Latest Updates
-
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా.. -
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం! -
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు! -
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక -
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే..
బ్లాక్ హెడ్స్ తో టీనేజ్ మూడ్ ఆఫ్: చిట్కాలు
బ్లాక్ హెడ్స్ తో టీనేజ్ మూడ్ ఆఫ్: చిట్కాలు
ముఖం మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు..ఇవంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా హాడలే. ఇది ముఖాలను అందవిహీనంగా చేయటమే కాదు..కొన్ని సార్లు మానసికంగా కూడా క్రుంగదీస్తాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అంటుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఈ బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో పెద్ద కష్టమైన పనేమి కాదు.
బ్లాక్ హెడ్స్ అంటే? మన చర్మం క్రింద సెబాసియస్ గ్లాండ్స్ ఉంటాయి. యుక్త వయస్సులో ఈ గ్లాండ్స్ చురుకుగా పనిచేస్తాయి. సెబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల చర్మం పై ఎర్రగా లేదా నల్లగా ఉండే పింపుల్స్ ఏర్పడతాయి. నల్లగా ఉండే పింపుల్స్ ను బ్లాక్ హెడ్స్ అంటారు. ఇవి మామూలు పింపుల్స్ కన్నా పెద్దగా ఉంటాయి.
ముఖంలో బ్లాక్ హెడ్స్ తొలగించే ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్: క్లిక్ చేయండి
కారణాలేమిటి?
మన చర్మానికి అవసరమైన పోషక పదార్తాలను అందచేసే క్రమంలో రక్తం నుంచి అదనంగా ఉండే నూనె పదార్థాలు, సెబమ్ మరికొన్ని రసాయన పదార్థాలు వెలువడతాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. బటయ ఉండే దుమ్ము, ధూళి కూడా ఇవి ఏర్పడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది.
ముఖాన్ని అందవిహీనంగా మార్చిన బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడం ఇలా:క్లిక్ చేయండి

ఫేష్ వాష్:
ఫేష్ వాష్: బ్లాక్ హెడ్స్ ఉన్న వారు సలిసిలిక్ యాసిడ్ ఉన్న పేస్ వాష్ తో క్రమం తప్పకుండా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

పెరాక్సైడ్ క్రీములు:
పెరాక్సైడ్ క్రీములు: నిపుణుల సలహా మేరకు బెంజోయిల్ పెరాక్సైడ్ తో కూడిన క్రీములు వాడినా ఫలితం ఉంటుంది.

సీసాల్ట్ :
సీసాల్ట్ : ప్రతి వారం సీసాల్ట్ తో కూడిన స్ర్కబ్ తో ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్ :
ఓట్ మీల్ : ఓట్ మీల్ తో చర్మం శుభ్రం చేసుకొన్నా డెడ్ స్కిన్ సెల్స్ తొలగి పోతాయి.

ముల్లంగి విత్తనాలను
ముల్లంగి విత్తనాలను నీటిలో వేసి పేస్ట్ లా చేసి దానికి బ్లాక్ హెడ్స్ పై పట్టించాలి. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రపరచాలి. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

బాదం:
బాదం: బాదంపొడి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్ సబ్బు కూడా బ్లాక్ హెడ్స్ నివారణకు బాగా పనిచేస్తాయి.

సూచన:
సూచన: బ్లాక్ హెడ్స్ త్వరగా తొలగించుకోవాలనే ఆత్రంతో వాటిని తరచూ రుద్దడం, గిల్లడం ద్వారా తొలగించే ప్రయత్నం కూడా చేయకండి. ఈ ప్రయత్నాల వల్ల బ్లాక్ హెడ్స్ పై ఉన్న రంధ్రాలు మరింత పెద్దవి అవుతాయి. బ్లాక్ హెడ్స్ సంఖ్య కూడా బాగా పెగరుతుంది.



Click it and Unblock the Notifications
