Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
చర్మం క్రింద కొవ్వు(సెల్యులైట్)కరిగించే ఎఫెక్టివ్ ఆహారాలు
చర్మాన్ని రెండు వేళ్ళతో పట్టుకొని చూస్తే చర్మం దద్దురుగా కనిపించినపుడు దానిని సెల్యులైట్ అంటారు. చర్మం కింద పొరలో కొవ్వు చేరినపుడు ఈ స్థితి ప్రాప్తిస్తుంది. చక్కని శరీర సౌష్టవాన్ని ఇచ్చే వ్యాయామాలు చేయటం ద్వారా సెల్యులైట్‌ని కనిపించకుండా చేయవచ్చు. అలాగే తెల్లటి మేని ఛాయ కలిగినవారి కంటే నలుపు రంగు చర్మం కలిగిన వారికి సైల్యులైట్ అంతగా కనిపించదు.
కాబట్టి మీరు బాగ తెల్లగా ఉంటే, మీకు సెల్యులైట్ అనేది ప్రధాన సమస్యగా ఉంటే కొంచెం ఎండతగిలేలా చేసి నల్లబడడానికి ప్రయత్నించండి. కొన్ని సౌందర్య చికిత్సా పద్ధతులు అలాగే ఔషధాలు సెల్యులైట్‌ని తగ్గించటం కోసం ఉన్నప్పటికీ ఇవి ఏ మేరకు ఫలితాన్నిస్తాయన్నది ప్రశ్నార్థకమే. పైగా వీటితో ప్రమాదాలు ఉండనే ఉన్నాయి.
READ MORE: సన్ రాషెస్ ను నివారించడానికి 8 నేచురల్ రెమెడీస్
ఈ సెల్యులైట్ సమస్య స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఉన్నది. అయితే పురుషులతో పోల్చితే స్త్రీలలోనే ఎక్కువ . ఇది శరీరంలో ఫ్యాట్, మరియు జన్యు సంబంధ, ఈస్ట్రోజెన్ స్థాయిలు మరియు కొన్ని మెడికల్ కండీషన్స్ మరియు సరైన ఇన్సులిన్ లెవల్స్ లో అసమానతలు వల్ల ఈ సెల్యులైట్ ఏర్పడటానికి ప్రధాణ కారణాలు .ఇంకా ఒత్తిడి కూడా కారణమే . ఈ సెల్యులైట్ వల్ల చర్మం అసహ్యంగా..ఇబ్బంది కరంగా కనబడుతుంది. ముందుగా కాళ్లలో మరియు బ్యాక్ పోర్షన్ లో కనబడుతుంది మన శరీరంలో ఏభాగంలో అయిన కనబడవచ్చు.
READ MORE: స్కిన్ అలర్జీ లేదా చర్మం దురదను నివారించే హోం రెమెడీస్
మన శరీరంలో టాక్సిన్స్ ఏర్పటాకు ఇది ఒక లక్షణంగా గుర్తించాలి . ఈ క్రమంలో మీరు తీసుకొని ఆహారం ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం. మరి సెల్యులైట్ ను నివారించే ఆహారాలేంటో తెలుసుకుందాం...

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:
కేల్ మరియు ఆకుకూరల్లో స్కిన్ ఎలాసిటికి సహాయపడే గుణాలున్నాయి . మరియు ఇది రక్తసరఫరాకు సహాయపడుతుంది మరియు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

ఆస్పరాగస్:
ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడి తగ్గిస్తుంది. స్ట్రెస్ వల్ల శరీరంలో క్రొవ్వు అధికంగా చేరుతుంది . కాబట్టి ఆస్పరాగస్ తినడం వల్ల ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

ఉల్లి మరియు వెల్లుల్:
ఈ రెండింటిని రెగ్యులర్ గా తీసుకొన్నట్లైతే హెల్తీ స్కిన్ పొందడానికి సహాయపడుతాయి.

అవొకాడో:
సెల్యులైట్ ఏజింగ్ స్కిన్ తెలుపుతుంది. దీన్నినివారించడానికి , స్థితితాపకతను తక్కువ చేయడానికి అవొకాడోలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మం టైట్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది.

గ్రీన్ టీ:
ఇది ఆహారం కానప్పటికీ ఆహార పానీయాల్లో ఒకటి . సెల్యులైట్ ను నివారించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, రెగ్యులర్ గా గ్రీన్ టీ తీసుకోవాలి.

క్రాన్ బెర్రీ జ్యూస్ :
ఎప్పుడైతే లిప్స్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందో అప్పుడు సెల్యులైట్ సమస్యగా మారుతుంది . ఈ సమస్యను నివారించడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది .

అరటి పండ్లు:
సెల్యులైట్ ఫైటింగ్ ఫుడ్. ఇందులో ఉండే పొటాషియం సెల్యులైట్ తో పోరాడుతుంది.

నిమ్మరసం మరియు బెర్రీస్:
ఎక్కువగా బ్యాక్ పోర్షన్ లో సెల్యులైట్ కనబడుతుంటుంది . కాబట్టి విటమిన్ సి పదార్థాలు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి కి సహాయపడుతుంది . బెర్రీస్ విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ ను రెండింటిని అందిస్తుంది.

చేపలు:
చేపల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు హార్ట్ హెల్త్ ను కాపాడుతుంది.

అల్లం
అల్లం ఆరోగ్యానికి పలువిధాలుగా సహాయపడుతుంది . రక్తప్రసరణకు సహాయపడుతుంది. మరియు చర్మసంరక్షణకు కూడా. కాబట్టి సెల్యులైట్ ఫైటింగ్ ఫుడ్స్ లో దీన్ని చేర్చుకోండి.



Click it and Unblock the Notifications
