Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫేస్ మాస్క్ వేసుకొనే ముందు తెలుసుకోవల్సిన విషయాలు
ముఖారవిందాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మహిళలు నేడు బ్యూటీ పార్లర్లను చుట్టూ తిరుగుతున్నారు. తళుకులీనే అందమైన ముఖవర్ఛస్సుతో అందర్నీ మైమర పించాలని యువతులు కోరుకుంటారు. కానీ యువతుల లేలేత అందమైన చర్మం బయట ఎండ, దుమ్ము, ధూళి, కాలుష్యం మూలంగా దెబ్బతింటుంది. వీటి నుంచి కాపాడి ముఖాన్ని మరింత అందంగా ఉండేందుకు పలు రకాల ఫేస్ మాస్క్‌ల గురించి బ్యూటీషియన్లు వివరిస్తున్నారు.
స్కిన్ చార్మ్‌ను మెయింటెయిన్ చేసేందుకు బ్యూటీషియన్లు యువతులు, మహిళలకు పలు సూచన లిస్తున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం చర్మంపై ఎంతగానో ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. సహజసిద్ధమైనటువంటి ప్రకృతి ఫలాలతో తయారుచేసిన మేకప్ కిట్‌తో ముఖాన్ని మరింతగా సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు. పండ్లు, పచ్చటి కూరగాయలు, వివిధ రకాల నట్స్ వంటి న్యూట్రీషియస్ ఫుడ్‌తో చర్మం మరింత ఆకర్షణీ యంగా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. కాకపోతే మామూలుగా కన్నా ఎక్కువగా మంచినీళ్లు తీసుకోవడం కూడా ముఖ్యమే. దీంతో చర్మం సాఫ్ట్‌గా తళుకులీనుతూ ఉంటుంది.

ఎండ, కాలుష్యం, దుమ్ము, ధూళి నుంచి రక్షణకు బయటకు వెళ్లేటప్పుడు 10,15 నిమిషాల ముందు మాయిశ్చరెైజర్‌ను రాసుకోవాలని బ్యూటీషియన్లు చెబుతున్నారు. దీంతో మాయిశ్చరెైజర్ చర్మంలోకి ఇంకి బయట వాతావరణం నుంచి కాపాడుతుందని తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా ఎండ నుంచి రక్షణకు సన్‌స్క్రీన్‌లను మాయిశ్చరెైజర్‌లపెై రాయాలని దీంతో సూర్యుని అల్ట్రావయోలెట్ కిరణాల వల్ల కలిగే హానిని నివారించవచ్చని చెబుతున్నారు.
వివిధ రకాల ఫేస్ మాస్క్‌లు...
వివిధ రకాల చర్మం కలిగిన వారు ఆయా రకాల ఫేస్ మాస్క్‌లతో అందంగా ఉండవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎగ్‌తో తయారెైన వెైట్ మాస్క్‌ను ముఖంపెై ఏర్పరచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. దీంతో చర్మం మరింత ప్రకాశవం తంగా తయారెై యువతులు అందంగా కనబడతారన్నారు. ముఖంపెై ఉన్న ముడతలు కూడా పోతాయని చెబు తున్నారు. 20 నిమిషాల పాటు ఎగ్‌వెైట్ మాస్క్‌ను ముఖంపెై ఉండనిచ్చిన అనంతరం నీటితో కడుక్కోవాలని చెబుతున్నారు. ఇక డ్రై స్కిన్ ఉన్నవారికి ఓట్‌మీల్ మాస్క్ మేలని బ్యూటీషియన్లు అంటున్నారు. ఓట్‌మీల్, గుడ్డు సొన, తేనేతో తయారయ్యే మిశ్రమంతో ఈ మాస్క్‌ను ఏర్పరచుకోవాలని చెబుతున్నారు.
15 నిమిషాల పాటు ఈ మాస్క్‌ను ముఖంపెై ఉండనిచ్చిన తర్వాత నీటితో కడుక్కోవాలని అంటున్నారు.దీంతో చర్మం మృదువుగా, ఫ్రెష్‌గా ఉంటుందని చెబుతున్నారు. నార్మల్ స్కిన్ ఉన్న యువతు లకు బనానా మాస్క్ సరిపోతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. సగం అరటిపండు గుజ్జుతో పాలమీగడను కలిపితే తయారయ్యే ఈ మాస్క్‌ను ముఖంపెై 30 నిమిషాల పాటు ఉండ నిచ్చి నీటితో ము ఖం కడుక్కోవాలంటు న్నారు. ఈ మాస్క్ చర్మాన్ని మాశ్చరెైజ్‌చేసి మరింత ఆకర్షణీయం గా కనిపిం చేటట్టు చేస్తుందని బ్యూ టీషియన్లు వివరిస్తున్నారు.



Click it and Unblock the Notifications