Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
చర్మ, కేశ సౌందర్యానికి శెనగపిండితో కొత్త సొగసులు
చర్మసౌందర్యాన్నీ మెరుగుపరుచుకోవడానికి ఏ బ్యూటీపార్లర్లకో వెళ్లడంగానీ, వివిధ రకాల క్రీములు ముఖానికి పూసుకోవడం వంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. మనకు ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలలో వుండే పోషకపదార్థాలు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడమేగాకుండా... ముడతలు పడకుండా నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతాయి. నిపుణులు నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం... క్రీములు వాడటంకంటే ప్రకృతిలో లభించే పదార్థాలే చర్మానికి ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. కాబట్టి క్రీములు వాడకాన్ని ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు మంచిది. ఇక సౌందర్యం విషయానికి వస్తే.. ప్రకృతిలో లభించే పదార్థాలతోపాటు మన ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే శెనగపిండితో కూడా రకరకాల చర్మ సమస్యల్ని, జుట్టు సమస్యల్ని తగ్గించుకోవడంతోపాటు చర్మ, కేశ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
మంచి చర్మం, కేశ సౌందర్యం నిర్వహించడానికి మన వంటగదిలో ఎన్ని ఉన్నా, అందులో శెనగపిండి లేదా పెసరపిండి ఎంపిక చేసుకోవడి ఒక ఉత్తమ ఎంపిక. దీన్ని ఫేస్ ప్యాక్ గా లేదా నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఇవి మనకు ఎల్లప్పుడు మంచి ఫలితాలను అందిస్తాయి. శెనగపిండి లేదా పెసర పిండిని మనం ఇంట్లోనే పౌడర్ చేసుకోవచ్చు లేదా మార్కెట్ నుండి కొనుగోలు చేసుకోవచ్చు .
మార్కెట్ నుండి తెచ్చుకొనేదైతే, మన్నికైన పిండిని ఎంపిక చేసుకోవాలి. శెనపిండి, చర్మానికి మరియు జుట్టుకు కూడా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా? శెనగపిండి చర్మాన్ని శుభ్రం చేసి, ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. కేశ మరియు చర్మసంరక్షణ కోసం శెనగపిండిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అంతే కాదు, అనేక ఆయుర్వే చికిత్సల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు . ముఖం మీద మచ్చలు మరియు మొటిమలు తొలగించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.పెళ్ళి కుమార్తెలో పెళ్లికి ఒక నెల ముందు నుండి శెనగపిండిని ఉపయోగించడం ప్రారంభించండి .
శెనగపిండితో కలిగే కేశ, చర్మసౌందర్య ప్రయోజనాలు :

టాన్ రిమూవర్
ఇది నేచురల్ రిమూవర్ గా పనిచేస్తుంది. 4-5బాదంపప్పులను పౌడర్ చేసి, దానికి ఒక టీస్పూన్ పాలు, నిమ్మరసం మరియు శెనగపిండి చేర్చి బాగా మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుగుకోవాలి. ఇది సన్ టాన్ తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించి ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందండి.

హెల్తీ హెయిర్
ఆరోగ్యకరమై మరియు మంచి షైనింగ్ పొందే జుట్టు కోసం 1 ఎగ్ వైట్, ఒక చెంచా పెరుగు, 2 చెంచాల శెనగపిండి, అరటీస్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టుకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత తలస్నానం చేసుకోవాలి.

చర్మకాంతిని మెరుగు పరుస్తుంది
శెనగపిండి, పాలు మరియు నిమ్మరసంను మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి మరియు శరీరానికి కూడా పట్టించి ఎండిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసేసుకోవాలి . ఇది ఖచ్చితంగా మీ స్కిన్ టోన్ శుభ్రం చేస్తుంది.

జుట్టుకు తగినంత పోషకాలను అందిస్తుంది
మీకు స్ట్రాంగ్ హెయిర్ కోరుకుంటున్నట్లైతే, శెనగపిండికి బాదం, ఆలివ్ ఆయిల్ మరియు పెరుగును మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా అప్లై చేసి, డ్రై అయిన తర్వాత తలస్నానం చేసుకోవాలి . మీ జుట్టు మరియు హెయిర్ రూట్స్ గతంలో కంటే మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఆయిల్ స్కిన్ తగ్గిస్తుంది
ఆయిల్ స్కిన్ మరియు మొటిమలను నివారించడానికి శెనగపిండిలో కొద్దిగా సాండిల్ ఉడ్ పౌడర్, పాలు మరియు కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖం మొత్తానికి పట్టించి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది
అవును, శెనగపిండి కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీ కేశాలు డల్ గా మరియు డ్యామేజ్ కలిగి ఉంటే, పెరుగు మరియు శెనగపిండి మిశ్రమాన్ని మీ కేశాలకు పట్టించి తలస్నానం చేసుకోవాలి. దాంతో మీ కేశాలు మంచి షైనింగ్ తో మరియు మరింత బలంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇంకా ఇది చుండ్రును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే శెనగపిండిలో విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి హెయిర్ రూట్స్ కు అప్లై చేయాలి. మంచి ఫలితం ఉంటుంది.

ఫేషియల్ హెయిర్ గ్రోత్ నివారిస్తుంది
మీ బామ్మగారు లేదా మీ అమ్మగారు వారు ముఖాన్ని శుభ్రం చేయడానికి ఇప్పటికీ శెనగపిండి ఉపయోగించడం మీరు గమనించే ఉంటారు. ఫేషియల్ హెయిర్ గ్రోత్ ముఖ్యంగా నోరు, గడ్డం చుట్టూ ఉన్న, ముఖ్యంగా ముఖం మీద సన్నని జుట్టును పెరుగుదల వదిలించుకోవటం కసం ఈ సాంప్రదాయక పద్దతిని ఉపయోగిస్తుంటారు. శెనపిండి మరియు పసుపు పేస్ట్ లా తయారు చేసి ప్రతి రోజూ ఉదయం సాయంత్రం రెండు పూటలా ఉపయోగించండి.

బాడీ స్ర్కబ్
ఎటువంటి కెమికల్స్ లేని హోం మేడ్ బాడీ స్ర్కబ్ ను మీరు ఉపయోగించాలని కోరుకుంటున్నట్లైతే శెనగపిండి ఒక ఉత్తమ ఎంపిక. అందుకు కొద్దిగా ఓట్స్ ను పౌడర్ చేసి అందులో కార్న్ ఫ్లో మరియు పచ్చిపాలను వేసి మిక్స్ చేసి, మీ శరీరాన్ని స్ర్కబ్ చేస్తే క్లీన్ గా మరియు సాఫ్ట్ గా మారుతుంది.

ఇన్ స్టాంట్ గ్లో
బ్రైడల్ ప్రిపరేషన్ కొరకు, ఇన్ స్టాంట్ ఫెయిర్ నెస్ చాలా అవసరం. ఎండిన ఆరెంజ్ తొక్కను పౌడర్ చేసి అందులో శెనగపిండి, మలై మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ మీకు తక్షణం కాంతివంతంగా మార్చుతుంది.

స్కార్స్ ను తొలగిస్తుంది
మీ చర్మంలో ఎలాంటి స్కార్స్, స్పాట్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. కాబట్టి, శెనగపిండి, పాలు, మరియు పసుపును మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











