For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నార్మల్ చర్మ తత్వానికి నేచురల్ ఫేష్ వాష్

|

సాధారణంగా, నార్మల్ గా ఉండే ముఖంను రెగ్యులర్ గా రొటీన్ గా శుభ్రం చేస్తుండాలి . ముఖ్యంగా ప్రతి రోజూ నిద్రలేవగానే ఒక మంచి క్లెన్సర్ తో ముఖంను శుభ్రం చేసుకోవాలి. చాలా మంది ఉదయం నిద్రలేవగానే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటారు.

కానీ మరికొంత మంది మార్కెట్లో లభించే ఫేస్ క్లెన్సర్ ను ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకుంటారు. అయితే, ఒక్కోక్కరిది ఒక్కో చర్మ తత్వం కలిగి ఉంటారు అలాగే ఫేస్ క్లెన్సర్స్ కూడా వివిధ రకాల క్లెన్సర్ కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చర్మ తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

అయితే మార్కెట్లో లభించే కొన్ని క్లెన్సర్స్ దాదాపు ఆయిల్ స్కిన్ చర్మ తత్వం కలగిన వారికి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అలాగే నార్మల్ స్కిన్ టైప్ కూడా కొన్నిక్లెన్సర్లు కూడా అందుబాటులో ఉంటాయి కానీ, ఇవి డ్రైస్కిన్ కు అప్లై చేసేవిగా ఉంటాయి.అయితే వీటిలో కొన్ని నార్మల్ స్కిన్ కు అంత ఎఫెక్టివ్ గా పనిచేయవు. లేదా మీచర్మంలో ఎటువంటి మార్పు కనిపించకపోవచ్చు. కాబట్టి, మీ చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా కనపించాలంటే కొన్ని నేచురల్ ఫేస్ వాష్ లను ఉపయోగించాలి. నార్మల్ స్కిన్ కు ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ ఈ క్రింది విధంగా

పెరుగుతో ఫేస్ వాష్

పెరుగుతో ఫేస్ వాష్

మీరు నార్మల్ స్కిన్ కలిగి ఉన్నవారు పెరుగు ఒక మంచి ఎంపిక. పెరుగును ముఖం మీద అప్లై చేసి కొద్ది సమయం 15-20నిముషాలు అలాగే వదిలి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ చర్మం నార్మల్ గా స్మూత్ గా మరియు క్లియర్ గా అనిపిస్తుంది.

పెరుగు మరియు తేనె

పెరుగు మరియు తేనె

పెరుగు మరియు తేనె రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేసి 15-20నిముషాలు అలాగే వదిలి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు ఒక అందమైన మరియు కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని పొందగలరు.

గుడ్డు మరియు తేనె

గుడ్డు మరియు తేనె

నార్మల్ స్కిన్ కు బ్యూటిఫుల్ ఫేషియల్ క్లెన్సర్ . ఇది నేచురల్ గా మీ చర్మాన్ని యవ్వనంగా మరియు అందంగా మార్చుతుంది. ముందుగా ఒక బౌల్లో గుడ్డులోని పచ్చసొన తీసుకొని బాగా బ్లెడ్ చేసి తర్వాత అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి. తర్వాత దీనికి బాదం పేస్ట్ కూడా చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత 10-15నిముషాల తర్వాత బాగా మర్దన చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ మరియు క్రీమ్

ఆపిల్ మరియు క్రీమ్

ఒక స్పెషల్ ఫేషియల్ క్లెన్సర్ ఇది. కొద్దిగా ఇపిల్ ముక్కలు తీసుకిని వాటిని మెత్తగా ఉడికించాలి. తర్వాత వాటిని మ్యాషర్ తో మెత్తగా మ్యాష్ చేయాలి. ఇప్పుడు ఈ మ్యాష్ చేసిన ఆపిల్ గుజ్జుకు కొద్ది నిమ్మరసం, ఒక చెంచా క్రీమ్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. మెత్తగా పేస్ట్ చేసుకొన్నాక ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

క్లే

క్లే

మట్టని ఉపయోగించి ఫేస్ వాష్ చేసుకోవడం ఒక నేచురల్ క్లెన్సర్ ఒక మంచి ఉపాయం. క్లే(మంటి) మురికిని వదిలిస్తుంది. ఒక బౌల్ వాటర్ ముల్తానీ మట్టిని వేసీ చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి . తర్వాత దానికి ఆస్పిరిన్ మాత్ర పొడిచేసి, ఆపొడిని అందులో మిక్స్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా లోతుగా క్లెన్సింగ్ అవుతుంది. తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే చర్మం నేచురల్ గా కాంతివంతంగా యవ్వనంగా మారుతుంది.

English summary

Natural Facewash For Normal Skin

Face cleansing is a normal and natural routine. The first thing you do in the morning is cleanse your skin using the most appropriate cleansers. For most women the morning routine consists of washing their face with cold water. It is only after the water routine is done that they begin other morning rituals.
Story first published: Saturday, May 3, 2014, 14:59 [IST]
Desktop Bottom Promotion