Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
మీకు సరిపోయే బెస్ట్ ఫేస్ వాష్ ఏదో తెలుసుకోండి...?
ప్రతి రోజూ ఇటు స్త్రీలకు, అటు పురుషులకు ఇద్దరూ ఫేస్ వాష్ ను ఉపయోగిస్తున్నారు. ఇంతక ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి వివిధ రాకల సోపులను వినియోగించేవారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది తమ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం, చర్మ రక్షణ కోసం సోపులకు బదులు ఫేస్ వాష్ లను ఉపయోగిస్తున్నారు. ఇవి చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా తాజాగా ఉండటం వల్లే వీటి వాడకం ఎక్కువైంది. శరీరం మీద ఉన్న చర్మంతో పోల్చితే ముఖ చర్మ చాలా పలుచగా సున్నితంగా ఉంటుంది. కాబట్టి సున్నిత చర్మానికి కఠినమైన సోపులు, పేస్ స్ర్కబ్ లు వేసి రుద్దకుండా చర్మ సంరక్షణలో ఫేస్ వాష్ ఉపయోగించాలి. అయితే ఎటువంటి చర్మానికి ఏయే ఫేస్ వాష్ లను ఉపయోగించాలి? ఏ ఫేషియల్ ఐతే బెస్ట్? చాలా మంది హన్ చెస్ ఆధారంగా ఫేషియల్ క్లెన్సర్ ను కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది టీవీలో ప్రసారం అయ్యే కమర్షియల్ ప్రకటనలకు ఆకర్షింపబడి, వాటిని కొనడానికి ఎక్కువ ఇష్టపడుతారు. అది వారికి నచ్చిన కలరో లేదా మంచి సువానో కలిగి ఉండటే కారణం.
అయితే, ఇలా యాడ్స్ చూసి కొనేముందు ఆ ఫేస్ వాష్ లు వారి చర్మతత్వానికి సరిపోతాయో లేదో తెలుసుకొని కొనడం మంచిది. మీ చర్మాన్నికి సరిపోయే ఫేషియల్ క్లెన్సర్ ను తప్పనిసరిగా వాడాలి. లేదంటే అవి ముఖానికి హాని కలిగిస్తాయి. అందుకోసం కొన్ని సాధరణ చర్మం కలిగిన వారందరికోసం వారి చర్మతత్వానికి సరిపడే కొన్ని ఫేస్ వాష్ లు....

మెటిమలు మచ్చలు ఉన్న చర్మతత్వానికి: ముఖం మీద మొటిమల వల్ల మచ్చలు, మొటిమల తాలూకు రంద్రాలు ఏర్పడి ఉన్నట్లైతే మీకు కచ్చితంగా మెడికేటెడ్ ఫేస్ వాష్ అవసరం. ఈ మెడికేటెడ్ ఫేషియల్ క్లెన్సర్ లో కొన్ని రకాల రసాయనాలు..జింక్, సల్ఫర్ కలిగి ఉంటాయి. ఇవి మొటిమల ద్వార ఏర్పడ్డ మచ్చలను, రంద్రాలను నయం చేస్తుంది. చర్మ మీద మొటిమలు ఉన్నా కూడా ఈ యాంటీ సెప్టిక్ ఫేస్ వాష్ వాటిని నయం చేస్తుంది.
జిడ్డు(ఆయిల్)చర్మం: చాలా మందికి సాధారణ చర్మం ఉంటుంది. అదే విధంగా కొంత మంది జిడ్డు చర్మ ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ చాలా అవసరం. చాలా మంది ఈ ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ తో చర్మం పొడిబారుతుందని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. ఎందుకంటే అన్ని సాధారణ సబ్బుల్లోనూ కొంత మొత్తంలో ఆయిల్ మిక్స్ చేయబడి ఉంటుంది. ఆయిల్ చర్మం ఉన్నవారు ఒక వేళ సాధారణ ఫేషియల్ క్లెన్సర్ ను ఉపయోగించినట్లైతే మీ ముఖాన్ని ఫ్రైయింగ్ పాన్ లాగా మార్చేస్తుంది . కాబట్టి ఆయిల్ చర్మ తత్వం ఉన్న వారు ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించి ముఖ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖంలోని జిడ్డును, దాని వల్ల ఏర్పడే మచ్చలను పూర్తిగా నివారిస్తుంది.
పొడి చర్మం: మీరు పొడి చర్మ తత్వకలవారైతే, మీకు ఒక మాయిశ్చరైజింగ్ ఫేషియల్ క్లెన్సర్ అవసరం అవుతుంది. సోపులు మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. కాబట్టి మీ ఫేస్ వాష్ కోసం హైడ్రేటింగ్ ఎలిమెంట్స్ అంటే పాలు, పీచెస్ మరియు నేచురల్ ఆయిల్ తో తయారు చేసినవి ఎంపిక చేసుకోవాలి.
బ్లాక్ హెడ్స్: మీకు కనుక బ్లాక్ హెడ్స్ ఉన్నట్లైతే, ముఖ్యంగా ముక్క, బుగ్గల మీద బ్లాక్ హెడ్స్ చాలా ఉంటే, మీకు ఫేస్ వాష్ కాదు, ఫేషియల్ స్ర్కబ్ అవసరం అవుతుంది. ప్రస్తుత రోజుల్లో ఫేషియల్ స్ర్కబ్ మరియు క్లెన్సర్ రెండూ కలిపి ఫేస్ వాష్ ను తయారు చేస్తున్నారు. కాబట్టి వీటిని ఉపయోగించడం వల్ల బ్లాక్ హెడ్స్ తో పాటు డెడ్ స్కిన్ తొలగిపోతుంది.
టాన్డ్ స్కిన్: ఎండ, వేడిమి వల్ల చర్మం కమిలి ఉండే చర్మానికి వైటనింగ్ ఫేషియల్ క్లెన్సర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖాన్ని తెల్లగా మార్చుతుంది వీటిలో నేచురల్ బ్లీచింగ్ అంశాలు పసుపు, మరియు నిమ్మ వంటివి ఉంటాయి.
అలెర్జీ చర్మం: మీ చర్మం చాలా సున్నతంగా, తరచూ అలెర్జీ మరియు ఇన్ఫెక్షన్ కు గురిఅవుతుంటే మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అటువంటి వారు మిల్క్ ఫేసియల్ క్లెన్సర్ ఎంపిక చాలా మంచిది. ఇందులో కూడా నిమ్మ, పసుపు వంటి అంశాలు అధికంగా ఉంటాయి.
ఇన్ని రకాల ఫేస్ వాష్ ఉన్నాయి. కాబట్టి మీ చర్మ తత్వాన్ని బట్టి మీరు ఎంపిక చేసుకొని అందంగా మెరిసిపోండి...



Click it and Unblock the Notifications