Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
మేని మెరుపుకు పసుపు దివ్వౌ ఔషదం
సౌందర్య సాధణాలలో పసుపుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆప్రధాన్యత ఇప్పుడు వచ్చింది కాదు. పురాతన కాలం నుండి పసుపును అందం, ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వాడుతున్నారు.
భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన భారతీయ సాంప్రదాయంలో పూజలు, వ్రతాలు లాంటి శుభ కార్యాల్లో పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంది. పండుగలు, పెళ్ళిళ్ళ లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లుపెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటారు.
పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ఫాస్ఫరస్ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకుతోడ్పడే యాంటీ బయోటిక్, కాన్సర్ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్ నిరోధించేవి, ట్యూమర్ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న వందలాదిపరమాణువులున్నాయి. పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది.సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యంఇనుమడిస్తుంది. పసుపును బహిర్గతంగా నేరుగా అప్లై చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

మొటిమల నివారణకు:
ఈ సమస్య మరీ చిన్నగా ఉండి చీము లేకపోతే...రెండు చెంచాల ముల్తానీ మట్టిలో పావుచెంచా పసుపు, అరచెంచా తేనె, కొద్దిగా రోజ్‌వాటర్ కలపాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ పూతను వేసుకుంటే...ఎంతో ప్రయోజనం ఉంటుంది.

కళ్లనలుపు తగ్గేలా:
మీగడలో చిటికెడు పసుపు వేసుకుని కళ్లచుట్టూ మర్దన చేసుకోవాలి. రెండు నిమి షాలయ్యాక తుడిచేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే...కళ్లచుట్టూ ఉండే నలుపు తగ్గి, అక్కడి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

చేతులు మెరిసేలా:
అదేపనిగా ఎండలో తిరగడం వల్ల కొందరి చేతులు నల్లగా మారిపోతాయి. అలాంటప్పుడు రెండు చెంచాల కాచిన పాలల్లో చెంచా ఓట్స్‌పొడి కలపాలి. ఐదునిమిషాలయ్యాక చిటికెడు పసుపు చేర్చి చేతులకు పూతలా వేసుకుని మర్దన చేయాలి. పొడిబారిన చర్మ సమస్య తగ్గడమే కాదు చేతులూ తెల్లగా మారతాయి. ఈ పూతను రోజూ వేసుకోవచ్చు. వేళ్లకణుపుల్లో ఉన్న నలుపు కూడా తగ్గుతుంది. కొద్దిగా నూనెలో పసుపు వేసి గోళ్లచుట్టూ మర్దన చేసుకుంటే ఇన్‌ఫెక్షన్ సమస్య దరిచేరదు. గోళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.

చర్మం తాజాగా:
వర్షంలో తడిస్తే కొందరికి దద్దుర్లు వస్తుంటాయి. వాటి నుంచి సాంత్వన పొందాలంటే బజార్లో లభించే కలబంద గుజ్జును రెండు చెంచాలు తీసుకుని అరచెంచా పసుపు, పావుచెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదినిమిషాలయ్యాక మర్దన చేస్తూ తీసేయాలి. చర్మం నల్లబడుతుంది. దద్దుర్లూ తగ్గుతాయి.

మెడ మృదువుగా:
పెసరపిండి, శనగపిండి, మీగడ, బియ్యప్పిండి, పసుపు పావుచెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ కలపి మెడ భాగానికి రాసుకోవాలి. పదినిమిషాల తరువాత పాలతో అద్ది తుడిచేసుకుని కడిగేయాలి. మెడ భాగంలో పేరుకొన్న నలుపు తగ్గుతుంది. మృదువుగానూ ఉంటుంది.



Click it and Unblock the Notifications