెయిర్ నెస్ స్కిన్ పొందవచ్చు.

పాలు:
చందనంలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. మొటిమలు వల్ల మీ చర్మం ఎర్రగా చారలుగా ఏర్పడటం వల్ల పాలు మరియు సాండిల్ వుడ్ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.

లావెండర్ ఆయిల్:
మీ అలసిన చర్మం విశ్రాంతి పొందుటకు, డార్క్ స్పాంట్స్ ను తొలగించడానికి ల్యావెండర్ ఆయిల్ లో సాండిల్ వుడ్ పౌడర్ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇది చర్మాన్ని టైట్ చేయడంతో పాటు మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది.

కీర దోస:
ఎండ వేడిమి నుంచి రక్షణకు...చందనం పేస్ట్‌ను ముఖానికీ, మెడకూ రాసుకుని, ఎండిపోయాక చల్లని నీటితో కడిగేయాలి. ఈ చందనం పేస్ట్ తయారు చేసుకోవటం కూడా సులువే. చందనం కర్రను నీటిలో అరగదీస్తే, పేస్ట్ తయారవుతుంది. దీనిలో తగినంత ఖీరాల రసం లేదా పన్నీరు కలిపి, ఉపయోగించుకోవచ్చు.

ఆలీవ్ ఆయిల్:
ముల్తానీ మట్టి, గుడ్డులోని పసుపు సొన, తేనె, ఆలివ్ నూనె, చందనం పొడి కలిపి, పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి లేపనం చేసుకుని ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తే ఎండకు కమిలిన చర్మానికి చల్లదనం కలిగి, మునుపటి స్థితికి వస్తుంది.

తేనె:
ముఖాన్ని తాజాగా ఉంచేందుకు...1 చెంచా చందనం పొడికి 1 చెంచా తేనె, సగం చెంచా పసుపు చేర్చి, బాగా కలపాలి. ఈ లేపన్నాన్ని ము ఖం, మెడకు రాసుకుని, 20 నిమిషాల తరువాత, చల్లని నీటితో కడిగేయాలి. ఇది ఉత్తమమైన ఫేస్ మాస్క్ లా పని చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాస్క్ కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌స కూడా ఉండవు. అందుకే బ్యూటీపార్లర్ వంటివాటికి వెళ్లి కృత్రీమ రసాయనాలు వాడడం కంటే చందనం వాడడం ఉత్తమం.



Click it and Unblock the Notifications











