Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
కోల్పోయిన మీ చర్మ కాంతిని తిరిగి పొందాలంటే..!?
కాలాన్ని బట్టి చర్మ తత్వ కూడా మారుతుంటుంది. దాంతో పాటు వాతావరణం ప్రభావంతో పాటు, కాలుష్యం, దుమ్ము, ధూళి చర్మాన్ని, శిరోజాలని ఎక్కువగా భాదిస్తుంది. ఈ చర్మం, శిరోజాల ప్రభావం కారణంగా ముఖం పై మొటిమలు, మచ్చలు ఏర్పడుతాయి. వీటితో పాటు చర్మం కాంతిహీనమై నిర్జీవంగా కనిపిస్తుంది. కోల్పోయిన అందాన్ని తిరిగి పొందేందుకు వంట ఇంట్లో ఉపయోగించే వస్తువులే చాలు అంటున్నారు సౌందర్య నిపుణులు.
అందంగా ఉండటానికి ఎన్నో రకరకాల క్రీములను వాడుతూ వుంటారు. మీరు అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు మీ చర్మం ఎలా వుందో గమనించండి. కలర్ ఎలాంటిదైనా మెరుపులీనుతూ ఉన్నదనుకోండి మీది ఆరోగ్యవంతమైన చర్మం లేదంటే డెడ్ స్కిన్ బాగా పేరుగుపోయిందని అర్థం. దీన్ని తొలగించాలంటే ఇంట్లో ఉండే నిమ్మకాయ, పుసుపు, మినపప్పు(సున్ని పిండి)పెసరపప్పు, తదిత వస్తువులను ఉపయోగించి ముఖాన్ని, చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

ముఖం కళకళలాడేందుకు సున్నిపిండి ఫేషియల్(సున్నిపిండి): అందాన్ని కాపాడే ముఖ్యమైన వస్తువు మినపప్పు. నీర్జీవంగా కనిపించే చర్మానికి యవ్వనాన్ని ఇచ్చేదే మినపప్పు. రెండు చెంచాలా మినపప్పు పిండిలో కొద్దిగా నీళ్ళు పోగి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆదేవిధంగా స్నానం చేసేటప్పుడు మినపప్పు(సున్నిపిండిని) చర్మానికి పూసి స్నానం చేస్తే చర్మం అందంగా యవ్వనంగా మెరిసిపోతుంది.

రోజ్ వాటర్-సున్నిపిండి(రోజ్ వాటర్): రెండు చెంచాల సున్నిపిండి పౌడర్ లో నాలుగు చెంచాల పాలు, రెండు చెంచాల రోజో వాటర్ కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది.

సున్నిపిండి-(పసుపు): పూర్వకాలం నుంచి నేటి వరకూ సాంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండూ శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక ప్రాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్ లో చిటికెడు పసుపు, కాస్త నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన అరగంట సేపు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరిచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

మచ్చలు మాయం చేసే సున్నిపిండి(పాలు): చెంచా సున్నిపిండి, పెప్పర్ పౌడర్ చిటికెడు, ముల్తానీ మట్టి పాలుతో మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకొని ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మచ్చలు క్రమంగా మటుమాయం అయిపోతాయి.

జిడ్డు చర్మానికి (పెరుగు-నిమ్మరసం): సున్నిపిండికి పెరుగు కలిపిన చిక్కగా పేస్ట్ లా చేసి ఫేషియల్ వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్రలో మినపప్పు తీసుకొని అందులో మినుపపిండి, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది.

డల్ గా ఉన్న ముఖం కోసం(హెర్బల్): మినపపిండి(సున్నిపిండితో పాటు, తులసి, వేప ఆకుల పొడిని కలిపి, అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేయాలి. పదినిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు ముఖం కళకళలాడుతూ ప్రకాశవంతంగా మారుతుంది.



Click it and Unblock the Notifications