Latest Updates
-
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
కమిలిన చర్మం తిరిగి మేని ఛాయపొందాలంటే సులభ చిట్కాలు
ప్రతీ స్త్రీ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది.అయితే కాలుష్యం,ఎండ మొదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం,తెల్లని మచ్చలు రావడం,గరుకుగా తయారవడం, వంటివి జరగవచ్చు.
చర్మం కమిలిపోవడం (సన్ బర్న్): తీవ్రమైన ఎండలో పనిచేసేవారు ముఖ్యంగా ఈ సమస్యకు లోనవుతుంటారు. తరచుగా సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవ్వడంతో చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. చర్మం పై పొర దెబ్బతిని చర్మంపై వాపు, నొప్పివస్తాయి. చర్మం పొరలుపొరలుగా చీలిపోయి పెద్ద పుండులా ఏర్పడే అవకాశం ఉంది. దీనికి సరైన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.
వేసవిలో ఎండతాకిడి వల్ల చర్మం కమిలిపోవడం, నల్లబడటం ఎక్కువైపోతుంటుంది. స్వేదరంధ్రాలు దెబ్బతింటాయి. దీంతో చర్మం మరింత నల్లగా మారుతుంది. అందుకని బయటకు వెళ్లేముందు సన్‌ప్రొటెక్షన్ క్రీమ్ (ఎస్.పి.ఎఫ్) రాసుకోవాలి. పెరుగు, పుచ్చకాయగుజ్జులతో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటే చల్లగానూ ఉంటుంది. చర్మం నిగారింపు పెరుగుతుంది. ఇలాంటి దుష్ప్రాబావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

యోగర్ట్(పెరుగు): చర్మ నల్లగా ప్రభావితం అయిన ప్రాంతంలో పెరుగును అప్లై చేయాలి. పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

దోసకాయ: కమినిన చర్మానికి కీర దోసకాయ బాగా పనిచేస్తుంది. కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి లేద పేస్ట్ చేసి ఎండవేడికి ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. కీరదోస ముఖం మీద ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టొమాటో: టమోటో స్లైస్ లేదా టమోటో గుజ్జు ను సన్ బర్న్ కు చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఎండ వేడికి కమిలిన చర్మ మీద అప్లై చేసుకోవాలి. టమోటో లోని విత్తనాలతో సహా అప్లై చేయాలి. ఇది ముఖం మీద ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి: బొప్పాయిని స్లైస్ గా కట్ చేసి, ఫ్రిజ్ లోపల పెట్టాలి. చల్లబడిన తర్వాత సన్ బర్న్ కు ప్రభావితం అయితే ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ బర్న్ ఒక్కటి మాత్రమే తొలగిపోవడం కాదు, మొటిమలు, మచ్చలకు విరుద్దంగా పోరాడటానికి సహాయపడుతాయి.

శెనగపిండి: శెనగపిండికి పసుపు మరియు పాలు మీగడ ఒక చెంచా చేర్చి బాగా పేస్ట్ లా తయారు చేయాలి. ఎండవేడికి ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఈ మిశ్రం బాగా ఎండిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి స్ర్కబ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె: తేనెలో కొద్దిగా నిమ్మరసం (80:20) నిష్పత్తిలో నిమ్మ రసంతో తేనె కలపాలి. తర్వాత సన్ బర్న్ కు ఎండవేడికి ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కోకా బట్టర్(కోకా వెన్న): కోకా బట్టర్ ను తక్కువ పరిమాణంలో తీసుకొని ఎండకు ప్రభావితం అయిన ప్రాంతంలో నేరుగా రాసుకోవాలి.

కలబంద(అలోవెర): శరీరంలో సన్ బర్న్ గురిఅయిన ప్రదేశంలో అలోవెర జెల్ ను అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది సన్ బర్న్ ఒక్కటి మాత్రమే తొలగించడం కాదు, సన్ బర్న్ వల్ల కలిగే నొప్పి, దురద వంటి లక్షణాలను తొలగించడానికి సహాయపడుతుంది.

గుడ్డు తెల్లసొన: సన్ బర్న్ కు గురియైన చర్మం మీద నేరుగా గుడ్డులోని తెల్ల సొనను అప్లై చేయాలి. తర్వాత బాగా పొడిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆవాలు: వడదెబ్బ సన్ బర్న్ కు ఆవాలు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆవాలను పొడి చేసి సన్ బర్న్ కు ప్రభావితం అయిన ప్రదేశంలో ఆ పిండిని కొద్దిగా నీళ్ళు లేదా పాలు కలిపి అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీ: స్ట్రాబెరీలను బాగా మెత్తగా చిదిమి గుజ్జులా తయారు చేసుకొని, సన్ బర్న్ కు ప్రభావితం అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఇది ముఖం మీద ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్: ఓట్ మీల్స్ ను గుడ్డులోని తెల్ల సొనతో మిక్స్ చేసి చర్మం కమిలిన ప్రదేశంలో అప్లై చేసి, పొడి బారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు: సన్ బర్న్ కు గురియైన ప్రదేశంలో పాలలో ముంచిన టవల్ ను కప్పి ఉంచడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.

వెనిగర్: వెనిగర్ లో చిన్న తువ్వాళ్లు ను ముంచి లేదా నానబెట్టి సన్ బర్న్ గురియైన ప్రదేశంలో అప్లైచేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

పాలు మరియు తేనె: పాలు మరియ తేనె (50:50) నిష్పత్తిలో తీసుకొని బాగా మిక్స్ చేసి సన్ బర్న కు ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.



Click it and Unblock the Notifications