Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
మెరిసే చర్మానికి విటమిన్ ఇ హోం మేడ్ ఫేస్ ప్యాక్
విటమిన్లు ముఖానికి మరింత అందాన్ని చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.వివిధ రకాలైనటువంటి సోపులకు సంబంధించిన చాలా ప్రకటన్లో మీ చర్మానికి మెరుపు, సొగసు తెచ్చే ఫలానా విటమిన్లు ఉన్నాయి అని ఉంటుంది. అందమె ఆనందం.. ఆరోగ్యమే అందం... ‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ జామ్ ఫరెవర్'' ఇవన్నీ మంచి ఆరోగ్యం వున్నప్పుడే లభిస్తాయి. అందానికి మొదటి పెట్టుబడి ‘ఆరోగ్యం'. ఈసురోమని మనిషి ఉంటే.. బుగ్గల నిగారింపు లెక్కడా? విటమిన్లు చర్మానికి నిజంగా ఎంత మేలు చేస్తాయన్నది సరే.. ఇంతకీ అందం పెరగాలంటే ఏయే విటమిన్లు వాడాలో చూద్దాం.
విటమిన్ ఇ: ఇది పొడిగా, గరుకుగా ఉన్న చర్మాన్ని సున్నితంగా మార్చే క్రమంలో ఉపకరిస్తుంది. విటమిన్ ఇ (ఆల్ ఫా టోకో ఫెరల్) అనే యాంటి ఆక్సిడెంట్ చర్మానికి తేమని సమకూర్చే సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడుతున్నారు. చర్మ సౌందర్య విషయంలో విటమిన్ ఇ అధ్బుతాలు సృష్టిస్తాయని చాలా మంది అంటుంటారు. చర్మాన్ని తేమగా ఉంచి కాంతి వంతంగా ఉంచడంలో మాత్రం ఇది తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

అతివ లకు అందమైన చర్మ సౌందర్యాన్ని అందించడంలో అగ్ర స్థానం విటమిన్ 'ఇ' దే. ఆడవారు ఉపయో గించే అన్ని రకాల సౌందర్య సాధనా ల్లో ఇది ఉపయోగిస్తారు.
మహిళల మేని మెరుగుకు ఈ విటమిన్ ఎంతో అవసరం. ప్రీరాడి కల్స్ ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. లైటనింగ్ రాడ్‌గా పిలవ బడే ఈ విటమిన్ అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పొద్దుతిరుగుడు నూనె, బాదం పప్పులు, పాలకూ,టమోటో, బొప్పా యి, ఆలివ్ నూనె వంటి వాటిలో ఈ విటమిన్ అత్యధికంగా లభిస్తుంది.
మరి ఇన్ని బ్యూటిఫుల్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్న విటమిత్ ‘ఇ'తో ఫేస్ ప్యాక్స్ వేసుకొని అందాన్ని మరింత పెంపొంధించుకోవచ్చో ఒక సారి పరిశీలించండి...
కివి ఫేషియల్ మాస్క్: కివి పండులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు ఇది క్లీనింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. మరియు ముఖంలో పేర్కొన్న అదనపు నూనెను తొలగిస్తుంది. ఒక గుడ్డులోని సొన మరియు ఒక టేబుల్ స్పూన్ కివి జ్యూస్ మరియు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల విటమిన్ ఇ వల్ల మరింత ఎక్స్ ట్రా అందాన్ని పొందవచ్చు.
అరటి రోస్ ఫేషియల్ మాస్క్: అరటిపండులో జింక్, ఐరన్, మెగ్నీషియ, పొటాషియ, విటమిన్ ఎ, బి మరియు ఇ పుష్కలంగా ఉన్నాయి. బనాను రోజ్ వాటర్ తో కలిపినప్పుడు
యాంటీఏజింగ్ ఫేస్ ప్యాక్ గా బాగా పనిచేస్తుంది. అందుకు అరటిపండు గుజ్జుకు, రెండు చెంచాల ఓట్స్ పొడి మరియు రెండు చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానిని అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
మ్యాంగో మాస్క్: మామిడి పండులో విటమిన్ ఇ పుష్కలం. కాబట్టి మ్యాంగో ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకోవడం చాలా మంచిది ఒక చెంచా వీట్ జర్మ్ ఆయిల్, తాజా మ్యాంగో గుజ్జును బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి ఒక సారి వేసుకొని ముడుతలు లేని తాజా చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.
తేనెతో మాస్క్: తేనె ఫేస్ మాస్క్ గా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఇ ఉన్నందును దీన్ని ముఖానికి ఫేస్ మాస్క్ లా వేసుకోవచ్చు. ఒక చెంచా తేనెకు ఒక చెంచా విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని మసాజ్ చేస్తూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్నందిస్తుంది. అద్భుతమైన యవ్వనమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
అవొకాడో ఫేస్ మాస్క్: ముడుతలు లేని చర్మసౌందర్యాన్ని అందించడంలో అవొకాడో అద్భుతంగా పనిచేస్తుంది. అవొకాడోలో విటమిన్ ఎ, ఇ, బి మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి . ఒక చెంచా అవొకాడో గుజ్జుకు రెండు చెంచాల వేడి నీళ్ళు, ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పదినిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి .



Click it and Unblock the Notifications
