For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో జ్యూస్ తో అందాన్ని రెట్టింపు చేసుకోండి

|

శీతాకాలంలో, చర్మం పొడిగా మారడం సహం, ఈ పొడి చర్మం నివారించుకోవడానికి మాయిశ్చరైజర్ లేదా నూనె వంటి ముఖానికి అప్లై చేస్తుంటా, ఇది చాలా ఆయిల్ గా లేదా జిడ్డుగా మారుతుంది. చాలా మంది నేచురల్ గానే ఆయిల్ స్కిన్ కలిగి ఉంటారు. అటువంటి వారు, ఇటువంటి ఆయిల్ ప్రొడక్ట్స్ అప్లై చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే మరింత వరస్ట్ గా మార్చుతుంది. అందువల్ల ఆయిల్ స్కిన్ నేచురల్ గా తగ్గించుకోవడానికి, కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించాలి.

ఆయిల్ స్కిన్ నివారించడానికి చాలా నేచురల్ పదార్థాలున్నాయి. ఉదాహరణకు టమోటో ఒక ఉత్తమ నేచురల్ పదార్థం. ఇది మనం విరివిగా ఉపయోగించే ఒక వంటగది వస్తువు. వంటకు ఉపయోగించడం మాత్రమే కాకుండా, టమోటోలో బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అనేక హోం మేడ్ ఫేస్ ప్యాక్ కోసం, టమోటోలను ఉపయోగిస్తుంటారు.

టమోటో ఒక నేచురల్ ఆస్ట్రిజెంట్, ఇది చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా టమోటోల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ చర్మం యవ్వనంగా మరియు దీర్ఘకాలం ఫ్రెష్ గా ఉండేందుకు సహాయపడుతుంది. టమోటోలను పేస్ట్ లా తయారుచేసి, నేరుగా చర్మానికి అప్లై చేయవయచ్చు. ఇది టమోటోలు మాత్రమే కాదు, టమోటో జ్యూస్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. పెద్దగా ఉన్న చర్మ రంధ్రాలను కూడా నివారించడానికి టమోటో జ్యూస్ ను అప్లై చేయవచ్చు. ఇది మొటిమలను మరియు డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా, ఆయిల్ స్కిన్ నివారించడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

చర్మంలో ఉన్న పెద్ద రంధ్రాలు కుచించుకొనేలా చేస్తుంది:

చర్మంలో ఉన్న పెద్ద రంధ్రాలు కుచించుకొనేలా చేస్తుంది:

చర్మం రంధ్రాలు పెద్దగా ఉన్నప్పుడు, త్వరగా ప్రభావం చూపడానికి ఇది ఒక వరస్ట్ ప్రదేశం. అందుకు టమోటో జ్యూస్ చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలను తగ్గిస్తుంది. టమోటో జ్యూస్ కు కొద్దిగి నిమ్మరసం చేర్చి, అందులో కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం మొత్తం అప్లై చేయాలి.

మొటిమలను తగ్గిస్తుంది:

మొటిమలను తగ్గిస్తుంది:

ఇది ఒక సాధారణ చర్మ సమస్య . టమోటో జ్యూస్ అప్లై చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. టమోటోలో ఉన్న నేచురల్ యాసిడ్స్ మరియు విటమిన్స్ మొటిమలను నేచురల్ గా తగ్గిస్తుంది. టమోటోలోని రసాన్ని తీసి, నేరుగా ముఖానికి అప్లై చేయాలి . అరగంట పాటు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

జిడ్డు చర్మం చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి, టమోటో జ్యూస్ తో ముఖం మీద మసాజ్ చేయాలి. టమోటో జ్యూస్ కు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. అప్లై చేసిన తర్వాత 15-20నిముషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

సమ్మర్ బర్న్ తగ్గిస్తుంది:

సమ్మర్ బర్న్ తగ్గిస్తుంది:

సమ్మర్ బర్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. టమోటో జ్యూస్ లో కూలిగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది సమ్మర్ బర్న్స్ ను నివారించడానికి ఇది ఒక ఫర్ ఫెక్ట్ పదార్థం.

సన్ టాన్ తగ్గిస్తుంది:

సన్ టాన్ తగ్గిస్తుంది:

సన్ టాన్ వల్ల చర్మం చూడటానికి కొంచెం ఇబ్బంది కరంగా ఉంటుంది. టమోటో జ్యూస్ వల్ల మరో ప్రధాన ప్రయోజనం, టమోటో జ్యూసును ముఖం కాళ్ళు, చేతులకు అప్లై చేయడం వల్ల ఇది సన్ టాన్ తగ్గిస్తుంది. చర్మం మీద ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ ను లైట్ గా మార్చుతుంది.

నేచురల్ ఆస్ట్రిజెంట్:

నేచురల్ ఆస్ట్రిజెంట్:

టమోటోలో అధికంగా ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ నేచురల్ యాస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో ఆయిల్ ను నివారించడమే కాకుండా, ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది:

చర్మం ప్రకాశవంతంగా మార్చుతుంది:

ఒక ప్రకాశవంతమైన చర్మం సౌందర్యాన్ని మీరు పొందాలంటే టమోటో జ్యూస్ కి కొద్దిగా సాండిల్ వుడ్ పౌడర్ మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది అలసిన చర్మాన్ని నివారిస్తుంది మరియు ఇది ప్రకాశవంతంగా మార్చుతుంది.

English summary

Tomato Juice Skin Benefits

During winters, the skin becomes dry. When you apply a moisturiser or oil on the face, it becomes too oily and greasy. There are many people who naturally have oily skin and applying such products just worsen the situation. This is where you need to try some home remedies to treat oily skin naturally.
Desktop Bottom Promotion