For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో కాంతివంతమైన చర్మంకోసం ఉత్తమ మార్గాలు

|

వేసవి సీజన్ లో వాతావరంలో కలిగే భౌతిక, రసాయనిక మార్పులకు తక్షణం ప్రభావం చూపేది చర్మంపైనే. అధిక ఉష్ణోగ్రత వల్ల చర్మం ముడుతలు పడటం, నల్లగా అవటం, జీవం కోల్పోవటం, జిడ్డు కారడం, పొక్కులు, దద్దుర్లు రావడం వంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇవేగాక సూర్యరశ్మిలోని ఆల్ట్రావైలెట్‌ కిరణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. దాంతో మలినాలన్నీ చెమట రూపంలో వెలువడే ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుంది. అందుకు చర్మాన్ని ఆరోగ్యవంతంగా, సౌందర్యవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వేసవిలో చర్మంపై అత్యంత శ్రద్ధ చూపించాలి.

చర్మం మన శరీరమును కప్పి ఒక నిర్ధిష్టమైన రూపాన్ని ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమబద్దీకరిస్తుంది. అంటువంటి చర్మాన్ని రక్షించుకోవడా వేసవిలో కాంతివంతంగా ఉంచుకోవడం అంత పెద్ద కష్టమైన పనికాదు. మీరు కొద్దిగా సమయం మరియు శ్రద్ద చూపితే వేసవిలో కూడా అది సాధ్యం అవుతుంది. అందుకు నమ్మకం మరియు వ్యక్తిగత భాద్యత కలిగి ఉంటే ప్రకాశించే చర్మంను తప్పకుండా పొందగలుగుతారు. యవ్వనంగా మరియు హెల్తీగా కనబడుతారు.

వేసవి వచ్చేస్తుందనగానే చర్మ సంరక్షణ ముందుగా ప్లాన్ చేసుకోవాలి. మరియు ప్లాన్ చేసుకోవడంతో పాటు వాటిని అనుసరించి ఆచరణలో పెట్టాలి . ఒక్కో వ్యక్తికి ఒక్కో విధమైన స్కిన్ స్ట్రక్చర్ ఉంటుంది. చర్మ తత్వాన్ని బట్టి చర్మానికి రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మరింత ఎక్కువ రక్షణ మరియు శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు మీకు సులభంగా అనిపించి కొన్ని ఎఫెక్టివ్ పద్దతులను ఈక్రింది విధంగా ఇవ్వబడుతోంది..

చర్మసంరక్షణను రొటీన్ చేసుకోవాలి

చర్మసంరక్షణను రొటీన్ చేసుకోవాలి

మొటిమలు, మచ్చలు, సన్ టాన్ లేదా పిగ్నెంటేషన్ వచ్చినప్పుడు మాత్రమే స్కిన్ కేర్ పద్దతులు పాటించాలని లేది. అన్ని సమయాల్లోను, అన్ని సీజన్ లోని చర్మ సంరక్షణ పద్దతులను అనుసరించడం చాలా మంచిది. చర్మ సంరక్షణ అనేది మీ డైలీ, రొటీన్ లో ఒక భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యం.

చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి

చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి

మీ చర్మం ఎప్పుడు కాంతివంతంగా మెరిసేలా ఉండాలంటే, అందుకు మీ చర్మం తేమకలిగి ఉండాలి. అలా ఉండాలంటే తగినన్ని నీళ్ళు త్రాగాలి. ఇది అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ ను నివారిస్తుంది. ప్రతి రోజూ 8గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా త్రాగాలని గుర్తుంచుకోవాలి. ఇది మీ చర్మం మాయిశ్చరైజర్ గా ఉంచడానికి సహాయపడుతుంది.

సమ్మర్ ఫ్రెండ్లీ డైట్

సమ్మర్ ఫ్రెండ్లీ డైట్

వేసవికాలంలో మీరు తీసుకొనే ఆహారం కూడా మీ ఆరోగ్యాన్నిమరియు అందాన్ని తెలుపుతుంది. కాబట్టి, పూర్తిపోషకాలతో పాటు వాటర్ కంటెంట్ అధికంగా ఉండే సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. పచ్చిగా తీసుకోవడానికి బదులు, మీరు తాజా జ్యూసులను ఎంపిక చేసుకోండి.

ఎక్స్ ఫ్లోయేట్

ఎక్స్ ఫ్లోయేట్

ఎక్స్ ఫ్లోయేట్ ఒక ఫర్ ఫెక్ట్ స్కిన్ కేర్ ఎంపిక. డెడ్ స్కిన్ తొలగించడం ఒక ఉత్తమ మార్గం. సమ్మర్ స్కిన్ కేర్ లో భాగంగా ఎక్స్ ఫ్లోయేట్ క్రీమ్స్ ను ఉపయోగించడం వల్ల చర్మంలోని మలినాలను మరియు అదనపు ఆయిల్స్ ను తొలగిస్తుంది.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ డ్రైస్కిన్ సమస్య ఒక సాధారణ కంప్లైయింట్. ముఖ్యంగా వేసవిలో కూడా ఈ సమస్య చాలా మందిని బాధిస్తుంటుంది. కాబట్టి, ఏసీజన్ లో అయినా సరే చర్మాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దాంతో చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ మీ శరీరారికి అప్లై చేయడం వల్ల మీ చర్మం ఆరోజంతా తడిగా ఉంటుంది.

సన్ స్క్రీన్ లోషన్

సన్ స్క్రీన్ లోషన్

వేసవి కాలంలో సన్ టాన్ నివారించడానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి. కాబట్టి, వేసవిలో బయటకు వెళ్ళడానికి ముందుగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. బయటకు వెళ్ళడానికి 2గంటల ముందు సన్ స్ర్కీన్ లోషన్ అప్లై చేయాలి. అలాగే ప్రతి రెండుగంటలకొకసారి అప్లై చేయవచ్చు.

ఆలస్యం చేయకుండా చికిత్సనందివ్వండి

ఆలస్యం చేయకుండా చికిత్సనందివ్వండి

మీరు ఎంతగా ప్రయత్నించారన్నది విషయం కాదు, చర్మ సంరక్షణ ఎంత వరకూ తీసుకొన్నారన్నది విషయం కాదు, సమ్మర్ పూర్తి అయ్యే వరకూ చర్మ సమస్యలు ఏర్పడే అవకాశాలుంటాయి. ఒక మెరిసేటి ప్రకాశవంతమైన చర్మంను మెయింటైన్ చేయండానికి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

English summary

Best Ways To Maintain Glowing Skin In Summer

Summer is the most exciting of all seasons making your outdoor experiences bright and colourful. But, in many cases, we are forced to stay indoors only because of the fear of summer skin problems. Excess sweat, clogged pores, sun tan, dry and rough skin and what not!
Story first published: Friday, May 2, 2014, 15:12 [IST]
Desktop Bottom Promotion